MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • IPLలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు.. 3 హ్యాట్రిక్‌లు సాధించిన ఏకైక బౌలర్ ఎవరు?

IPLలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు.. 3 హ్యాట్రిక్‌లు సాధించిన ఏకైక బౌలర్ ఎవరు?

Three Hat Tricks In IPL : టీ20 క్రికెట్ లో హ్యాట్రిక్ లు సాధించడం అంత తేలికైన విషయం కాదు. కానీ, ఒక బౌలర్ ఐపీఎల్ చరిత్రలో ఏకంగా మూడు హ్యాట్రిక్‌లు సాధించాడు. 2026 సీజన్ లో ఈ రికార్డు బద్దలవుతుందా? ఆ స్పెషల్ బౌలర్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 27 2026, 06:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన గూగ్లీ కింగ్.. మిశ్రా హ్యాట్రిక్ హిస్టరీ మీకు తెలుసా?
Image Credit : Getty

బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన గూగ్లీ కింగ్.. మిశ్రా హ్యాట్రిక్ హిస్టరీ మీకు తెలుసా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ అంటే ఐపీఎల్ 2026 కు రంగం సిద్ధమైంది. శనివారం నుంచి కొత్త సీజన్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. రాబోయే రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులకు మరో పండగే. ఈసారి మైదానంలో ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అదే సమయంలో సీనియర్ ఆటగాళ్ల మెరుపులు కూడా కనిపించనున్నాయి. అయితే, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్న ఒక దిగ్గజ బౌలర్‌ను అభిమానులు ఈసారి మిస్ కానున్నారు. ఆయనే లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఐపీఎల్ లో మూడు హ్యాట్రిక్‌ల వీరుడు
Image Credit : X/ Johns

ఐపీఎల్ లో మూడు హ్యాట్రిక్‌ల వీరుడు

ఐపీఎల్ చరిత్రలో మూడుసార్లు హ్యాట్రిక్ సాధించిన ఏకైక బౌలర్‌గా అమిత్ మిశ్రా ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆయన తన కెరీర్‌లో 2008, 2011, 2013 సంవత్సరాల్లో ఈ ఘనతను సాధించారు. ఐపీఎల్ వంటి బ్యాటర్ల ఆధిపత్యం ఉండే లీగ్‌లో, వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీయడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు.

ఒక బౌలర్ ఒకటి లేదా రెండుసార్లు హ్యాట్రిక్ సాధించడం మనం చూస్తుంటాం. కానీ, మూడు విభిన్న సీజన్లలో, మూడు వేర్వేరు జట్ల తరపున ఆడుతూ ఈ అద్భుతాన్ని చేయడం ఒక అసాధారణమైన విషయం. ఈ రికార్డును బద్దలు కొట్టడం ప్రస్తుత తరం బౌలర్లకు దాదాపు అసాధ్యమని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

36
అమిత్ మిశ్రా హ్యాట్రిక్‌ల ప్రస్థానం ఇదే
Image Credit : our own

అమిత్ మిశ్రా హ్యాట్రిక్‌ల ప్రస్థానం ఇదే

అమిత్ మిశ్రా సాధించిన ఆ మూడు అరుదైన హ్యాట్రిక్‌ల వివరాలు ఇలా ఉన్నాయి..

• మొదటి హ్యాట్రిక్ (2008): అమిత్ మిశ్రా తన తొలి హ్యాట్రిక్‌ను ఢిల్లీ డెర్ డెవిల్స్ తరపున ఆడుతూ సాధించారు. డెక్కన్ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రవి తేజ, ప్రజ్ఞాన్ ఓజా, ఆర్పీ సింగ్‌లను వరుస బంతుల్లో అవుట్ చేసి రికార్డు సృష్టించారు.

• రెండవ హ్యాట్రిక్ (2011): ఈసారి ఆయన డెక్కన్ ఛార్జర్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై 16వ ఓవర్‌లో ర్యాన్ మెక్‌లారెన్, మన్‌దీప్ సింగ్, ర్యాన్ హారిస్‌లను పెవిలియన్ చేర్చి రెండో హ్యాట్రిక్ నమోదు చేశారు.

• మూడవ హ్యాట్రిక్ (2013): సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతూ పూణే వారియర్స్ ఇండియాపై మూడో హ్యాట్రిక్ సాధించారు. 19వ ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్, రాహుల్ శర్మ, అశోక్ దిండాలను వరుసగా అవుట్ చేసి చరిత్ర సృష్టించారు.

46
అమిత్ మిశ్రా ఐపీఎల్ కెరీర్ గణాంకాలు ఇవే
Image Credit : our own

అమిత్ మిశ్రా ఐపీఎల్ కెరీర్ గణాంకాలు ఇవే

అమిత్ మిశ్రా ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకరు. 2008 నుండి 2024 వరకు ఆయన ఈ లీగ్‌లో కొనసాగారు. తన కెరీర్‌లో మొత్తం 162 మ్యాచ్‌లు ఆడిన మిశ్రా, 174 వికెట్లు పడగొట్టారు. బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే గూగ్లీలు, పదునైన లెగ్ స్పిన్ ఆయన ఆయుధాలు. ఐపీఎల్ ప్రయాణంలో ఆయన ఢిల్లీ, హైదరాబాద్, డెక్కన్ ఛార్జర్స్, లక్నో సూపర్ జెయింట్స్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించారు. చివరగా 2024 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఒక మ్యాచ్ ఆడి ఒక వికెట్ తీశారు.

56
అమిత్ మిశ్రా అంతర్జాతీయ కెరీర్ ఎలా సాగింది?
Image Credit : our own

అమిత్ మిశ్రా అంతర్జాతీయ కెరీర్ ఎలా సాగింది?

భారత జట్టు తరపున కూడా అమిత్ మిశ్రా అద్భుతమైన ప్రదర్శన చేశారు. 2003లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఆయన, 2017 వరకు యాక్టివ్‌గా ఉన్నారు.

• టెస్ట్ క్రికెట్: 22 మ్యాచ్‌లలో 76 వికెట్లు తీశారు.

• వన్డే క్రికెట్: 36 మ్యాచ్‌లలో 64 వికెట్లు పడగొట్టారు.

• టీ20 ఇంటర్నేషనల్: 10 మ్యాచ్‌లలో 16 వికెట్లు సాధించారు.

తక్కువ అవకాశాలు వచ్చినప్పటికీ, లభించిన ప్రతి సందర్భంలోనూ తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించారు.

66
ఐపీఎల్ మొదటి హ్యాట్రిక్ ఎవరిదో తెలుసా?
Image Credit : our own

ఐపీఎల్ మొదటి హ్యాట్రిక్ ఎవరిదో తెలుసా?

ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటి హ్యాట్రిక్ సాధించిన బౌలర్ అమిత్ మిశ్రా కాదు. ఆ ఘనత తమిళనాడు పేసర్ లక్ష్మీపతి బాలాజీకి దక్కుతుంది. 2008 తొలి సీజన్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఆయన హ్యాట్రిక్ సాధించారు. ఆ మ్యాచ్‌లో బాలాజీ 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశారు. ఇర్ఫాన్ పఠాన్, పీయూష్ చావ్లా, వి.ఆర్.వి సింగ్‌లను వరుస బంతుల్లో అవుట్ చేసి ఐపీఎల్ చరిత్రలో తొలి హ్యాట్రిక్ బౌలర్‌గా నిలిచారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియా జ‌ట్టు ఖ‌రారు.. ఎవ‌రు ఇన్‌, ఎవ‌రు అవుట్ అంటే.?
Recommended image2
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image3
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Related Stories
Recommended image1
IPL 2026 : కోహ్లీ, ధోనీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. అదేంటో తెలుసా?
Recommended image2
IPL 2026: ఐపీఎల్ 2026 ఫుల్ షెడ్యూల్ వచ్చేసింది.. ముంబై vs చెన్నై ఫైట్ ఎప్పుడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved