- Home
- Sports
- Most Sixes : ఈ ఐపిఎల్ లో అత్యధిక సిక్సర్లు బాదింది ఎవరో తెలుసా..? మీరు అస్సలు ఊహించి ఉండరు
Most Sixes : ఈ ఐపిఎల్ లో అత్యధిక సిక్సర్లు బాదింది ఎవరో తెలుసా..? మీరు అస్సలు ఊహించి ఉండరు
Most Sixes in IPL 2026 : ఐపిఎల్ సీజన్ ఇంకా సగం కూడా ముగియలేదు… అప్పుడే సిక్సర్ల మోత మోగిపోయింది. ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 ఆటగాళ్లు ఎవరో తెలుసా..? నెంబర్ 1 లో ఎవరునున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఐపిఎల్ సిక్సర్ల మోత మోగిపోయిందిగా..
IPL 2026 : ఒకప్పుడు క్రికెట్ అంటే స్లో బ్యాటింగ్, టెక్నిక్ షాట్లు... అందుకే టెస్ట్ ఫార్మాట్ కు కూడా ఆదరణ ఉండేది. రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్ వంటివారు స్టార్ క్రికెటర్లకు ఎదిగారు. కానీ టీ20 రాకతో క్రికెట్ స్వరూపమే మారిపోయింది... గ్రౌండ్ షాట్లు కాదు గాల్లో షాట్లు ఆడినవారికే క్రేజ్. సచిన్, ద్రవిడ్ మాదిరిగా స్లోగా, టెక్నిక్ ఆట పనికిరాదు... సెహ్వాగ్ లా దూకుడుగా ఆడితేనే అభిమానులకు నచ్చుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఎంట్రీతో క్రికెట్ స్పీడ్ మరింత పెరిగింది.. సిక్సర్లు, ఫోర్లతో స్పీడ్ గా ఆడేవారే క్రికెటర్లు అనే స్థాయి వచ్చేసింది. అందుకే క్రీజులోకి వస్తూనే బ్యాట్ కు పనిచెప్పి పరుగుల వరద పారిస్తున్నారు చాలామంది క్రికెటర్లు.
అయితే ప్రస్తుత ఐపిఎల్ 2026 లో ఇప్పటివరకు ప్రతి టీమ్ నాలుగైదు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ ఎవరు..? అంటే ఏ రోహిత్ శర్మ లేదంటే అభిషేక్ శర్మ పేరో చెబుతారు చాలామంది. కానీ ఆశ్చర్యకరంగా ఈ లిస్ట్ లో ఎవరూ ఊహించని ఆటగాడు టాప్ లో ఉన్నాడు. ఈ ఐపిఎల్ లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 క్రికెటర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. రజత్ పాటిదార్
అవును... మీరు చూసింది నిజమే. ఈ ఐపిఎల్ లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్. ఈ యువ క్రికెటర్ ఓవైపు టీంను విజయపథంలో నడిపిస్తూనే మరోవైపు బ్యాట్ తో రాణిస్తున్నాడు. ఇప్పటివరకు పాటిదార్ కేవలం ఆరు మ్యాచుల్లోనే 21 సిక్సర్లు బాదాడు. అతడి మొత్తం పరుగులు 222 కాగా ఇందులో సగానికి పైగా కేవలం సిక్సర్ల ద్వారా వచ్చినవే. అతడు 213 స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధిస్తున్నాడు.
ఈ ఐపిఎల్ 2026 లో రజత్ పాటిదార్ రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. అతడి బెస్ట్ స్కోర్ 63 పరుగులు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే పాటిదార్ బాదిన ఫోర్ల కంటే సిక్సర్లే ఎక్కువ. ఇప్పటివరకు కేవలం 12 ఫోర్లు మాత్రమే పాటిదార్ ఖాతాలో ఉన్నాయి.
2. వైభవ్ సూర్యవంశి
ఐపిఎల్ 2026 లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లు అనగానే చాలామంది వైభవ్ సూర్యవంశీ ఉంటాడని ఊహించి ఉంటారు. ఈ రాజస్థాన్ రాయల్స్ బుడ్డోడు ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించేలా ఆడుతున్నాడు... ఇలా ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచుల్లో ఏకంగా 18 సిక్సులు కొట్టాడు. మొత్తంగా చూసుకుంటే 263 స్ట్రైక్ రేట్ తో 200 పరుగులు చేశాడు.... ఇందులో 2 హాప్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటివరకు వైభవ్ బెస్ట్ స్కోర్ 78 పరుగులు... ఇతడి ఖాతాల్లో 18 ఫోర్లు కూడా ఉన్నాయి.
3. శ్రేయాస్ అయ్యర్
ఈ ఐపిఎల్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భుతాలు చేస్తున్నాడు. బ్యాటింగ్ తోనే కాదు ఫీల్డింగ్ లో కూడా అదరగొడుతున్నాడు... ఇతడు ఇటీవల బౌండరీవద్ద పట్టిన క్యాచ్ ఈ ఐపిఎల్ కే హైలైట్ గా మారింది. అయితే ఇప్పటివరకు ఐదు మ్యాచులాడిని అయ్యర్ ఏకంగా 14 సిక్సులు, 14 ఫోర్లు కొట్టాడు. మొత్తంగా 187 స్ట్రైక్ రేట్ తో 203 పరుగులు చేశాడు... ఇందులో 3 హాఫ్ సెంచరీలున్నాయి. అయ్యర్ బెస్ట్ స్కోరు 69 నాటౌట్.
4. టిమ్ డేవిడ్
అసలు అంచనాలు లేకుండానే ఐపిఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఆర్సిబి ప్లేయర్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇప్పటివరకు టిమ్ డేవిడ్ 6 మ్యాచులాడి 13 సిక్సర్లు బాదాడు. 216 స్ట్రైక్ రేట్ తో 147 పరుగులు చేశాడు. ఆసక్తికరంగా ఇతడు 9 ఫోర్లు కొట్టాడు.... అంటే ఫోర్ల కంటే సిక్సర్లే ఎక్కువగా బాదాడు. డేవిడ్ బెస్ట్ స్కోరు 70 నాటౌట్.
5. అభిషేక్ శర్మ
ఈ ఐపిఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ అభిమానులను నిరాశపరుస్తున్నాడు. అతడి విధ్వంసాన్ని చూద్దామనుకుంటే నిరాశే ఎదురవుతోంది... అయినప్పటికీ అత్యధిక సిక్సర్ల జాబితాలో నిలిచాడు. ఇప్పటివరకు 5 మ్యాచులాడిన అభిషేక్ 13 సిక్సర్లు బాదాడు... 215 స్ట్రైక్ రేట్ తో 129 పరుగులు చేశాడు. ఇతడి అత్యుత్తమ స్కోరు 74 పరుగులు.

