ధోని దగ్గర పులులు.. గంభీర్ ఇలాకాలో పిల్లులు.. ఈ ఇద్దరి ప్లేయర్ల వల్లే సిరీస్ ఓటమి.!
India Vs New Zealand: స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో భారత్ వన్డే సిరీస్‌ను కోల్పోవడం చరిత్రలో ఎన్నడూ లేని పరాభవం. పూర్తిస్థాయి జట్టు ఉన్నా, ఇండోర్‌లోనూ ఓటమి చవిచూసింది. సరైన గేమ్ ప్లాన్ లేకపోవడం, బౌలింగ్.. ఆ వివరాలు ఇలా..

స్వదేశంలో టీమిండియా ఫ్లాప్ షో..
సాధారణంగా స్వదేశంలో బలమైన జట్టుగా పేరున్న టీమిండియా, ఇటీవల కొంతకాలంగా తడబడుతోంది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను స్వదేశంలో కోల్పోవడం చరిత్రలో ఎన్నడూ లేని పరాభవం. పూర్తిస్థాయి జట్టు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్లు ఉన్నప్పటికీ ఈ ఓటమి అభిమానులను ఆశ్చర్యపరిచింది.
సిరీస్ ఓటమి..
మొదటి వన్డేలో భారత్ విజయం సాధించినా, రెండో వన్డేలో న్యూజిలాండ్ పైచేయి సాధించి భారత బ్యాటింగ్, బౌలింగ్ బలహీనతలను బయటపెట్టింది. సిరీస్ డిసైడర్ ఇండోర్‌లో జరగడం, ఇక్కడ భారత్ ఎప్పుడూ ఓడిపోకపోవడంతో అభిమానులు విజయంపై ధీమాగా ఉన్నారు.
ఆ స్పిన్నర్లు దండగ..
టాస్ గెలిచి, న్యూజిలాండ్ ఐదు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా, భారత బౌలర్లు డారియల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్‌లను కట్టడి చేయలేకపోయారు. మిడిల్ ఓవర్లలో బౌలర్లు, ముఖ్యంగా స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ దారుణంగా విఫలమవ్వడంతో న్యూజిలాండ్ 337 పరుగుల భారీ స్కోరు చేసింది.
కీలక ప్లేయర్స్ పెవిలియన్‌కు..
టార్గెట్ ఛేజింగ్‌లో రోహిత్ శర్మ, గిల్, శ్రేయస్ అయ్యర్ విఫలమయ్యారు. కేఎల్ రాహుల్ కూడా త్వరగా పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లీ ఒత్తిడిలో సెంచరీ సాధించినా, భారీ లక్ష్యం ముందు భారత్‌కు ఓటమి తప్పలేదు.
అవే కారణాలు..
సరైన గేమ్ ప్లాన్ లేకపోవడం, పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోవడం, స్పిన్ వైఫల్యం, పేలవమైన ఫీల్డింగ్ వంటి అన్ని విభాగాల్లోనూ టీమిండియా విఫలమై, సిరీస్‌ను కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటోంది. గతంలో నాలుగు ఐసీసీ టోర్నీలతో సహా 16 సార్లు వన్డే క్రికెట్ ఆడేందుకు భారత్‌కు వచ్చిన న్యూజిలాండ్, గతంలో ఎన్నడూ సాధించని ఫలితాన్ని ఇప్పుడు అందుకుంది.

