కాళ్లకు నల్లదారం ఎందుకు కట్టుకోవాలి?
మహిళలు నల్లదారం కాలికి కట్టుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయట. మరి ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం…
మీరు గమనించారో లేదో చాలా మంది తమ పిల్లల కాళ్లకు నల్లదారం కడుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా పెద్దవాళ్లు అయ్యాక కూడా నల్లదారం కడుతూ ఉంటారు. చాలా మంది… దిష్టి తగలకుండా కట్టుకుంటారు అని అనుకుంటారు. కానీ.. మహిళలు నల్లదారం కాలికి కట్టుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయట. మరి ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం…
కొందరు దిష్టి తగలకుండా, మరి కొందరు ఫ్యాషన్ కోసం కట్టుకుంటాం అని చెబుతూ ఉంటారు. కానీ, ఇది కచ్చితంగా మహిళలు కట్టుకోవాలి. వారికి ఎదురయ్యే చాలా రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేసే శక్తి ఈ దారంలో ఉంటుందట.
మహిళలు కాలికి నల్లదారం కట్టుకోవడం అనేది చాలా దేశాల్లో సంప్రదాయంగా వస్తుంది. వారిపై ఎవరిదైనా చెడు కన్ను పడినా, నెగిటివ్ ఎనర్జీ ఎది తగిలినా అది పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా నలుపు రంగు.. చెడు దిష్టిని పోగొడుతుందని నమ్ముతారు.
కాలికి నల్లదారం కట్టడం వల్ల… కాళ్లకు రక్త ప్రసరణ బాగా జరుగుతుందట. రక్తం గడ్డ కట్టడం, రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం లాంటి సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి.
అంతేకాదు.. కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల.. బాడీ పెయిన్స్ రాకుండా ఉంటాయి అని చాలా మంది నమ్ముతారట. సహజంగా ఆక్యుపెంచర్ థెరపీ జరిగేలా సహాయపడుతుందని నమ్ముతారు.
అంతేకాదు.. ఈ నల్లదారం కాలికి కట్టుకోవడం వల్ల పీస్ ఆఫ్ మైండ్ లభిస్తుందని కూడా కొందరు నమ్ముతారట. ఈ పని ఒత్తిడి కారణంగా ఈ రోజుల్లో ఎవరికీ మనశ్శాంతి ఉండటం లేదు. ఈ దారం కట్టుకుంటే.. మళ్లీ మనశ్శాంతి లభిస్తుందట.