హాకీ వరల్డ్ కప్ 2023: భారత హాకీ జట్టు ఎలా ఉంది... హాకీకి పూర్వ వైభవం తెచ్చేందుకు...
మెన్స్ హాకీ వరల్డ్ కప్ 2023 టోర్నీ నేటి నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. 2018లో హాకీ వరల్డ్ కప్‌కి ఆతిథ్యం ఇచ్చిన ఒడిస్సా, ఈసారి కూడా ప్రపంచకప్‌కి వేదిక ఇవ్వనుంది. హాకీని భారత జాతీయ క్రీడగా గుర్తించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్...
దేశంలో హాకీ క్రీడకి తిరిగి పూర్వ వైభవం తేవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది ఒడిస్సా ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఒడిస్సాలోని భువనేశ్వర్, రోర్‌కేలాల్లో మెన్స్ హాకీ వరల్డ్ కప్ 2023 టోర్నీ జరగనుంది... తొలి మ్యాచ్‌లో భారత జట్టు, స్పెయిన్‌తో తలబడనుంది...
భారత జట్టుకి కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ సింగ్ వ్యవహరించబోతున్నాడు. అమృత్‌సర్‌లో జన్మించిన హర్మన్‌ప్రీత్ సింగ్, ఇండియా అండర్21 టీమ్ తరుపున 30 గోల్స్ చేశాడు. 2015లో భారత హాకీ టీమ్‌లోకి వచ్చిన హర్మన్‌ప్రీత్, 164 మ్యాచుల్లో 126 గోల్స్ సాధించాడు...
భారత హాకీ జట్టు వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ శ్రీజేష్, టీమ్‌లో సీనియర్ ప్లేయర్‌గా ఉన్నాడు. 34 ఏళ్ల శ్రీజేష్ 274 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన శ్రీజేష్, టీమిండియాకి కీలక ప్లేయర్. శ్రీజేష్‌తో పాటు క్రిషన్ పతక్, సురజ్ కర్కేనా భారత హాకీ జట్టుకి వికెట్ కీపర్లుగా వ్యవహరించబోతున్నారు...
టీమిండియా మాజీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, టీమిండియా తరుపున 314 మ్యాచులు ఆడి, భారత జట్టులో అత్యంత అనుభవం ఉన్న ప్లేయర్‌గా ఉన్నాడు. 218 మ్యాచులు ఆడిన మిడ్ ఫీల్డర్ ఆకాశ్‌దీప్ సింగ్,194 మ్యాచులు ఆడిన మన్‌దీప్ సింగ్ టీమ్‌లో సీనియర్ మోస్ట్ ప్లేయర్లు...
131 మ్యాచులు ఆడి 19 గోల్స్ సాధించిన అమిత్ రోహిదాస్, టీమిండియాకి వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. జర్మన్‌ప్రీత్ సింగ్, సురేందర్ కుమార్, వరుణ్ కుమార్, గురిందర్ సింగ్, డిప్సన్ టిర్కీ, నీలం సంజీప్ భారత జట్టుకి డిఫెండర్లుగా వ్యవహరించబోతున్నారు..
మన్‌ప్రీత్ సింగ్, హార్ధిక్ సింగ్, నీలకంఠ శర్మ, శామ్‌సేర్ సింగ్, వివేక్ ప్రసాద్, ఆకాశ్‌దీప్ సింగ్ మిడ్ ఫీల్డర్లుగా వ్యవహరించబోతుంటే మన్‌దీప్ సింగ్, లలిత్ ఉపధ్యాయ్, అభిషేన్, సుక్‌జిత్ సింగ్ ఫార్వర్డ్ ప్లేయర్లుగా ఉన్నారు...