అసలు నుదిటికి బొట్టును ఎందుకు పెట్టుకుంటారో తెలిసా?
తిలకం ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంటుది. నిజానికి తిలకాన్ని ఎందుకు పెట్టుకుంటాం? దీన్ని పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయనే సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. అసలు తిలకం మనకు చేసే ఆధ్యాత్మిక మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
సనాతన ధర్మంలో తిలకాన్ని పెట్టుకునే సంప్రదాయం ఎంతో పురాతనమైంది. దీనిని ప్రజలు నేటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. నిజానికి తిలకాన్ని పెట్టుకోవడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తిలకం వ్యక్తులను ఆధ్యాత్మికతతో అనుసంధానిస్తుంది. అలాగే ఇది మీకెన్నో ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. నిజానికి మనలో చాలా మందికి తిలకం గురించి సరిగ్గా తెలియదు. అసలు దీన్ని ఎందుకు పెట్టుకుంటాం.. దీనివల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పందండి.
తిలకాన్ని ఎందుకు పెట్టుకుంటారు?
సంప్రదాయం ప్రకారం తిలకాన్ని పెట్టుకుంటారని చాలా మంది అనుకుంటారు. నిజానికి ఈ తిలకం ఆధ్యాత్మికతకు చిహ్నంగా భావిస్తారు. తిలకం మూడో కన్ను లేదా అగ్ని చక్రానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ పవిత్ర గుర్తు మనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తుంది.
తిలకం ప్రాముఖ్యత
హిందూమతంలో తిలకాన్ని పెట్టుకోవడాన్ని పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే ఈ తిలకం ద్వారా ప్రజలు ఆధ్యాత్మిక ప్రపంచంతో కనెక్ట్ అవుతారని పండితులు చెప్తారు. ఇది ప్రతికూల శక్తుల నుంచి కూడా రక్షిస్తుందని పండితులు చెప్తారు. తిలక్ గురించి ఒక నమ్మకం కూడా ఉంది. ఇది మనలో ఏకాగ్రత, ధ్యానాన్ని పెంచుతుంది. అలాగే అద్బుతమైన శక్తులను పెంపొందిస్తుంది.
గంధపు తిలకం
గంధపు చెక్క తిలకాన్ని పెట్టుకోవడం వల్ల వారి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుందని నమ్ముతారు. అలాగే ఇది మీలో ఏకాగ్రతను కూడా పెంపొందిస్తుంది. ఈ తిలకాన్ని రోజూ పెట్టుకోవడం వల్ల మానసిక వేదన నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే మీ మనస్సు ధ్యానం వైపు మరలుతుందిన నమ్ముతారు.
కుంకుమ తిలకం
సింధూరంలోని కుంకుమ తిలకాన్ని ఖచ్చితంగా పెట్టుకుంటారు. ఇవి అంతర్గత సౌందర్యం, పట్టుదలను పెంచుతాయని నమ్ముతారు. అంతేకాదు కుంకుమ తిలకం ఎన్నో సమస్యలను, సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుందని నమ్ముతారు. ఇది ఆత్మవిశ్వాసంగా కూడా పనిచేస్తుంది. అలాగే మీ ఏకాగ్రత సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ముఖ్యంగా మానసిక సమస్యలను తొలగిస్తుంది.
పసుపు తిలకం
పసుపులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఈ తిలకాన్ని పెట్టుకోవడం వల్ల మీ చర్మం శుభ్రపడటమే కాకుండా మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది. అలాగే ఇది మనస్సును శుద్ధి చేస్తుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి సహాయపడుతుంది.