రావణాసురుడి భార్య మండోదరిని పూజించేవారు ఉన్నారా..?
పది తలల రాక్షసుడు అయిన రావణాసురుడి భార్య మండోదరిని పూజించే వారు కూడా ఉన్నారు అంటే మీరు నమ్ముతారా..? అసలు.. ఆమెను కూడా ప్రజలు పూజించేలా ఆమెకు ఎవరు వరం ఇచ్చారు..? ఎందుకు ఇచ్చారు..? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
రామాయణంలో రాముడు గురించి తెలిసిన వారికి.. రావణాసురుడు గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి మాట కోసం రాముడు అడవులకు వెళితే.. ఆయన వెంటే సీతాదేవి కూడా అడవులకు వెళ్లింది, ఆ అడవిలోనే సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకెళ్లిపోతాడు. ఆంజనేయస్వామి సహాయంతో.. సీతమ్మ జాడ కనుగొన్న రామయ్య.. రావణాసురుడితో యుద్ధం చేసి, ఆ రాక్షసరాజుని చంపేసి.. సీతాదేవిని మళ్లీ దక్కించుకున్నాడు. ఈ కథంతా మనకు తెలిసిందే. అయితే.. రావణాసురుడి భార్య మండోదరి గురించి మీకు తెలుసా?
సీతా దేవిని ఎత్తుకెళ్లిన సమయంలో.. పర పరుషుడి భార్యను తీసుకురావడం మంచిది కాదని, సీతను వదిలేయమని చాలా సార్లు మండోదరి రావరణాసురుడితో చెప్పిందట. దాని వల్ల లంక కే చేటు జరుగుతుందని ఆమె ఎంత చెప్పినా రావణాసురుడు వినిపించుకోలేదు. కానీ... చివరకు ఆమె చెప్పినట్లే.. లంకా వినాశనమే జరిగింది. ఈ సంగతి పక్కన పెడితే.. సీతారాములను పూజించే గుడులు మన దేశంలో చాలా ఉన్నాయి. వీధికో రామాలయం ఉంటుందన్నా ఆశ్చర్యం లేదు. కానీ.. పది తలల రాక్షసుడు అయిన రావణాసురుడి భార్య మండోదరిని పూజించే వారు కూడా ఉన్నారు అంటే మీరు నమ్ముతారా..? అసలు.. ఆమెను కూడా ప్రజలు పూజించేలా ఆమెకు ఎవరు వరం ఇచ్చారు..? ఎందుకు ఇచ్చారు..? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పురాణాల ప్రకారం, మండోదరి పంచ సాతీలలో ఒకరుగా పరిగణిస్తారు. పంచ సాతీ అంటే ఈ ఐదుగురు స్త్రీలను పూజించడం ద్వారా, వివాహిత స్త్రీలు సర్వోత్కృష్టమైన సౌభాగ్యం పొందుతారని గ్రంధాలలో చెప్పబడింది.
నిజానికి, రావణుడి మరణం తర్వాత, శ్రీరాముడు లక్ష్మణుడు, హనుమంతుడు, మొత్తం వానర సైన్యంతో లంక వెలుపల నిలబడి ఉన్నప్పుడు, మండోదరి రావణుని చివరిసారిగా చూడటానికి వచ్చింది. మృత్యుశయ్యపై ఉన్న రావణుడిని చూసిన మండోదరి ఆగ్రహం కట్టలు తెంచుకుని శ్రీరాముడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మండోదరిని శాంతింపజేయడానికి హనుమంతుడు చాలా ప్రయత్నించాడు.
అయితే ఇది సాధ్యం కాలేదు. మండోదరి కోపాన్ని చూసి, మొత్తం వానర సైన్యం , హనుమాన్ జీ కూడా భయపడిపోయారు, ఎందుకంటే మండోదరి గొప్ప భక్తురాలు, ఆమె భర్త పట్ల విధేయత చాలా కోపంగా మారిందట. అప్పుడు శ్రీరాముడు మండోదరిని శాంతింప చేశాడట. రావణుడు కూడా తన భక్తుడే అని, రావణుడు చాలా నేరాలు చేశాడని, రావణుడు చేసిన తప్పులను కూడా గుర్తు చేశాడట. అది విన్న తర్వాత మండోదరి శాంతించిందట.
అయితే.. ఆమెకు అప్పుడు రాముడు ఒక వరం ఇచ్చాడట. ఎవరైనా వివాహిత స్త్రీ కనుక మండోదరిని పూజిస్తే.. వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుందని రాముడు వరం ఇచ్చాడట. ఆ వరం ప్రకారం.. చాలా మంది స్త్రీలు.. మండోదరిని ఈనాటికీ పూజిస్తూ వస్తున్నారు.