MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • ఏం కావ్యపాప ఈ పిచ్చి డెసిషన్.? కాటేరమ్మ కొడుకును వదిలిస్తే SRH ఇక అస్సామే..

ఏం కావ్యపాప ఈ పిచ్చి డెసిషన్.? కాటేరమ్మ కొడుకును వదిలిస్తే SRH ఇక అస్సామే..

IPL 2026 ట్రేడ్ విండోలో ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్‌లపై వస్తున్న ఊహాగానాలు.. క్లాసెన్‌ను SRH వదులుకుంటుందన్న వార్తలు వస్తున్నాయి. ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు..

2 Min read
Author : Pavithra D
Published : Nov 04 2025, 05:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కాటేరమ్మ కొడుకు అవుట్..?
Image Credit : SRH\Insta

కాటేరమ్మ కొడుకు అవుట్..?

IPL 2026 ట్రేడ్ విండో ప్రారంభం కాకముందే పలు ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల బదిలీలపై గట్టిగానే చర్చలు జరుగుతున్నాయి. ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, హెన్రిచ్ క్లాసెన్ వంటి కీలక ఆటగాళ్లు ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఈ వార్తలపై ఎంత నిజముందో.. లేదో తెలియదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడ చూసినా ఇదే టాపిక్. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్న ఇషాన్ కిషన్ కోసం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీ పడుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ముంబైతో ట్రేడ్
Image Credit : SRH Instagram

ముంబైతో ట్రేడ్

SRH కిషన్‌ను వదులుకుంటే, మిడిల్ ఆర్డర్ బలోపేతం కోసం ముంబై నుంచి తిలక్ వర్మ వంటి ఆటగాడిని SRH అడిగే అవకాశం ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా ఇషాన్ కిషన్ కోసం ఆసక్తి చూపుతోంది. వారికి గత కొన్ని సీజన్లుగా ఓపెనింగ్, వికెట్ కీపింగ్ సమస్యలు ఉన్నాయి. KKR SRHకి క్యాష్ ట్రేడ్ ఆఫర్ చేసినప్పటికీ, SRH బదులుగా అంగ్రిష్ రఘువంశీ, రమణ్ దీప్ సింగ్ లేదా రింకూ సింగ్ వంటి కీలక ఆటగాళ్లను అడుగుతున్నట్లు సమాచారం. KKR ఈ ఆటగాళ్లను వదులుకోవడానికి సుముఖంగా లేదు.

35
ఇషాన్ కిషన్ కోసం పోటీ
Image Credit : insta

ఇషాన్ కిషన్ కోసం పోటీ

ఇషాన్ కిషన్ కోసం పోటీ పడుతున్న మూడవ జట్టు రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ RR నుంచి నిష్క్రమించడం దాదాపు ఖాయం అయినందున, అతని స్థానంలో ఇషాన్ కిషన్‌ను తీసుకోవాలని చూస్తోంది RR ఫ్రాంచైజీ. RR ప్లేయర్ ప్లస్ క్యాష్ లేదా ప్లేయర్ స్వాప్ రెండింటికీ సిద్ధంగా ఉంది. SRH మాత్రం ఇషాన్ కిషన్‌కు బదులుగా సంజూ శాంసన్‌ను అడుగుతోంది. శాంసన్ జట్టులోకి వస్తే, పాట్ కమిన్స్ తర్వాత కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉందని, అతని ఫ్యాన్ బేస్ SRH బ్రాండ్ విలువను పెంచుతుందని భావిస్తోంది.

45
అటు చెన్నై కీలక ట్రేడ్
Image Credit : X/Mufaddal Vohra

అటు చెన్నై కీలక ట్రేడ్

రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేయడానికి చెన్నై సూపర్ కింగ్స్ ఒక స్పిన్నర్ కోసం చూస్తోంది. వాషింగ్టన్ సుందర్‌ను తీసుకోవడానికి గుజరాత్ టైటాన్స్‌తో ట్రేడ్ ఆఫర్ చేసింది. అయితే దీనికి గుజరాత్ టైటాన్స్ ఒప్పుకోలేదని టాక్. అటు సన్‌రైజర్స్ హైదరాబాద్ హెన్రిచ్ క్లాసెన్‌ను విడుదల చేస్తుందని ఓ వార్త హల్చల్ చేస్తోంది.

55
క్లాసెన్ స్థానంలో స్టార్ ఆల్ రౌండర్
Image Credit : ANI

క్లాసెన్ స్థానంలో స్టార్ ఆల్ రౌండర్

SRH అతనికి మెగా వేలంలోకి వదులుకుని.. మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయడం లేదా.. కామెరాన్ గ్రీన్ వంటి స్టార్ ఆల్ రౌండర్ కోసం ప్రయత్నిస్తుందని కొందరు వాదిస్తున్నారు. అంతేకాదు ఇషాన్ కిషన్, మహమ్మద్ షమీ, క్లాసెన్, అభినవ్ మనోహర్, ఆడమ్ జంపా వంటి ఆటగాళ్లను వదులుకుంటే 50 కోట్ల పర్స్ తో వేలంలోకి వెళ్ళవచ్చని చూస్తోందట.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
most valuable IPL team: ఐపీఎల్‌లో అత్యంత విలువైన జట్టుగా ఆర్సీబీ ఎలా ఎదిగింది?
Recommended image2
IPL 2026: ఢిల్లీకి సంజూ.. కేకేఆర్‌కు రాహుల్.. మెగా వేలంలోకి స్టార్ ప్లేయర్లు.. ఎవరెవరంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved