ఈ రోజు తులసి ఆకులను అసలే తెంపకూడదు.. లేదంటే?
తులసి చెట్టును ఎంతో పవిత్రమైన మొక్కగా భావిస్తారు. అందుకే హిందూ మతంలో తులసికి సంబంధించిన ఎన్నో నియమాలు ఉన్నాయి. అయితే తులసి ఆకులను ఆదివారాల్లో తెంపకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే?
హిందూ మతంలో తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. తులసి మతపరంగా ముఖ్యమైంది మాత్రమే కాదు.. ఆయుర్వేదంలో కూడా దీని ప్రయోజనాలను ప్రస్తావించారు. తులసిని ఉపయోగించి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అయితే హిందూ మతం ప్రకారం.. తులసికి సంబంధించి నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఈ పవిత్రమైన తులసి ఆకులను ఆదివారాల్లో అసలే తెంపకూడదు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..
హిందూ మత గ్రంథాలలో తులసి ఆకుల మహిమ గురించి ఎంతో చెప్పబడింది. ఈ ఆకులు మనం గొప్ప వరం. పురాణాల ప్రకారం.. తులసి మొక్కపైన లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. అందుకే తులసిని రోజూ పూజించాలని పండితులు చెబుతుంటారు. తులసిని పూజించడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు. అలాగే ఇంట్లో ఎప్పుడూ శాంతి, సంతోషం కలుగుతాయని నమ్ముతారు. అలాగే ఆర్థిక సమస్యలు రావు. నెగిటివిటీ నుంచి కూడా బయటపడతారు.
tulsi puja Diwas 2022
ఆదివారాల్లో ఆకులను తెంపకూడదు
పౌరాణిక విశ్వాసాల ప్రకారం.. తులసి శ్రీమహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైనది. అలాగే హిందూ విశ్వాసాల ప్రకారం.. విష్ణువుకు ఆదివారం అంకితం చేయబడింది. అందుకే ఆదివారం నాడు తులసి ఆకులను తెంపకూడదని పండితులు చెబుతున్నారు.
Image: Getty Images
ఈ సమయంలో తులసిని తెంపకండి
ఆదివారాల్లోనే కాదు.. చంద్రగ్రహణాలు, సూర్య గ్రహణాలు, ఏకాదశి, ద్వాదశి, సూర్యాస్తమయం సమయంలో కూడా తులసి ఆకులను తెంపకూడదు. ఎందుకంటే ఈ తేదీలలో తులసి శ్రీ హరి కోసం నిర్జల వ్రతం ఆచరిస్తుందని నమ్ముతారు. కాబట్టి ఈ రోజుల్లో తులసికి దూరంగా ఉండండి. అలాగే ఈ తేదీల్లో తులసిపై నీళ్లు పోయకూడదని పండితులు చెబుతున్నారు.