వారణాసిలో తప్పక సందర్శించవలసిన ప్రదేశాలు ఏంటో తెలుసా?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో అనేక సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. వారణాసి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. వారణాసి (Varanasi) సందర్శన పర్యాటకులకు పవిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రదేశము పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటాయి. వారణాసి సందర్శన ఒక చక్కని అనుభూతిని కలిగించి వారికి జీవితాంతం గుర్తుండే మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా వారణాసిలో తప్పక చూడవలసిన సందర్శనీయ ప్రదేశాలు గురించి తెలుసుకుందాం..
వారణాసిలో ముఖ్యంగా జరుపుకునే పండుగలు గంగా ఫెస్టివల్, రామ్‌లీలా (Ram Leela), భారత్ మిలాప్, హనుమత్ జయంతి, నక్కాట్యా, పంచ్ కోషి పరిక్రమ మరియు మహాశివరాత్రి, కార్తీక్ పూర్ణిమ (Karthik Purnima), బుద్ధ పూర్ణిమ, ఉన్నాయి. వీటిని తిలకించడానికి భారతదేశంలోని నలుమూలల నుంచి అనేక వేల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. అయితే వారణాసిలో పర్యటనకు అనుకూలంగా జౌన్‌పూర్, చునార్, సారనాథ్ ఉన్నాయి. వారణాసిలో సందర్శించాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.
ఒక్కొక్క ప్రదేశానికి ఒకొక్క విశిష్టతను కలిగి పర్యాటకులకు ఆకట్టుకునేలా ఉంటాయి. వారణాసి కాశీగా (Kashi) కూడా ప్రసిద్ధి. ఇక్కడ ప్రధాన ఆకర్షణగా రామ్ నగర్ దుర్గ్, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ది ఘాట్స్ ఆఫ్ వనరాసి, సెయింట్ మేరీ చర్చి, భారత్ కాలా మ్యూజియం ఉన్నాయి. వీటితో పాటు ప్రధాన పుణ్యక్షేత్రాలుగా భారత్ మాతా ఆలయం (Bharat Mata Temple), దుర్గా ఆలయం, కాశీ విశ్వనాథ్ ఆలయం, తులసి మనస్ ఆలయాలు ఉన్నాయి. ఇలా ఎన్నో సందర్శనీయ ప్రదేశాలు వారణాసిలో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..
సారనాథ్: వారణాసికి దగ్గరగా పది కిలోమీటర్ల దూరంలో సారనాథ్ (Sarnath) ఉంది. జ్ఞానప్రాప్తి తర్వాత బుద్ధుడు తన మొదటి ఉపదేశం ఇక్కడే ఇచ్చాడట. జైన, హిందూ ధర్మాలలో చాలా ప్రసిద్ధి చెందిన లుంబిని, బౌద్దియా, ఖుషినగర్, సారనాథ్ తీర్థాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా జరుపుకునే బుద్ధపూర్ణిమ (Buddhapurnima) పండగను సందర్శించడానికి పర్యాటకులు అనేక వేల సంఖ్యలో వస్తుంటారు.
గంగా నది హారతి: వారణాసిలో ప్రతిరోజు సాయంత్రం వేళ నిర్వహించే గంగా నది హారతిని (Ganga river horticulture) తిలకించిన అనేక పుణ్య ఫలములు కలుగును అని భక్తుల నమ్మకం. గంగా హారతి తిలకించడానికి వేల సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. ఈ అపురూపమైన ఘట్టం గొప్ప దైవత్వాన్ని అనుభవించేలా చేస్తుంది. ప్రకాశవంతమైన వెలుగులతో గంగానది అద్భుతమైన దృశ్యాలను తిలకించిన ఆధ్యాత్మికత (Spirituality) కలగజేస్తోంది.
దశశ్వమేధ ఘాట్: ఈ ఘాట్ అత్యంత ప్రాచీనమైన ఘాట్. ఈ ఘాట్ కాశీ విశ్వనాథ ఆలయానికి అత్యంత సమీపంలో ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ ఘటనను సృష్టించారని చెబుతారు. ఇది వారణాసిలో ప్రధాన ఆకర్షణగా ఉంది. దశశ్వమేధ ఘాట్ (Dasashwamedh Ghat) తో పాటు ఆసి, బర్నసంగం, పంచగంగా, మణికర్ణికలు కూడా ప్రధాన ఆకర్షణలుగా (Attractions) వారణాసిలో ఉన్నాయి.
పడవ ప్రయాణం: వారణాసిలో గంగానదిలో పడవ ప్రయాణం (Boating) ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. పడవ మీద ప్రయాణిస్తూ సూర్యాస్తమయం, సూర్యోదయం చూడడం మనసుకు చక్కని అనుభూతిని కలిగిస్తుంది. పడవ ప్రయాణం చేస్తూ ఒక ఘాట్ నుంచి మరో ఘాట్ (Ghat) కు వెళ్ళవచ్చు. వారణాసిలో గంగానదిలో పడవ ప్రయాణం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.