Vinayaka Chavithi 2025 Date : వినాయక చవితి పండుగ ఎప్పుడు?
మనం జరుపుకుని పవిత్రమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. గణపయ్య దయ, ఆశీస్సులు ఉంటే అన్ని శుభాలే జరుగుతాయని నమ్మకం. అందుకే అన్ని శుభకార్యాల్లో వినాయకుడినే ముందుగా పూజిస్తారు.

Vinayaka Chavithi 2025
ప్రతి ఏడాది వినాయక చవితి భాద్రపద మాసం శుక్ల పక్షం చతుర్థి తిధి నాడు వస్తుంది. ఈ పండుగను అనంత చతుర్ధశి తిధి వరకు జరుపుకుంటారు. గణపయ్యను భాద్రపద మాసం మొత్తం పూజిస్తారు. వినాయకుడిని నియమాల ప్రకారం పూజిస్తే అంతా మంచే జరుగుతుందని నమ్మకం. హిందూ క్యాలెండర్ ప్రకారం.. వినాయక చవితిని ఈ ఏడాది ఆగస్టు 27 న బుధవారం జరుపుకోనున్నాం. వినాయక చవితి పండుగ నాడు గణేషుని విగ్రహాలను ప్రతిష్టించి నిష్టగా పూజిస్తారు.
2025 లో వినాయక చవితి జరుపుకునే తేది
వినాయక చవితి 2025 ఆగస్టు 27వ తేదీ బుధవారం ప్రారంభమై, 2025 సెప్టేంబర్ 6 న శనివారం నాడు ముగుస్తుంది. అంటే సెప్టెంబర్ 6 వినాయక నిమజ్జనం ఉంటుంది. గణపయ్యను విఘ్నాలు కలిగించేవాడంటారు. అలాగే అదృష్టానికి, శ్రేయస్సుకు వినాయకుడిని ప్రతీకగా భావిస్తాం. సుమారుగా 10 లేదా 11 రోజుల పాటు వినాయక చవితి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రతిరోజూ పూజలు చేస్తూ.. భక్తులు భజనలు చేస్తూ ఆడిపాడతారు. వినాయకుడిని నిష్టగా పూజిస్తే అనుకున్న పని జరుగుతుందని ప్రజల నమ్మకం. అందులోనూ దేవతల్లో వినాయకుడే తొలిపూజలు అందుకుంటాడు. ఎందుకంటే ఈ దేవుడి ఆశీస్సులు మనపై ఉంటే ఏ పనైనా ముందుకు సాగుతుందని నమ్మకం. అలాగే ఎలాంటి ఆటంకాలు కూడా ఎదురుకావని చెప్తారు.
Vinayaka Chavithi 2025
అందుకే పూజలు, శుభకార్యాలు, వ్యాపారం ప్రారంభించే ముందు, గృహప్రవేశాలకు వినాయకుడినే ముందుగా పూజిస్తారు. ఇకపోతే ఏటేటా మనం అంగరంగవైభవంగా జరుపుకునే వినాయక చవితి ఒక పూజే కాదు.. ఇంటిళ్లిపాది జరుపుకునే ఒక గొప్ప, పవిత్రమైన పండుగ కూడా.
వినాయకుడికి ఏమేమి సమర్పించాలి?
ఆ తర్వాత మీ ఇంట్లో ఏది ఉంటే అది అంటే ఇత్తడి లేదా రాగి కళషం లేదా చెంబుకు పసుపును రాయండి. దీనిపై పైన రవిక, కొబ్బరి కాయను పెట్టండి. అలాగే దీపాలు వెలిగించి, అగర్బత్తులు పెట్టండి. తర్వాత గణపయ్యకు గరిక, 21 రకాల ఆకులతో వినాయకుడిని అలంకరించి పూజించండి. ప్రసాదంగా వినాయకుడికి మోదకాలు, ఉండ్రాళ్లు, అటుకులు, కొబ్బరికాయలు, పండ్లు వంటివి నైవేద్యంగా సమర్పించండి. ఇప్పుడు మీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా గణేశ అష్టోత్తర శతనామావళిని పఠించండి.
వినాయక పూజ తర్వాత ఏం చేయాలి?
నిష్టగా వినాయకుడిని పూజించిన తర్వాత వ్రత కథను ఖచ్చితంగా చదవండి. వీలుకాకపోతే వినండి. ఆ తర్వాత దేవుడికి హారతి ఇవ్వండి. ఇప్పుడు ప్రసాదాన్ని స్వీకరించండి. గణపయ్యకు పది రోజులు నిష్టగా పూజలు చేసి నిమ్మజ్జనం చేయండి. మీకు తెలుసా? వినాయక చవితిని తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా రాష్ట్రాల్లో కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటారు.