MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • యానాంలో ఖచ్చితంగా సందర్శించవలసిన ప్రదేశాలు ఏవో తెలుసా?

యానాంలో ఖచ్చితంగా సందర్శించవలసిన ప్రదేశాలు ఏవో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి ఒడ్డున ఉన్న అందమైన ప్రాంతం యానం (Yanam). ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పటికీ పాలన మాత్రం కేంద్ర ప్రాంతమైన పాండిచ్చేరిదే. ఈ ప్రాంతం 200 సంవత్సరాలు ఫ్రెంచ్ పరిపాలనలో ఉంది. 1954 సంవత్సరంలో భారతదేశంలో (India) విలీనం చేశారు. యానం కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో ఒక జిల్లాగా ఉంది. యానంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడి అందమైన వాతావరణం పర్యాటకులకు ప్రశాంతతను కలిగిస్తాయి. యానం తప్పక సందర్శించవలసిన ప్రదేశం. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా యానంలో సందర్శించవలసిన ప్రదేశాలలో గురించి తెలుసుకుందాం..   

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Nov 25 2021, 05:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యానంలో ప్రధాన ఆకర్షణగా ఓవెలిస్క్ టవర్(Obeli tower) ఉంది. ఈ టవర్ నూరు మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ టవర్ పైనుంచి యానంలోను చూస్తే మరింత అందంగా కనిపిస్తుంది. 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను సైతం తట్టుకుని నిలబడుతుంది ఈ టవర్. ఇక్కడ గోదావరి ఒడ్డున ఏనుగులు శివునికి అభిషేకం చేసేటటువంటి ఏర్పాటుచేసిన విగ్రహాలు (Statues) చాలా అందంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి.
 

26

ఇది గోదావరి (Godavari)  ఒడ్డున చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. అలాగే గోదావరి ఒడ్డున జీసస్ స్థూపం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఇక్కడి బాలయోగి బ్రిడ్జి (Balayogi Bridge) రెండు కిలోమీటర్ల పొడవు ఉంటుంది. గోదావరిలో పడవ ప్రయాణం చాలా చక్కని అనుభూతిని కలిగిస్తుంది. అమలాపురానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అప్పనపల్లిలో (Appanapalli) పరమ పవిత్రమైన దేవాలయం ఉంది.
 

36

ఈ దేవాలయాన్ని సందర్శించడానికి వేల సంఖ్యలో భక్తులు నిత్యం వస్తుంటారు. తిరుమల శ్రీనివాసుడు వెలసిన క్షేత్రం ఇది.  ఇక్కడి శ్రీనివాసుల స్వామి బాల బాలాజీ (Balaji) రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడి దేవాలయంలో శ్రీనివాసులు బాలుని రూపంలో దర్శనమిస్తాడు. ఒక భక్తుని (Devotee) కోరిక తీర్చేందుకు తిరుమల శ్రీనివాసుడు అప్పనపల్లిలో కొలువుతీరాడు.
 

 

46

తనను దర్శించుకోవడానికి తిరుమల (Tirumala) కొండపైకి రాలేని భక్తుని కోరిక తీర్చేందుకు స్వామివారే స్వయంగా వచ్చి దర్శనమిచ్చి భక్తునికి మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ విధంగా స్వామి అప్పనపల్లి దేవాలయంలో కొలువై ఉన్నాడు. ఈ దేవాలయంలో నిత్యాన్నదానం జరుగుతుంది. దేవాలయం వెనుక భాగంలో గోశాల (Goshala) ఏర్పాటు చేశారు.
 

 

56

స్వామివారి అభిషేకానికి, ప్రసాదానికి అక్కడి నుండే పాలు (Milk) వస్తాయి. యానంలోని ఫ్రెంచి కాథలిక్ చర్చి ఫ్రెంచి  పరిపాలనను గుర్తుచేస్తుంది. దీనిని సెయింట్ ఆన్స్ కాథలిక్ చర్చి (St. Ann's Catholic Church) అని కూడా పిలుస్తారు. ఈ చర్చి ఐరోపా ఖండపు జీవన శైలిలో (Life style) నిర్మించబడింది. యానంలో ఉన్న మసీదుకు ఒక ప్రత్యేకత ఉంది.
 

 

66

1848 సంవత్సరంలో మసీదు (Masid) నిర్మాణానికి ఫ్రెంచ్ ప్రభుత్వం స్థలాన్ని విరాళంగా ఇచ్చింది. అప్పుడు చిన్న మసీదుగా నిర్మించబడినది. తరువాత 1999 - 2000 సంవత్సరంలో ఈ మసీదు చాలా ఉన్నత మసీదుగా తీర్చిదిద్దారు. ఒకే సమయంలో 200 మంది భక్తులు ఈ మసీదులో ప్రార్థన జరుపుకొనే అవకాశం ఉంది. రంజాన్, బక్రీద్ వంటి ముస్లిం పండుగలు (Festivals) జరుపబడతాయి. ఈ విధంగా అనేక సుందర ప్రదేశాలు యానంలో ఉన్నాయి.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Brahma Muhurtam: బ్రహ్మ ముహూర్తంలో ఈ 2 పనులు చేస్తే ఎంతో శుభం, ఇంతకీ బ్రహ్మ ముహూర్తం అంటే?
Recommended image2
Shivratri: మహా శివరాత్రి రోజున శివయ్య పూజలో వీటిని మాత్రం వాడకూడదు, ఎందుకో తెలుసా?
Recommended image3
కోటి రూపాయ‌లు ఇచ్చినా స‌రే.. ఈ 7 ప్ర‌దేశాల‌కు అస్స‌లు వెళ్ల‌కండి. చాణ‌క్య ఇలా ఎందుకు చెప్పారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved