వినాయక చవితినాడు ఈ మంత్రాలు పఠిస్తే.. జీవితంలో తిరుగే ఉండదు!
వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంతా మంచే జరుగుతుందని నమ్మకం. అందుకే అన్ని శుభకార్యాలను గణేషుడి పూజతోనే ప్రారంభిస్తారు. వినాయక చవితినాడు కొన్ని మంత్రాలు జపిస్తే.. ఆయన అనుగ్రహం పొందవచ్చని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.
వినాయక చవితి 2025
ఈ ఏడాది వినాయక చవితి.. ఆగస్టు 27 బుధవారం నాడు వస్తోంది. ఆ రోజు ప్రతి ఒక్కరు వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించి నిష్టగా పూజిస్తారు. వినాయకుడి అనుగ్రహం ఉంటే జీవితంలో అన్నీ శుభాలే జరుగుతాయని నమ్ముతారు. అయితే వినాయక చవితినాడు కొన్ని మంత్రాలు పఠిస్తే.. గణేషుడిని ప్రసన్నం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఆ మంత్రాలేంటో ఓసారి చూసేయండి.
శాంతి, అదృష్టం కోసం..
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనమ్ మే వశమానాయ స్వాహా:
ఈ శ్లోకం చాలా శక్తివంతమైనది. ఇది వినాయకుడిని ఆరాధించే మంత్రం. వినాయక చవితినాడు ఈ మంత్రాన్ని నిష్ఠగా జపించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. జీవితంలో శాంతి, అదృష్టం, విజయం దక్కుతాయి. కోరికలు నెరవేరుతాయి.
కోరికలు నెరవేరడానికి..
ఓం గం గణపతయే సర్వ వరప్రదాయకాయ సర్వేశ్వరాయ సర్వ విఘ్నఛేదాయ సర్వాయ విశ్వకర్మణే నమః:
ఈ మంత్రం చాలా ప్రభావవంతమైనది. అన్నింటికీ అధిపతి అయిన గణేషుడిని పూజించడం ద్వారా.. జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ప్రతి పనిలో విజయం దక్కుతుంది. మనోబలం పెరుగుతుంది. కోరికలు నెరవేరుతాయి.
జ్ఞానం, ఏకాగ్రత కోసం..
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్:
ఈ మంత్రం గణేషుడిని ఆరాధించడానికి శక్తివంతమైన సాధనం. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా జ్ఞానం పెరుగుతుంది. ఏకాగ్రత, తెలివితేటలు పెరుగుతాయి. జీవితంలోని అడ్డంకులను తొలగించి.. మంచి మార్గాన్ని చూపమని కోరుతూ ఈ మంత్రాన్ని జపిస్తారు.
సంతోషం కోసం
ఓం నమో విఘ్న వినాశాయ సర్వ సౌఖ్యప్రదాయినే:
ఈ శ్లోకం అర్థం ఏంటంటే.. విఘ్నాలను నాశనం చేసి.. అన్ని సుఖాలను ప్రసాదించే గణపతికి మా నమస్కారం అని. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. సుఖ సంతోషాలు పెరుగుతాయి.