శ్రావణ మాసంలో కలలో పాము కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
కొందరికి అప్పుడప్పుడు కలలు పడితే.. మరికొందరికి మాత్రం ప్రతిరోజూ కలలు పడుతుంటాయి. కొంతమంది మాత్రమే వారికి పడిన కలల గురించి పట్టించుకుంటారు. అయితే శ్రావణ మాసంలో కలలో పాము కనిపిస్తే అర్థమేంటో తెలుసా?
మనలో ప్రతి ఒక్కరూ నిద్రలో ఏదో ఒక కలను కంటుంటారు. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మనకు పడే ప్రతి కల మన నిజ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను గురించి ఎన్నో సంకేతాలను ఇస్తుంది. ఇలాంటి పరిస్థితిలో.. శ్రావణ మాసంలో కలలో పామును చూసినట్టైతే.. దాని అర్థమేంటి? మన జీవితంలో ఏం జరగబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
పామును పట్టుకోవడం..
డ్రీమ్ సైన్స్ ప్రకారం.. శ్రావణ మాసంలో కలలో పామును పట్టుకోవడం చూసినట్టైతే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ కలకు అర్థం మీరు త్వరలోనే డబ్బును సంపాదించబోతున్నారు. ఇలాంటి కల పడితే మీరు ఎలాంటి భయం పెట్టుకోవక్కర్లేదు. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మీరు కలలో పామును పట్టుకోవడమంటే మీ జీవితంలోని అన్ని కష్టాలు త్వరలోనే తొలగిపోతాయి.
పాము తలను పైకెత్తడం చూస్తే..
శ్రావణ మాసంలో మీ కలలో పాము తన తలను పైకి ఎత్తడం మీరు చూసినట్టైతే దాన్ని కూడా శుభసూచకంగా భావిస్తారు. అంటే మీకు మంచి రోజులు రాబోతున్నాయని ఈ కల అర్థం. కలలో పాము తలను పైకి ఎత్తడం చూసినట్టైతే శివుని అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం.
తెలుపు రంగు పాము
శ్రావణ మాసంలో కలలో తెలుపు రంగు పాము కనిపించడాన్ని కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ కల అర్థం మీరు జీవితంలో ఎంతో గౌరవ, పేరు ప్రతిష్టలను పొందబోతున్నారని అర్థం. తెల్లని పాము కలలో కనిపిస్తే మీకు అన్నీ శుభాలే కలుగుతాయి.
snakes 2
పసుపు రంగు పాము
రాత్రి నిద్రలో మీరు కలలో పసుపు రంగు పామును చూడటం కూడా మంచి సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ పసుపు రంగు పాము కలలో కనిపిస్తే మీరు ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారని డ్రీమ్ సైన్స్ చెబుతోంది.
ఆకుపచ్చని పాము..
శ్రావన మాసం సమయంలో మీరు మీ కలలో ఆకుపచ్చని పామును చూసినా అది శుభమే. ఇది చాలా మంచి సంకేతంగా పరిగణించబడుతుంది. దీని అర్థం మీరు కొన్ని శుభ వార్తలను వినబోతున్నారని అర్థం వస్తుంది.