MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Mumbai Indians: ముంబైకి ఊపిరిపోసిన తెలుగోడు.! కల్ట్ కంబ్యాక్‌తో మిగిలిన జట్లకు పెద్ద వార్నింగ్..

Mumbai Indians: ముంబైకి ఊపిరిపోసిన తెలుగోడు.! కల్ట్ కంబ్యాక్‌తో మిగిలిన జట్లకు పెద్ద వార్నింగ్..

Mumbai Indians: ఈ ఐపీఎల్ సీజన్ లో సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా తిలక్ వర్మ రికార్డు సృష్టించాడు. తన తొలి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకున్న తిలక్, రాబోయే మ్యాచుల్లో కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.

2 Min read
Author : Pavithra D
Published : Apr 22 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వరుస ఓటములతో కుంగిపోయి..
Image Credit : Mumbai Indians\Twitter

వరుస ఓటములతో కుంగిపోయి..

ఐపీఎల్ 2026లో వరుస ఓటములతో కుంగిపోయిన ముంబై ఇండియన్స్ జట్టును తెలుగోడు తిలక్ వర్మ తన అద్భుత సెంచరీతో గండం గట్టెక్కించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక పోరులో అజేయ శతకంతో చెలరేగి ముంబైకి రెండో విజయాన్ని అందించాడు. ఈ అద్భుత ప్రదర్శన తర్వాత తిలక్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
సంక్షోభంలో ఆపద్బాంధవుడు
Image Credit : ANI

సంక్షోభంలో ఆపద్బాంధవుడు

ముంబై ఇండియన్స్ 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో తిలక్ వర్మ క్రీజులోకి వచ్చాడు. రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా, మిగిలిన స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట తిలక్ రారాజులా నిలబడ్డాడు. అనవసరమైన షాట్లకు పోకుండా, పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేస్తూ గుజరాత్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. సిరాజ్, రబడా, రషీద్ ఖాన్ వంటి మేటి బౌలర్ల బంతులను గౌరవిస్తూనే, గతి తప్పిన బంతులను బౌండరీలకు తరలించాడు.

Related Articles

Related image1
IPL Tickets : సన్ రైజర్స్ మ్యాచ్ టికెట్లపై సూపర్ డిస్కౌంట్.. రూ.1800 టికెట్ రూ.500కే..! ఎలా పొందాలో తెలుసా..?
Related image2
IPL : ఆర్సిబి కెప్టెన్ పాటిదార్ మామూలోడు కాదు.. అతడి నెట్ వర్త్ ఎంతో తెలుసా..?
35
రికార్డు స్థాయి బ్యాటింగ్
Image Credit : Getty

రికార్డు స్థాయి బ్యాటింగ్

కేవలం 45 బంతుల్లోనే తిలక్ వర్మ తన తొలి ఐపీఎల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇందులో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ముంబై స్కోరును 199 పరుగులకు చేర్చాడు. నమన్ ధీర్‌తో కలిసి 52 పరుగులు, హార్దిక్ పాండ్యాతో 81 పరుగుల కీలక భాగస్వామ్యాలను నెలకొల్పి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఈ లక్ష్యాన్ని ఛేదించలేక గుజరాత్ టైటాన్స్ ముంబై బౌలర్ల ముందు తలవంచింది.

45
విజయంపై తిలక్ వర్మ స్పందన
Image Credit : Getty

విజయంపై తిలక్ వర్మ స్పందన

మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ మాట్లాడుతూ.. "ఈ విజయం మా జట్టుకు చాలా అవసరం. వరుసగా నాలుగు ఓటముల తర్వాత గెలవడం ఆనందంగా ఉంది. తొలి 20 బంతుల్లో నేను నెమ్మదిగా ఆడాను, కేవలం బంతిని గమనిస్తూ పిచ్‌పై కుదురుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చాను. ఒత్తిడిలో ఉన్నప్పుడు మన ప్రాథమిక నైపుణ్యాలను(బేసిక్స్) నమ్ముకోవడమే ముఖ్యమని ఈ రోజు నిరూపితమైంది. నమన్ ధీర్ ఇన్నింగ్స్ కూడా మాకు చాలా ప్లస్ అయ్యింది" అని చెప్పుకొచ్చాడు.

55
మూడో ఆటగాడిగా తిలక్ రికార్డు
Image Credit : Getty

మూడో ఆటగాడిగా తిలక్ రికార్డు

ఈ ఐపీఎల్ సీజన్ లో సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా తిలక్ వర్మ రికార్డు సృష్టించాడు. తన తొలి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకున్న తిలక్, రాబోయే మ్యాచుల్లో కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తిలక్ వర్మ ఇలాగే రాణించడం జట్టుకు ఎంతో ముఖ్యం.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్

Latest Videos
Recommended Stories
Recommended image1
SRH : సన్‌రైజర్స్ హైదరాబాద్ కు బ్యాడ్ న్యూస్.. ప్లేఆఫ్స్ చేరడం కష్టమేనా? ఓటమికి కారణాలివే
Recommended image2
GT vs SRH: పూర్తిగా చేతులెత్తేసిన స‌న్‌రైజ‌ర్స్‌.. గుజ‌రాత్ దెబ్బకు చిత్తు
Recommended image3
Virat Kohli: కోహ్లీపై భారీ కుట్ర‌.. కీల‌క విష‌యాలు వెల్ల‌డించిన జ‌ర్మ‌న్ మోడ‌ల్
Related Stories
Recommended image1
IPL Tickets : సన్ రైజర్స్ మ్యాచ్ టికెట్లపై సూపర్ డిస్కౌంట్.. రూ.1800 టికెట్ రూ.500కే..! ఎలా పొందాలో తెలుసా..?
Recommended image2
IPL : ఆర్సిబి కెప్టెన్ పాటిదార్ మామూలోడు కాదు.. అతడి నెట్ వర్త్ ఎంతో తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved