MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Spiritual
  • పౌర్ణమి రోజునే రాఖీ ఎందుకు కడతారో తెలుసా?

పౌర్ణమి రోజునే రాఖీ ఎందుకు కడతారో తెలుసా?

పౌర్ణమి రోజున మాత్రమే ఈ రాఖీ పండగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా? దీని వెనక ఉన్న కథేంటో ఎప్పుడైనా తెలుసుకున్నారా..? మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...  

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 17 2024, 10:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

శ్రావణ మాసంలో వచ్చే మొదటి పౌర్ణమి రోజున మనమందరం రాఖీ పండగ జరుపుకుంటూ ఉంటాం. ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 19వ తేదీన జరుపుకుంటున్నాం. అయితే.. అసలు.. పౌర్ణమి రోజున మాత్రమే ఈ రాఖీ పండగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా? దీని వెనక ఉన్న కథేంటో ఎప్పుడైనా తెలుసుకున్నారా..? మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
rakhi 2024

rakhi 2024

రాఖీ పండగను అన్నా, చెల్లెళ్లు, అక్కా-తముళ్ల మధ్య బంధానికి ప్రతీకగా భావిస్తారు. వారి ప్రేమకు చిహ్నంగా ఈ పండగను జరుపుకుంటారు. కేవలం.. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మాత్రమే జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది రాఖీ పండగను ఆగస్టు 19 తెల్లవారుజామున 2:21 నిమిషాల నుంచి..  మధ్యాహ్నం 1గంట 24 నిమిషాల వరకు  ముహూర్తం ఉండనుంది. ఈ సమయంలో మాత్రమే రాఖీ కట్టుకోవాలి.

36

పురాణాల ప్రకారం.. విష్ణుమూర్తి వామనావతారంలో బలి చక్రవర్తి  మహారాజును వరం కోరుకుంటాడు. మూడు అడుగుల నేల కావాలి అంటాడు. ఒక కాలు భూమి మీద, రెండో కాలు ఆకాశంలో పెడతాడు. మూడో అడుగు కోసం ప్లేస్ అడిగితే బలి మహారాజు తన తల చూపిస్తాడు. వామనుడు.. బలి మహారాజు తలపై కాలుపెట్టి.. భూమిలోకి తొక్కేస్తాడు. ఈ కథ తెలిసే ఉంటుంది. ఈ సంఘటన తర్వాత మళ్లీ వామనుడు..బలి చక్రవర్తికి ఓ వరం కూడా ఇస్తాడు.

46

ఈ సంఘటన తర్వాత.... బలి చక్రవర్తి.. వామనావతారంలో ఉన్న విష్ణుమూర్తిని ఒక రోజంతా ఉండమని అడుగుతాడట. అయితే.. ఈ వామన అవతారం తర్వాత విష్ణుమూర్తి లక్ష్మీదేవి వద్దకు వెళ్లాల్సి ఉందట. కానీ.. బలి కోరిక మేరకు ఆగిపోతాడు. అయితే.. విష్ణుమూర్తి ఇంటికి రానందుకు లక్ష్మీదేవి కి బాధపడుతుందట. అప్పుడు నర్మదా దేవి.. లక్ష్మీ దేవికి ఒక సలహా ఇస్తుందట.

56
rakhi traditiom 07

rakhi traditiom 07

బలి చక్రవర్తిని సోదరుడిలా భావించి రాఖీ కట్టమని సలహా ఇస్తుందట. దీంతో.. లక్ష్మీదేవి వెళ్లి.. బలి కి రాఖీ కట్టి... తన భర్త విష్ణుమూర్తిని  తనతోపాటు ఇంటికి తీసుకువచ్చేస్తుందట. 

66

 ఇక లక్ష్మీదేవి.. బలి చక్రవర్తికి రాఖీ కట్టిన రోజు శ్రావణ పౌర్ణమి. అందుకే... అప్పటి నుంచి.. ఈ రోజున ఈ రాఖీ పండగ జరుపుకోవడం ఆనవాయితీ గా వస్తుందట.  అందుకే.. ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజున మాత్రమే రాఖీ జరుపుకుంటూ వస్తున్నామట. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image3
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved