MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • 2026 టీ20 ప్రపంచకప్ కోసం 5 వేదికలు.. టీమిండియా ఓడిన చోటే మళ్లీ ఫైనల్ మ్యాచ్

2026 టీ20 ప్రపంచకప్ కోసం 5 వేదికలు.. టీమిండియా ఓడిన చోటే మళ్లీ ఫైనల్ మ్యాచ్

T20 World Cup: 2026 ICC పురుషుల T20 ప్రపంచ కప్ ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుందని సమాచారం. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నాయి. ఏడు వేదికలను షార్ట్‌లిస్ట్ చేశారు. 

1 Min read
Author : Pavithra D
Published : Nov 07 2025, 07:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కీలక అప్‌డేట్ వచ్చేసింది
Image Credit : Twitter

కీలక అప్‌డేట్ వచ్చేసింది

2026 ICC పురుషుల T20 ప్రపంచ కప్‌కు సంబంధించి ఒక కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని ప్రతిష్టాత్మక నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఈ T20 ప్రపంచకప్‌ను నిర్వహించనున్నాయి. దీంతో మ్యాచ్‌లు రెండు దేశాల్లోనూ జరగనున్నాయి.

25
ఏడు వేదికలు షార్ట్‌లిస్ట్
Image Credit : Twitter

ఏడు వేదికలు షార్ట్‌లిస్ట్

ఐసీసీ ఈ మెగా ఈవెంట్ కోసం మొత్తం ఏడు వేదికలను షార్ట్‌లిస్ట్ చేసింది. వీటిలో ఐదు వేదికలు భారతదేశంలో ఉండగా, మిగిలిన రెండు శ్రీలంకలో ఉన్నాయి. భారత్‌లో షార్ట్‌లిస్ట్ చేసిన వేదికలలో నరేంద్ర మోదీ స్టేడియం(అహ్మదాబాద్), ఈడెన్ గార్డెన్స్(కోల్‌కతా), అరుణ్ జైట్లీ స్టేడియం(ఢిల్లీ), చెన్నై, ముంబై స్టేడియాలు ఉన్నాయి. ఈ స్టేడియంలు స్పిన్నర్లకు, బిగ్-హిట్టర్లకు అనుకూలంగా ఉంటాయని అంచనా.

Related Articles

Related image1
most valuable IPL team: ఐపీఎల్‌లో అత్యంత విలువైన జట్టుగా ఆర్సీబీ ఎలా ఎదిగింది?
Related image2
IPL 2026: ఢిల్లీకి సంజూ.. కేకేఆర్‌కు రాహుల్.. మెగా వేలంలోకి స్టార్ ప్లేయర్లు.. ఎవరెవరంటే.?
35
 ఓడిన చోటే మళ్లీ ఫైనల్ మ్యాచ్
Image Credit : Twitter

ఓడిన చోటే మళ్లీ ఫైనల్ మ్యాచ్

2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు కూడా అహ్మదాబాద్ అతిధ్యమిచ్చింది. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన ఆ ఫైనల్‌లో భారత్ ఓడిపోయింది. మళ్లీ ఇప్పుడు అదే స్టేడియంలో ప్రపంచకప్ ఫైనల్ నిర్వహించబోతున్నారు. అటు ఈసారి బీసీసీఐ వరల్డ్ కప్ కోసం తక్కువ వేదికలు ఎంచుకుంది.

45
ఎక్కువ మ్యాచ్‌లు కేటాయించే అవకాశం
Image Credit : Twitter

ఎక్కువ మ్యాచ్‌లు కేటాయించే అవకాశం

అలా చూస్తే.. ఈ స్టేడియాలలో ఎక్కువ మ్యాచ్‌లు కేటాయించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అటు పాకిస్థాన్ మ్యాచ్‌లు, సెమీ-ఫైనల్స్ అన్నీ శ్రీలంకలోని వేదికల్లోనే నిర్వహించాలని ఇప్పటికే ఒక ఒప్పందం కుదిరింది. ఒకవేళ పాకిస్థాన్ ఫైనల్‌ చేరితే, ఆ మ్యాచ్ కొలంబోలో జరగనుంది.

55
శ్రీలంక సెమీఫైనల్స్‌కు చేరుకుంటే..
Image Credit : Wikipedia

శ్రీలంక సెమీఫైనల్స్‌కు చేరుకుంటే..

శ్రీలంక సెమీఫైనల్స్‌కు చేరుకుంటే ఆ మ్యాచ్‌ను వారి స్వదేశంలోనే ఆడేలా ఐసీసీ నుంచి సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐసీసీ త్వరలోనే ఈ టోర్నమెంట్ పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రపంచకప్ మ్యాచ్‌లకు తెలుగు రాష్ట్రాలలోని ఒక్క స్టేడియం ఎంపిక కాకపోవడం గమనార్హం.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రీడలు
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG : ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ యుద్ధం.. భారత్ కు తలనొప్పిగా నలుగురు ప్లేయర్లు
Recommended image2
IND vs ENG : ఇంగ్లండ్ వజ్రాయుధం.. ఆ ఒక్కడిని అడ్డుకుంటే భారత్ ఫైనల్‌కు చేరినట్టే !
Recommended image3
IND vs ENG : మనోడి అరాచకం.. వాంఖడేలో భారత్ vs ఇంగ్లాండ్ అసలైన ఫైట్ !
Related Stories
Recommended image1
most valuable IPL team: ఐపీఎల్‌లో అత్యంత విలువైన జట్టుగా ఆర్సీబీ ఎలా ఎదిగింది?
Recommended image2
IPL 2026: ఢిల్లీకి సంజూ.. కేకేఆర్‌కు రాహుల్.. మెగా వేలంలోకి స్టార్ ప్లేయర్లు.. ఎవరెవరంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved