ధోని అండగా ఉన్నాడు భయ్యా.! చెన్నైకి శాంసన్.. ఆ ఇద్దరు ప్లేయర్స్‌కు బైబై
CSK: ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి కీలక ట్రేడ్ రూమర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంజు శాంసన్ సీఎస్‌కేకు ట్రేడ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

శాంసన్ చెన్నైకి..
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు పలు ట్రేడ్ డీల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సంజు శాంసన్ సీఎస్‌కేకు మారే అవకాశం ఉందన్న ట్రేడ్ డీల్ అయితే తెగ చక్కర్లు కొడుతోంది. అటు శాంసన్ చెన్నైకి రావడంలో ధోని కీలక పాత్ర పోషిస్తున్నాడని టాక్.
సీఎస్‌కే అభిమానులకు గుడ్ న్యూస్
సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2026 ఆడతాడని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. గత సీజన్ మాదిరిగా కెప్టెన్‌గా కాకుండా.. ధోని అన్‌క్యాప్డ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగుతాడని అన్నారు. ఇది సీఎస్‌కే అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.
సంజు శాంసన్ సీఎస్‌కే ట్రేడ్..
సంజు శాంసన్ సీఎస్‌కే ట్రేడ్ దాదాపుగా ఖరారైందని సమాచారం. ఆర్‌ఆర్ సంజు శాంసన్ కోసం రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే లేదా రవీంద్ర జడేజాను అడిగినట్టు తెలుస్తోంది. సీఎస్‌కే తన కీలక ఆటగాళ్లను వదులుకోవడానికి మొదట నిరాకరించినా.. ఇప్పుడు శాంసన్ బదులుగా రాజస్థాన్‌కు రవీంద్ర జడేజా, సామ్ కర్రన్ ట్రేడ్ అవుతారని తెలుస్తోంది. ఈ డీల్ అఫీషియల్ కావడానికి 48 గంటల సమయం పడుతుందని టాక్.
రజత్ పటీదార్‌కు గాయం
మరోవైపు ఆర్‌సీబీ యువ బ్యాట్స్‌మెన్ రజత్ పటీదార్‌కు గాయం కావడంతో ఐపీఎల్ 2026లో అతడు ఆడతాడా.. లేదా.. అనేది స్పష్టత లేదు. ప్రస్తుతమైతే నాలుగు నెలలు ఆటకు దూరం కానున్న రజత్ పటీదార్‌ను ఫ్రాంచైజీ వేలంలోకి పంపాలా అనే ఆలోచనలో ఉన్నట్టు టాక్.
అద్దిరిపోయే ట్రేడ్స్..
ఇక నవంబర్ 15న ఫ్రాంచైజీలు తమ రిలీజ్, రిటైన్ లిస్టును యాజమాన్యాలు ప్రకటించనున్నాయి. అయితే ట్రేడ్ డీల్స్‌కు మరింత సమయం ఉండటంతో.. వేలంలోపే అద్దిరిపోయే ట్రేడ్స్ జరగడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు.