MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IPL సందడి వేళ వైజాగ్‌లో ఘోరం.. రన్ అవుట్ వివాదంతో అంపైర్ దారుణ హత్య

IPL సందడి వేళ వైజాగ్‌లో ఘోరం.. రన్ అవుట్ వివాదంతో అంపైర్ దారుణ హత్య

Visakhapatnam: విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్‌లో విషాదం చోటుచేసుకుంది. రన్ అవుట్ వివాదం నేపథ్యంలో 21 ఏళ్ల యంగ్ అంపైర్ అజిత్ బాబు దారుణ హత్యకు గురయ్యారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 06 2026, 10:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రన్ అవుట్ వివాదం.. అంపైర్‌ను కత్తితో పొడిచి చంపిన దుండగుడు
Image Credit : Getty

రన్ అవుట్ వివాదం.. అంపైర్‌ను కత్తితో పొడిచి చంపిన దుండగుడు

దేశమంతా ఐపీఎల్ 2026 సందడిలో మునిగిపోయి ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో క్రికెట్ మైదానంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక చిన్న రన్ అవుట్ వివాదం చినికి చినికి గాలివానలా మారి, ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కేవలం 21 ఏళ్ల వయసున్న స్థానిక అంపైర్ డోలా అజిత్ బాబును ఓ ఉన్మాది కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా చంపేశాడు. క్రీడా స్ఫూర్తితో సాగాల్సిన ఆటలో రక్తపాతం చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
రన్ అవుట్ కాల్‌తో మొదలైన వివాదం
Image Credit : Gemini

రన్ అవుట్ కాల్‌తో మొదలైన వివాదం

విశాఖపట్నంలో ఆదివారం సాయంత్రం మూడు స్థానిక జట్లతో  క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు డోలా అజిత్ బాబు తన స్నేహితుడు బుడుమూరి చిరంజీవితో కలిసి అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్న సమయంలో ఒక రన్ అవుట్ విషయంలో రెండు ప్రాంతాల ఆటగాళ్లు గొడవ పడ్డారు.  అంపైర్ అజిత్ బాబు ఇచ్చిన నిర్ణయంపై కొందరు ఆటగాళ్లు, ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పెద్దలు జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగించారు. దీంతో మ్యాచ్ యధావిధిగా ముగిసింది.

Related Articles

Related image1
IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్ ఇదే.. ఆ బౌలర్ కెరీర్ క్లోజ్ !
Related image2
CSKలో విబేధాలు? అందుకే 10 కోట్ల ప్లేయర్ రిటైర్మెంట్!
34
పక్కా ప్లాన్‌తో అంపైర్‌పై దాడి
Image Credit : Gemini

పక్కా ప్లాన్‌తో అంపైర్‌పై దాడి

మ్యాచ్ ముగిసిన తర్వాత అంతా ప్రశాంతంగా ఉందని అందరూ భావించారు. కానీ, ప్రేక్షకుల్లో ఉన్న కాంత కిషోర్ (26) అనే యువకుడు మనసులో పగ పెంచుకున్నాడు. అంపైర్లు ఇచ్చిన నిర్ణయం పట్ల ఆగ్రహంతో ఉన్న కిషోర్, వివాదాన్ని పరిష్కరించుకుందాం రమ్మని అంపైర్లను సమీపంలోని ఒక జంక్షన్ వద్దకు పిలిపించాడు. అజిత్ బాబు, చిరంజీవి అక్కడికి చేరుకోగానే, కిషోర్ వారితో మళ్లీ వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో నిందితుడు తీవ్రంగా లిక్కర్ సేవించి ఉన్నట్లు సమాచారం. గొడవ పెద్దది కావడంతో కిషోర్ తన వద్ద దాచుకున్న కత్తిని తీసి అజిత్ బాబు ఛాతిలో బలంగా పొడిచాడు.

44
ప్రాణాలు కాపాడే ప్రయత్నం విఫలం
Image Credit : Getty

ప్రాణాలు కాపాడే ప్రయత్నం విఫలం

తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన అజిత్ బాబును కాపాడేందుకు అతని స్నేహితుడు చిరంజీవి, మరో యువకుడు ప్రయత్నించారు. ఆ సమయంలో నిందితుడు వారిపై కూడా దాడి చేయడంతో చిరంజీవికి గాయాలయ్యాయి. వెంటనే అజిత్ బాబును స్థానికులు దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునే లోపే అజిత్ బాబు ప్రాణాలు కోల్పోయాడు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. కేవలం ఒక రన్ అవుట్ విషయంలో ఇంతటి ఘోరానికి పాల్పడటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

నిందితుడి కోసం పోలీసుల వేట

మృతుడి తండ్రి డోలా అప్పలరాజు ఫిర్యాదు మేరకు విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు కాంత కిషోర్ మ్యాచ్ జరుగుతున్న సమయం నుండే అంపైర్లను అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యేనని వారు వాపోతున్నారు. పోలీసులు ప్రస్తుతం భారతీయ న్యాయ సంహిత కింద హత్య కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న కాంత కిషోర్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. గాయపడిన మరో అంపైర్ చిరంజీవి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Playoff: ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన బెంగళూరు.. పంజాబ్ కొంపముంచిన ఓటమి, చెన్నైకి బూస్ట్!
Recommended image2
ODI World Cup 2027: వరల్డ్ కప్ ఆడటంపై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
Recommended image3
IPL 2026: ఫిన్ అలెన్ రచ్చతో పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్.. ఈడెన్ గార్డెన్స్‌లో సిక్సర్ల సునామీ
Related Stories
Recommended image1
IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్ ఇదే.. ఆ బౌలర్ కెరీర్ క్లోజ్ !
Recommended image2
CSKలో విబేధాలు? అందుకే 10 కోట్ల ప్లేయర్ రిటైర్మెంట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved