హనుమంతుడి అనుగ్రహం కోసం మంగళవారం నాడు ఇలా చేయండి
హనుమంతుని అనుగ్రహం పొందితే జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అందుకే హనుమంతుడి అనుగ్రహం కోసం మంగళవారం నాడు ఏం పనులు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతలకు అంకితం చేయబడింది. మంగళవారం రామ భక్తుడు హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ రోజు హనుమంతుని అనుగ్రహం పొందితే అంతా మంచే జరుగుతుందని ప్రజలు నమ్ముతారు. అందుకే ఈ రోజు హనుమంతుడి అనుగ్రహం పొందేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం పదండి.
veera hanuman
తిలకం
ప్రతి మంగళవారం హనుమయ్యకు అంకితం చేయబడింది కాబట్టి.. ఈ రోజు హనుమంతుడి ఆలయానికి వెళ్లండి. అలాగే దేవుడి కుడి భుజానికి కుంకుమ తిలకం పూయండి. దీనివల్ల మీరు చేపట్టిన ప్రతి పని ఎలాంటి అడ్డంకు లేకుండా పూర్తవుతుంది. ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి కూడా. దీనివల్ల మీరు చేపట్టిన పనులన్నింటనీ సజావుగా పూర్తి చేయగలుగుతారు. దీనితో పాటు మల్లె నూనెలో కుంకుమపువ్వును కలిపి మంగళవారం భజరంగబలికి సమర్పించండి. ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలోని అన్ని బాధలు, దుఃఖాలు తొలగిపోతాయి.
గులాబీ మాల
మంగళవారం నాడు రుణాన్ని తిరిగి చెల్లిస్తే జీవితంలో మీరు మళ్లీ రుణం తీసుకోవాల్సిన అవసరం ఉండదని నమ్ముతారు. ఇందుకోసం మీరు మంగళవారం నాడు హనుమంతుడి ఆలయానికి వెళ్లి బజరంగబలికి గులాబీ పూలతో చేసిన మాలను సమర్పించండి. ఇలా వరుసగా 7 మంగళవారాలు చేయండి. ఈ పరిహారంతో మీకున్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.
కలహాలకు దూరంగా..
మంగళవారం నాడు హనుమ భక్తులు మాంసాన్ని తినకూడదు. మందును తాగకూడదు. అలాగే ఈ రోజు ఎవరితోనూ వాదించకండి. మంగళవారం నాడు కోపం, కుటుంబ కలహాలకు దూరంగా ఉండండి. ఈ రోజు జుట్టు కత్తిరించడం లేదా గోర్లు కత్తిరించడం అశుభం. మంగళవారం నాడు ఈ నియమాలను పాటిస్తే అశుభ పరిమాణలను నివారించినవారవుతారు.