- Home
- Sports
- Asia Cup 2023 : జైషాతో పీసీబీ చైర్మన్ భేటీ... ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్‌కు గ్రీన్ సిగ్నల్..
Asia Cup 2023 : జైషాతో పీసీబీ చైర్మన్ భేటీ... ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్‌కు గ్రీన్ సిగ్నల్..
ఎట్టకేలకూ ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దుబాయ్‌లో జకా అష్రఫ్-జై షా సమావేశంతో ఇది ఓ కొలిక్కి వచ్చింది.

ఆసియా కప్ 2023.. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్ లో జరగబోతోంది. ఆసియా కప్ కు శ్రీలంక, మపాకిస్తాన్ దేశాలు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలో నాలుగు మ్యాచ్లు పాకిస్తాన్లో జరగనుండగా.. మరో 9 మ్యాచ్లో శ్రీలంకలో జరుగుతాయి. అయితే ఇప్పటివరకు ఆసియా కప్ షెడ్యూల్ విడుదల కాలేదు.
దీనికి కారణం ఉంది. ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్ ని పిసిబి చైర్మన్ గా ఇటీవల ఎన్నికైన జకా అష్రఫ్ వ్యతిరేకించారు. దీంతో. షెడ్యూల్ విషయంలో జాప్యం జరిగింది. అయితే, ఇప్పుడు జకా అష్రఫ్ మాట మార్చారు. తాను అలా అనలేదని అన్నారు. ఆసియా కప్ టోర్నీని పాకిస్తాన్లో నిర్వహించి ఉంటే బాగుండేదని మాత్రమే అన్నట్లుగా చెప్పుకొచ్చారు.
హైబ్రిడ్ మోడల్ ను పిసిబి కొత్త చైర్మన్ ఒకసారి ఒప్పుకోవడం.. మరోసారి ఒప్పుకోకపోవడం.. వల్ల ఆసియా కప్ షెడ్యూల్ విడుదల ఆలస్యం కావడానికి పరోక్ష కారణంగా నిలిచింది. అంతేకాదు ఆసియా కప్ ను వరల్డ్ కప్ తో ముడి పెట్టడంతో.. అసలు ఆసియా కప్ జరుగుతుందా? అని అనుమానాలు కూడా తలెత్తాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షాతో పిసిబి చైర్మన్ జకా అష్రఫ్ భేటీ అయ్యారు. దుబాయిలో సోమవారం రాత్రి ఇద్దరూ కలుసుకున్నారు. ఈ భేటీలో ఆసియా కప్ గురించి మాట్లాడుకున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే స్వయంగా పిసిబి చైర్మన్ జకా అష్రఫ్ ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్ మీద తనకు అభ్యంతరం లేదని వెల్లడించారు.
దీంతో ఆసియా కప్ నిర్వహణపై ఇప్పటివరకు ఏర్పడిన అనుమానాలు తొలగిపోయాయి. రూట్ క్లియర్ అయ్యింది. అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో ఈ శుక్రవారం ఆసియా కప్ 2023 ఫుల్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది.
దీనిమీద పిసీబీ చీఫ్ జకా అష్రఫ్ మాట్లాడారు. ‘ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించడం మాకు సమ్మతమే. దీనికి జై షాతో మీటింగ్ మంచి ఆరంభం.. భారత్ పాకిస్తాన్ క్రికెట్ మైత్రి బంధం రానున్న కాలంలో బలపడే అవకాశాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య రిలేషన్స్ ను పెంచుకుంటూ ముందుకు సాగుతాం’ అని చెప్పుకొచ్చారు.