MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • T20 World Cup Prize Money: వరల్డ్ కప్ కొట్టిన ఆస్ట్రేలియాపై కాసుల వర్షం.. మరి టీమిండియాకు ఎన్ని కోట్లొచ్చాయో తెలుసా?

T20 World Cup Prize Money: వరల్డ్ కప్ కొట్టిన ఆస్ట్రేలియాపై కాసుల వర్షం.. మరి టీమిండియాకు ఎన్ని కోట్లొచ్చాయో తెలుసా?

Womens T20 World Cup 2026 Prize Money: మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియాకు ఐసీసీ భారీ ప్రైజ్ మనీ ఇచ్చింది. రన్నరప్ ఇంగ్లాండ్ కూడా భారీగానే అందుకుంది. మరి టీమిండియాకు దక్కిన మొత్తం మనీ ఎంతో తెలుసా?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 06 2026, 08:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఐసీసీ ప్రైజ్ మనీ లిస్ట్ అవుట్: ఆస్ట్రేలియాపై నోట్ల వర్షం.. రన్నరప్ ఇంగ్లాండ్‌కు ఎన్ని కోట్లంటే?
Image Credit : Getty

ఐసీసీ ప్రైజ్ మనీ లిస్ట్ అవుట్: ఆస్ట్రేలియాపై నోట్ల వర్షం.. రన్నరప్ ఇంగ్లాండ్‌కు ఎన్ని కోట్లంటే?

లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్‌లో విమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని గెలుచుకున్న వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా టీమ్‌పై కాసుల వర్షం కురిసింది. కేవలం విన్నర్ మాత్రమే కాదు.. ఫైనల్‌లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచిన ఇంగ్లాండ్ టీమ్ కూడా భారీ మొత్తాన్ని వెనకేసుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఈ మెగా టోర్నీ కోసం కోట్ల రూపాయల ప్రైజ్ మనీని ప్రకటించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఆస్ట్రేలియా రికార్డ్ విక్టరీ.. 7వ సారి కప్ సొంతం
Image Credit : Getty

ఆస్ట్రేలియా రికార్డ్ విక్టరీ.. 7వ సారి కప్ సొంతం

విమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది ఆస్ట్రేలియా. ఈ గెలుపుతో రికార్డు స్థాయిలో ఏడోసారి వరల్డ్ కప్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆదివారం లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో బెత్ మూనీ, ఫోయెబ్ లిచ్‌ఫీల్డ్ మధ్య జరిగిన సెంచరీ పార్ట్‌నర్‌షిప్ టీమ్ విజయానికి మెయిన్ పిల్లర్‌గా నిలిచింది. కాగా, ఆస్ట్రేలియా టీమ్ ఇంతకుముందు 2010, 2012, 2014, 2018, 2020, 2023 సంవత్సరాల్లో ట్రోఫీలను గెలుచుకోగా, ఇంగ్లాండ్ టీమ్ కేవలం 2009లో ఒకే ఒక్కసారి ఛాంపియన్‌గా నిలిచింది.

36
బెత్ మూనీ వన్ ఉమెన్ షో.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్
Image Credit : Getty

బెత్ మూనీ వన్ ఉమెన్ షో.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్

ఆస్ట్రేలియాకు విమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ అందించడంలో ఓపెనర్ బెత్ మూనీ అద్భుతమైనచ బ్యాటింగ్‌తో అదరగొట్టింది. ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 49 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 64 రన్స్ చేసి అదరగొట్టిన బెత్ మూనీకి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'తో పాటు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు కూడా దక్కింది. ఈ టోర్నీలో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన మూనీ.. 47.60 సగటుతో 238 రన్స్ చేసింది. బ్యాటింగ్‌తోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ 5 క్యాచ్‌లు పట్టి సూపర్ అనిపించుకుంది. ఈ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల లిస్ట్‌లో ఆమె రెండో స్థానంలో నిలిచింది.

46
ఛాంపియన్ ఆసీస్‌కు రూ. 22 కోట్లు.. ఇంగ్లాండ్‌కు రూ. 11 కోట్లు
Image Credit : Getty

ఛాంపియన్ ఆసీస్‌కు రూ. 22 కోట్లు.. ఇంగ్లాండ్‌కు రూ. 11 కోట్లు

లార్డ్స్ లో వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడిన ఆస్ట్రేలియా టీమ్‌కు ఐసీసీ భారీ నజరానా ఇచ్చింది. ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాకు మెరిసిపోయే ట్రోఫీతో పాటు ఏకంగా 2.34 మిలియన్ యూఎస్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 22 కోట్ల భారీ ప్రైజ్ మనీ లభించింది. అలాగే ఫైనల్‌లో రన్నరప్‌గా నిలిచిన ఇంగ్లాండ్ టీమ్‌కు 1.17 మిలియన్ యూఎస్ డాలర్లు అంటే దాదాపు రూ. 11 కోట్ల భారీ అమౌంట్ దక్కింది.

56
టీమిండియాకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
Image Credit : Getty

టీమిండియాకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?

ఇక విమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్స్ వరకు వచ్చి ఓడిపోయిన వెస్టిండీస్, సౌతాఫ్రికా టీమ్స్‌కు సమానంగా ప్రైజ్ మనీ లభించింది. ఈ రెండు జట్లకు 6.7 లక్షల యూఎస్ డాలర్లు అంటే సుమారు రూ. 6.29 కోట్ల చొప్పున ఐసీసీ అందజేసింది. ఇదిలా ఉంటే, ఈ టోర్నీలో నాకౌట్ స్టేజ్‌కు చేరుకోలేకపోయిన మిగిలిన 8 టీమ్స్‌కు కూడా ఐసీసీ ప్రైజ్ మనీ ఇచ్చింది.

ఇందులో ప్రతి టీమ్‌కు రూ. 2.35 కోట్లు లభించాయి. లీగ్ స్టేజ్ దాటలేకపోయిన టీమ్ ఇండియా కూడా ఈ రూ. 2.35 కోట్ల ప్రైజ్ మనీతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వీటితో పాటు గ్రూప్ స్టేజ్‌లో సాధించిన ప్రతి గెలుపునకు గానూ ఆయా టీమ్స్‌కు అదనంగా 31,154 యూఎస్ డాలర్లు అంటే సుమారు రూ. 29 లక్షల చొప్పున ఐసీసీ బోనస్ మనీ ఇచ్చింది.

66
Womens T20 World Cup 2026 Prize Money: ఏ టీమ్‌కు ఎంత ప్రైజ్ మనీ వచ్చింది?
Image Credit : Getty

Womens T20 World Cup 2026 Prize Money: ఏ టీమ్‌కు ఎంత ప్రైజ్ మనీ వచ్చింది?

విన్నర్ టీమ్ (ఆస్ట్రేలియా) - రూ. 22 కోట్లు

రన్నరప్ టీమ్ (ఇంగ్లాండ్) - రూ. 11 కోట్లు

మొదటి సెమీఫైనలిస్ట్ (వెస్టిండీస్) - రూ. 6.29 కోట్లు

రెండో సెమీఫైనలిస్ట్ (సౌతాఫ్రికా) - రూ. 6.29 కోట్లు

నాకౌట్ చేరని జట్లు (భారత్‌తో సహా 8 టీమ్స్) - రూ. 2.35 కోట్లు (ప్రతి టీమ్‌కు)

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
మహిళల క్రికెట్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Recommended image2
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image3
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Related Stories
Recommended image1
T20 World Cup 2026: మా ప్లాన్ అదే.. ఆసీస్ క్లాస్ టీమ్.. మమ్మల్ని దెబ్బకొట్టారు.. ఓటమిపై ఇంగ్లాండ్ కెప్టెన్ ఎమోషనల్ కామెంట్స్ !
Recommended image2
T20 World Cup 2026: ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమి.. ఇంగ్లాండ్ కొంపముంచిన ఐదు తప్పులు ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved