- Home
- Life
- Spiritual
- Myth Vs Facts: చంద్రుని ప్రభావం జుట్టుపై ఉంటుందా? పౌర్ణమి రోజు జుట్టు కత్తిరించాలా..?
Myth Vs Facts: చంద్రుని ప్రభావం జుట్టుపై ఉంటుందా? పౌర్ణమి రోజు జుట్టు కత్తిరించాలా..?
Myth Vs Facts: మీరు జుట్టు కత్తిరించుకుంటున్నారా? అమావాస్య, పౌర్ణమిల సమయంలో హెయిర్ కట్ చేస్తున్నారా? ఎప్పుడు కట్ చేస్తే జుట్టు పెరుగుతుందో..? ఎప్పుడు చేస్తే… హెయిర్ గ్రోత్ ఆగిపోతుందో మీకు తెలుసా? దీని గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి?

Moon Effect on Hair Growth
జోతిష్య శాస్త్రంలో గ్రహాలు మన జీవితంపై చాలా ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి. అదేవిధంగా.. మన జీవితంపై చంద్రుడి ప్రభావం కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా మన మానసిక స్థితిని చంద్రుడు ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాడని నమ్ముతారు. ఇదే చంద్రుడు మన జుట్టు పెరుగుదలపై కూడా ప్రభావం చూపిస్తుందా..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారు? దీనిలో నిజం ఎంత అనే విషయం ఇప్పుడు చూద్దాం...
జుట్టు ఎప్పుడు కత్తిరిస్తే.. వేగంగా పెరుగుతుంది..?
పురాతన సంప్రదాయాల ప్రకారం, చంద్రుడు మారే దిశలు అంటే.. అమావాస్య నుంచి పౌర్ణమి వరకు.. ఆ సమయంలో జుట్టు కత్తిరించడం వల్ల అది వేగంగా, ఆరోగ్యంగా పెరుగుతుందని నమ్ముతారు. చంద్రుని శక్తి ఈ సమయంలో అత్యధికంగా ఉంటుందని భావిస్తారు. మరోవైపు, చంద్రుడు క్షీణించే సమయం అంటే.. పౌర్ణమి తర్వాత నుంచి అమావాస్య వచ్చేటప్పుడు జుట్టు కత్తిరిస్తే... ఆ జుట్టు తొందరగా పెరగదని, చంద్రుని కాంతి తగ్గినట్లే... జుట్టు పెరుగుదల కూడా తగ్గిపోతుందని నమ్ముతారు.
ఈ నమ్మకం ఎలా మొదలైంది..?
ఈ భావన ‘చంద్ర వ్యవసాయం’ ( Lunar Gardening) సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది. రైతులు పంటలు నాటే, కోసే సమయానికి చంద్రుని దశల ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ విధంగా చంద్రుని ఆకర్షణ శక్తి నీటి మాదిరిగానే శరీరంలోని ద్రవాలపై కూడా ప్రభావం చూపుతుందనే నమ్మకం ఉంది.
జుట్టు కత్తిరించడానికి సరైన సమయం....
పౌర్ణమి సమయంలో జుట్టు కత్తిరించడం అత్యుత్తమమైన సమయం అని పూర్వీకులు చెబుతుంటారు. రాత్రి చంద్రుని కాంతి పెరుగుతుంది. ఆ సమయంలోనే జుట్టు బలంగా, మందంగా పెరుగుతుందని నమ్ముతారు.
ఈ సమయంలో జుట్టు కత్తిరించకూడదు...
అమావాస్య లేదా చంద్రుడు తగ్గే దశల్లో జుట్టు కత్తిరించడం మంచిది కాదని సంప్రదాయ విశ్వాసాలు చెబుతాయి. ఆ సమయంలో కత్తెరను జుట్టు దగ్గర పెట్టకూడదని అంటారు, ఎందుకంటే చంద్రుని శక్తి తగ్గిపోతుంది. దాని ప్రభావం జుట్టు పై కూడా పడుతుందని నమ్ముతారు.
శాస్త్రీయ ఆధారాలు ఏమైనా ఉన్నాయా?
ఈ నమ్మకాలకు శాస్త్రీయ ఆధారాలు లేవు. జుట్టు పెరుగుదల ప్రధానంగా హార్మోన్లు, జన్యు లక్షణాలు, ఆహారం, ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. చంద్రుని దశలు జుట్టు వృద్ధిపై ఎలాంటి ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని నిర్ధారించే ఆధారాలు లేవు.
జుట్టు పెరగాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
జుట్టు పెరగాలంటే.. తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సరైన విటమిన్లు ఉన్న ఆహారాలు తీసుకోవాలి. విటమిన్ ఏ, సి, డి, ఈ, బయోటిన్, ఐరన్, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారాలు తీసుకోవాలి. 6 నుంచి 8 వారాలకు ఒకసారి హెయిర్ ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి. దీని వల్ల జుట్టు తెగిపోకుండా ఉంటుంది. మీ జుట్టు రకానికి సరిపడే షాంపూ, కండిషనర్ ఉపయోగించాలి. రెగ్యులర్ గా హెయిర్ మసాజ్ చేయాలి. దీని వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి..జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.
ఫైనల్ గా....
చంద్రుని దశలు జుట్టు పెరుగుదలపై ప్రభావం చూపుతాయని చెప్పే నమ్మకాలు శాస్త్రీయంగా నిరూపించకపోయినా, ఈ సంప్రదాయాలు మనకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తాయి. మన జుట్టు ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.