మన ఫుట్‌బాల్ కెప్టెన్ ప్రేమకథలో ఇన్ని ట్విస్టులా... తన కోచ్ కూతురిని ప్రేమించి పెళ్లాడిన సునీల్ ఛెత్రీ...
ఇండియాలో క్రికెట్‌కి ఉండే క్రేజ్, మిగిలిన క్రీడలకు ఉండదు. ప్రపంచమంతా క్రేజ్ ఉన్న ఫుట్‌బాల్‌ను కూడా ఇక్కడ పెద్దగా పట్టించుకోరు. అది జరిగి ఉంటే భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ రేంజ్ మరోలా ఉండి ఉండేది...
అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన ప్లేయర్‌గా లియోనెల్ మెస్సీనే అధిగమించి, రొనాల్డో తర్వాతి స్థానంలో నిలిచిన సునీల్ ఛెత్రీ పుట్టినరోజు నేడు...
భారత ఫుట్‌బాల్ టీమ్ రాతను మార్చడానికి తన వంతు విశ్వప్రయత్నం చేస్తున్న సునీల్ ఛెత్రీ లవ్‌స్టోరీ వింటే మాత్రం, కచ్ఛితంగా ఆశ్చర్యపోతారు. ఓ థ్రిల్డర్ లవ్‌స్టోరీలో ఉండే ట్విస్టులన్నీ ఛెత్రీ ప్రేమకథలో ఉంటాయి...
సునీల్ ఛెత్రీ, మోహన్ బగన్ కోచింగ్‌లో శిక్షణ తీసుకునేవాడు. మోహన్ బగన్, తన శిష్యుడు సునీల్ ఛెత్రీ ఆట గురించి ఇంట్లో ఆయన కూతురు సోనమ్ భట్టాచార్యకి తెగ చెబుతూ ఉండేవాడు. ఛెత్రీ అలా ఆడతాడు, ఇలా ఆడతాడు... అని తండ్రి చెబుతున్న మాటలకు సోనమ్, సునీల్ ఛెత్రీని చూడకుండానే అభిమానిగా మారిపోయింది.
అలా ఓ సారి తండ్రి ఫోన్‌లో నుంచి సునీల్ ఛెత్రీ ఫోన్ నెంబర్ తీసుకుని, అతనికి మెసేజ్ చేసింది... ‘హాయ్, నా పేరు సోనమ్, నేను మీకు పెద్ద ఫ్యాన్‌ని. మిమ్మల్ని ఓ సారి కలవచ్చా’ అంటూ వచ్చిన మెసేజ్‌ను చూసిన సునీల్ ఛెత్రీ, క్యూరియాసిటీతో ఆమెను కలవడానికి వెళ్లాడు.
అప్పుడు సునీల్ వయసు 18 ఏళ్లు కాగా, సోనమ్ వయసు 15 ఏళ్లు. సోనమ్‌ని చూడగానే... ‘నువ్వు ఇంకా చిన్నపిల్లవి. వెళ్లి చదువుకో...’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు సునీల్ ఛెత్రీ. అయితే సోనమ్ మాత్రం అతన్ని వదలలేదు....
రోజూ మెసేజ్‌లు చేస్తుండడంతో సునీల్ కూడా ఆమెతో మాట్లాడుతూ ఉండేవాడు. అలా ఓ మూడు నెలలు గడిచిన తర్వాత ఓ రోజు, తన కోచ్ మోహన్ ఫోన్ రిపేర్ వచ్చింది. దాన్ని ఫిక్స్ చేయాల్సిందిగా సునీల్ ఛెత్రీకి తీసుకొచ్చి ఇచ్చాడు మోహన్ బగన్...
మోహన్ బగన్ రిపేర్ చేసిన తర్వాత ఓ ఫోన్ కాల్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడాడు సునీల్ ఛెత్రీ. ఆమె వాయిస్, తన గర్ల్ ఫ్రెండ్‌లా ఉండడంతో అనుమానం వచ్చి అడిగేశాడు... ‘ఆయన నా కోచ్, ఈ విషయం తనకి తెలిస్తే నా కెరీర్ నాశనమైపోతుంది. ఇక అన్నీ ఆపేద్దాం...’ అంటూ ఆమెకు చెప్పేశాడు సునీల్ ఛెత్రీ...
అయితే ఆమెతో మాట్లాడకుండా ఎక్కువకాలం ఉండలేకపోయిన సునీల్ ఛెత్రీ, మళ్లీ మెసేజ్‌లు చేయడం మొదలెట్టాడు. అల ఎవ్వరికీ తెలియకుండా కలుసుకునేవాళ్లు. సినిమాలకు కూడా వెళ్లేవాళ్లు...
సినిమాలకు వెళ్లినప్పుడు ఎవ్వరికీ అనుమానం రాకుండా ముందుగా అతను లోపలికి వెళ్లేవాడు, పది నిమిషాల తర్వాత కౌంటర్ వద్ద వెయిట్ చేస్తున్న ఆమె లోపలికి వచ్చేది... అలా దాదాపు 10 ఏళ్ల పాటు సాగిందీ ప్రేమాయణం...
ఎట్టకేలకు ధైర్యం చేసి, తమ ప్రేమాయణం గురించి కోచ్‌కి చెప్పేశాడు సునీల్ ఛెత్రీ. భయపడుతూనే ఆయన ఇంటికి వెళ్లి... ‘సర్, నేను మీ కూతుర్ని ప్రేమిస్తున్నా’ అని చెప్పేశాడు ఛెత్రీ. ఆయన మెల్లిగా... ‘యా...యా... ఓకే’ అంటూ బాత్రూమ్‌లోకి వెళ్లడంతో భయంతో ఛెత్రీకి చెమటలు పట్టేశాయట..
అయితే కామ్‌గా బయటికి వచ్చిన మోహన్ బగన్, నవ్వుతూ సునీల్ ఛెత్రీ, సోనమ్‌ల ప్రేమకు అంగీకారం తెలిపాడట. ఇది జరిగిన కొన్ని నెలలకు 2017, డిసెంబర్ 4న తన ప్రేయసిని పెళ్లాడాడు సునీల్ ఛెత్రీ...