ముంబై, గుజరాత్ మ్యాచ్ : సారా టెండూల్కర్ ట్రెండింగ్.. ట్రోల్స్ తో మార్మోగిన ట్విట్టర్..
ఐపీఎల్ 16వ సీజన్‌లో మంగళవారం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నారు.

క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కూతురు.. సారా టెండూల్కర్ మంగళవారం జరిగిన మ్యాచ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. మంగళవారం నాడు ఈ మ్యాచ్ జరుగుతున్నంత సేపు ట్విట్టర్లో సారా టెండూల్కర్ ట్రెండింగ్ లిస్టులో ఉంది.
దీనికి కారణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా...క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ తెలిసిన విషయమే.. సారా టెండూల్కర్, గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్ మన్ గిల్ ల మధ్య ప్రేమో, ఏదో ఉన్నట్టుగా కొన్నాళ్ల క్రితం నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వారిద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందని వినిపిస్తోంది.
అయితే, వీటిల్లో నిజం ఉందో లేదో తెలియదు కానీ.. టీమిండియాలో శుబ్ మన్ గిల్ పర్మినెంట్ ప్లేస్ సంపాదించినప్పటి నుంచి..శుబ్ మన్ గిల్.. సారా టెండూల్కర్ల మధ్య ఏదో నడుస్తోందంటూ పుకార్లు వస్తున్నాయి.
Image credit: PTI
దీన్ని శుబ్ మన్ గిల్ కొట్టి పడేసాడు. తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పుకొచ్చాడు. కానీ, క్రికెట్ ఫ్యాన్స్ ఊరుకుంటారా.. తమకు నచ్చింది ఊహించేసుకుంటున్నారు.
ఇక ఈ మ్యాచ్ లో మరో విషయం.. సచిన్ టెండూల్కర్ కొడుకు సారా టెండూల్కర్ సోదరుడు అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ నుంచి బరిలో ఉండడం. దీన్ని కూడా క్రికెట్ అభిమానులు ఫన్నీ ట్రోల్స్ చేయడంతో.. ట్విట్టర్ నిన్నంతా మార్మోగిపోయింది.
గుజరాత్ టీం నుంచి శుబ్ మన్ గిల్.. ముంబై జట్టు నుంచి అర్జున్ టెండూల్కర్ ప్రత్యర్థులుగా పోటీపడుతున్నారు. ఓవైపు సోదరుడు మరోవైపు.. స్నేహితుడు సారా ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక మ్యాచ్ చూడడమే మానేసిందంటూ ఫన్నీగా ట్రోల్స్ చేశారు.
ఇంత ఉంటే అంత చేసే ట్రోలర్స్ కి.. ప్రత్యర్థి జట్లలో ఉండడమే వార్త అయితే.. ఇక మ్యాచ్లో శుబ్ మన్ గిల్, అర్జున్ టెండూల్కర్లు ఒక్కసారి మాత్రమే ఎదురుపడ్డారు.
అది కూడా గుజరాత్ టైటాన్స్ తొలి ఓవర్ అర్జున్ వేశాడు. ఆ ఓవర్ లో నాలుగో బాల్ ను గిల్ ఎదుర్కొని ఒక్క పరుగు చేశాడు. రెండో ఓవర్ లోని తొలి బంతికే సాహాను అవుట్ చేయడంతో శుబ్ మన్ గిల్ కు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ను ఎదుర్కొనే ఛాన్స్ రాలేదు.
మరోవైపు అర్జున్ మ్యాచ్లో రెండు ఓవర్లు వేసి తొమ్మిది పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక శుబ్ మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ నుంచి ఈ సీజన్లో మూడో ఆఫ్ సెంచరీ చేసి తన ఫామ్ కంటిన్యూ చేశాడు.
ఇదే.. ఫ్యాన్స్ కి ఆసక్తిని కలిగించింది. అంతేకాదు ఇటు సోదరుడు, అటు శుబ్ మన్ గిల్.. మంచి ప్రదర్శన కనబరిచారని…అందుకే సారాకు ఎలాంటి బాధా కలగలేదని ఫాన్స్ అంటున్నారు.
వారిద్దరూ ప్రత్యర్థులుగా ఎదుర్పడినా కూడా ఎవరూ పై చేయి సాధించకపోవడంతో.. అది కూడా సారాకు సంతోషం కలిగించి ఉంటుందని.. ఊహాగానాలు చేసుకుంటున్నారు.