MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Renu Desai: కళ్యాణ్ గారిని తొలిసారి కలిసిన సందర్భం, వాటి గురించి మాట్లాడకపోవడమే మంచిది..రేణు దేశాయ్

Renu Desai: కళ్యాణ్ గారిని తొలిసారి కలిసిన సందర్భం, వాటి గురించి మాట్లాడకపోవడమే మంచిది..రేణు దేశాయ్

డిసెంబర్ 4న రేణు దేశాయ్ తన 44వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రేణు దేశాయ్ కెరీర్, తొలి చిత్రం బద్రి గురించి విశేషాలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 04 2025, 04:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Renu Desai
Image Credit : Instagram/@renuudesai

Renu Desai

రేణు దేశాయ్ పుట్టినరోజు  రేణు దేశాయ్, పవన్ విడిపోయి చాలా కాలం అవుతోంది. కానీ ఇప్పటికీ వీరిద్దరి గురించి అభిమానులు మాట్లాడుతూనే ఉంటారు. పవన్, రేణు దేశాయ్ లకు అకీరా, ఆద్య సంతానం. గురువారం డిసెంబర్ 4న రేణు దేశాయ్ తన 44వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రేణు దేశాయ్ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బద్రి మూవీ విశేషాలు
Image Credit : Instagram/@renudesai

బద్రి మూవీ విశేషాలు

రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో పవన్ కళ్యాణ్, పూరి జగన్నాధ్ బద్రి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటనా ప్రస్థానం చాలా తక్కువే. బద్రి తర్వాత పవన్ కళ్యాణ్ తో జానీ మూవీలో నటించారు. తమిళంలో ఒక సినిమా చేశారు. ఆ తర్వాత రేణు దేశాయ్ హీరోయిన్ గా నటించలేదు. బద్రితో పవన్ తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. దీనితో రేణు దేశాయ్ నటనకి గుడ్ బై చెప్పేశారు. ఇటీవల రవితేజ టైగర్ నాగేశ్వర రావు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. 

Related Articles

Related image1
తనూజకి భరణి ఝలక్.. సుమన్ శెట్టి ఎక్కడ గెలిచేస్తాడో అని ఇమ్మాన్యుయేల్ టెన్షన్
Related image2
ఎంతటి మాస్ హీరో అయినా సరే వెంకటేష్ ని తక్కువ అంచనా వేస్తే అంతే.. 4 సార్లు చిత్తైపోయిన బాలకృష్ణ
36
బద్రి నాకు జీవితాన్ని ఇచ్చింది
Image Credit : Instagram/@renudesai

బద్రి నాకు జీవితాన్ని ఇచ్చింది

ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ బద్రి చిత్రానికి సంబంధించిన విశేషాలు గుర్తు చేసుకున్నారు. పూరి జగన్నాధ్ తో ఈ చిట్ చాట్ జరిగింది. బద్రి మూవీ నాకు జీవితాన్ని ఇచ్చిన చిత్రం. పూరి జగన్నాధ్ గారు నాకు దర్శకుడిగా కంటే రచయితగా ఎక్కువ ఇష్టం అని రేణు దేశాయ్ తెలిపారు. అసలు పూరి జగన్నాధ్ గారు నాకు ఎందుకు ఛాన్స్ ఇచ్చారో తెలియదు. కనీసం ఆడిషన్ కూడా చేయలేదు అని రేణు దేశాయ్ తెలిపారు. దీనికి పూరి స్పందిస్తూ.. మీరు ఎంతో బ్యూటిఫుల్ రేణు గారు అని అన్నారు. నేను ఏం బ్యూటిఫుల్ గా ఉన్నాను అంటూ రేణు దేశాయ్ ఖండించింది. 

46
కళ్యాణ్ గారే మార్చేశారు
Image Credit : Instagram/@renudesai

కళ్యాణ్ గారే మార్చేశారు

అయితే ఈ సినిమా విషయంలో పూరి తనని చీటింగ్ కూడా చేశారు అని రేణు దేశాయ్ పేర్కొంది. బద్రి మూవీలో అమీషా పటేల్ పాత్రలో నేను నటించాల్సింది. కానీ చివరికి వెన్నెల పాత్ర ఇచ్చారు. దీనికి పూరి బదులిస్తూ.. అది నా తప్పు కాదు. అలా మార్చేసింది కళ్యాణ్ గారే. ఈ అమ్మాయి కళ్ళలో నాటీ నెస్ ఉంది. వెన్నెల పాత్రకి బాగా సరిపోతుంది అని మార్చేసినట్లు పూరి పేర్కొన్నారు. 

56
వాటి గురించి మాట్లాడకపోవడమే మంచిది
Image Credit : Sun NXT

వాటి గురించి మాట్లాడకపోవడమే మంచిది

మీ అందరికీ బద్రి మూవీ ఒక సినిమా మాత్రమే.. కానీ నాకు అది లైఫ్. ఆ చిత్రంతోనే కళ్యాణ్ గారితో పరిచయం, ప్రేమ, పెళ్లి జరిగాయి. ఇద్దరు అందమైన పిల్లలని పొందగలిగాను. నా కంటూ ఒక జీవితం ఏర్పడింది అని రేణు దేశాయ్ పేర్కొంది. ఇన్నేళ్ళలో చాలా జరిగాయి అని పూరి జగన్నాధ్ నవ్వుతూ.. పవన్, రేణు దేశాయ్ పర్సనల్ లైఫ్ గురించి పరోక్షంగా అన్నారు. వాటి గురించి మాట్లాడకపోవడమే మంచిది అంటూ రేణు దేశాయ్ తన ముఖాన్ని చేతులతో దాచేసుకుంది. 

66
కళ్యాణ్ గారిని తొలిసారి కలిసింది అప్పుడే
Image Credit : Facebook/@PuriJagannadh

కళ్యాణ్ గారిని తొలిసారి కలిసింది అప్పుడే

కళ్యాణ్ గారిని తొలిసారి మీట్ అయిన సందర్భం తేదీతో సహా గుర్తుంది. మీరే(పూరి జగన్నాధ్) కళ్యాణ్ గారి దగ్గరికి నన్ను జూన్ 6, 1999న తీసుకువెళ్లారు. ఆయన రామానాయుడు స్టూడియోలో తమ్ముడు మూవీ షూటింగ్ లో ఉన్నారు. అప్పుడే తొలిసారి ఆయన్ని కలిశాను. బద్రి తర్వాత నేను చాలా సినిమాల్లో ఆఫర్ ఇచ్చాను. కానీ మీరే చేయలేదు అని పూరి అన్నారు. రేణు దేశాయ్ మాట్లాడుతూ.. ఆ టైంలో నేను కళ్యాణ్ గారితో ప్రేమలో ఉన్నాను.. నా భర్తతో ఉండాలనుకున్నాను. అది ఒక వేరే లైఫ్ అని రేణు దేశాయ్ గుర్తు చేసుకున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha Krishnan: పుకార్లకు చెక్ పెట్టిన త్రిష, లండన్ టూర్‌ వెనుక అసలు కథ ఇదే.. అభిమానులకు గుడ్‌న్యూస్‌
Recommended image2
OTT: థియేటర్స్ లో యావరేజ్, ఓటీటీలో మాత్రం దున్నేస్తున్న పృథ్వీరాజ్ సినిమా.. వారణాసి విలన్ అదరగొట్టడయ్యా
Recommended image3
Toxic 8 Days Collections: నెగటివ్‌ టాక్ తోనూ యష్‌ మూవీకి ఊహించని కలెక్షన్లు.. టాక్సిక్‌ కి ఇంకా ఎంత రావాలంటే?
Related Stories
Recommended image1
తనూజకి భరణి ఝలక్.. సుమన్ శెట్టి ఎక్కడ గెలిచేస్తాడో అని ఇమ్మాన్యుయేల్ టెన్షన్
Recommended image2
ఎంతటి మాస్ హీరో అయినా సరే వెంకటేష్ ని తక్కువ అంచనా వేస్తే అంతే.. 4 సార్లు చిత్తైపోయిన బాలకృష్ణ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved