కుక్కలు రాత్రిళ్లు ఎందుకు ఏడుస్తాయో తెలుసా?
dog crying signs: కుక్కలకు భవిష్యత్తులో జరగబోయే సంఘటలను తెలుస్తాయని.. వాటి సంకేతాలను మనకు ఇవ్వడానికే అవి మెరగడం లేదా ఏడుస్తాయని అంటుంటారు. అసలు రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు తెలుసా?
పొద్దటిపూట కంటే రాత్రిళ్లే కుక్కలు ఎక్కువగా మొరగడం కానీ, ఏడవడం కానీ చేస్తుంటాయి. ముఖ్యంతా అర్థరాత్రిళ్లు కుక్కలు విపరీతంగా ఏడుస్తుంటాయి. కుక్కలు ఏడవడం అశుభమని.. ఇది చెడుకు సంకేతమని పెద్దలు అంటూ ఉంటారు. మత విశ్వాసాల ప్రకారం.. కుక్క మీ ఇంటి లోపల రాత్రిళ్లు చాలా సేపు మొరగడం లేదా ఏడిచినా.. ఏదో జరగబోతుందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి సమయంలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష్యుల ప్రకారం.. కుక్కలు ఎందుకు ఏడుస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
కుక్కలకు భవిష్యుత్తులో రాబోయే సంక్షోభం లేదా భయంకరమైన ఘటనల గురించి తెలుస్తాయని ఇప్పటికే చాలా మంది నమ్ముతున్నారు. వీటి గురించి తెలుసుకునే అవి ఏడవడం లేదా మొరగడం వంటివి చేస్తాయని అంటుంటారు. ఇవి ఆ సంక్షోభాన్ని వ్యక్తీకరించడానికే ఇలా చేస్తాయని అంటారు.
ఇంటి బయట కుక్క మొరగడం లేదా ఏడవడం..
మీ ఇంటి లోపల కుక్క ఏడిచినా లేదా మొరిగినా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది వ్యాధిని సూచిస్తుంది. అంటే మీ ఇంట్లో ఎవరో ఒకరు ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నట్టు ఇది సూచిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
నెగెటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు..
రాత్రిపూటే కుక్కలు ఎక్కువగా ఏడుస్తుంటాయి. అయితే కుక్క రాత్రిపూట మీ ఇంటి వెలుపల లేదా తలుపు దగ్గర ఏడుస్తున్నట్టైతే.. దాని చుట్టూ ఒక రకమైన ప్రతికూల శక్తి ఉండొచ్చట. దీని వల్ల కూడా కుక్కలు ఏడుస్తాయని చెబుతారు.
పెంపుడు కుక్క ఏడిస్తే..
చాలా సార్లు ఉన్నట్టుండి పెంపుడు కుక్కలు కూడా ఏడుస్తుంటాయి. అలాగే తినడం కూడా మానేస్తుంటాయి. ఇలాంటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకు తెలియని ఎన్నో జరుగుతున్న సంఘటనలను కుక్కలు గ్రహిస్తాయని చెప్తారు. అందుకే కుక్కలు ఏడిస్తే ఇంట్లో ఏదో పెద్ద సంక్షోభం జరగబోతోందని అర్థం చేసుకోవాలంటున్నారు.