sri Krishna Janmashtami 2022: అసలు శ్రీ కృష్ణ జన్మాష్టమి ఆగస్టు 18వ తేదీనా లేక 19 ? పండితులు ఏం చెబుతున్నారంటే
sri Krishna Janmashtami 2022: మొన్న రాఖీ పండుగకు కూడా ఇంలాంటి డౌటే చాలా మందికి వచ్చింది. ఇప్పుడు శ్రీ కృష్ణ జన్మాష్టమికి కూడా ఇలాంటివే సందిగ్దతే మొదలైంది. ఇంతకీ జన్మాస్టమి ఏ తేదీన జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
janmashtami 2022
sri Krishna Janmashtami 2022: రాఖీ పండుగ తర్వాత వచ్చే శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ విషయంలో చాలా మందికి సందిగ్దత నెలకొంది. అసలు ఈ పండుగ 18 తారీఖా.. లేకపోతే 19 తారీఖా అని..
కన్నయ్య వసుదేవుడు, వేదకీ దంపతులకు.. శ్రావణ మాసంలోని కంసుడి చెరసాలలో కృష్ణ పక్షం అష్టమి తిథినాడు పుడతాడు. శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో రోహిణి నక్షత్రం ఉండేదని విశ్వసిస్తారు. అందుకే జన్మాష్టమి పండుగను జరుపుకునేటప్పుడు రోహిణి నక్షత్రాన్ని పరిగణలోకి తీసుకుంటారు. కానీ ఈసారి రోహిణి నక్షత్రం కొద్దిసేపు మాత్రమే ఉన్నది.అంటే ఈసారి జన్మాష్టమి నాడు రోహిణి నక్షత్రం యాదృచ్ఛికం కాదు.మొత్తంగా పండితులు చెబుతున్న మాటేంటంటే.. ఈ ఏడాది గోకులాష్టమి ఆగస్టు 19 తారీఖున వస్తుంది.
అంటే అష్టమి ఆగస్టు 18 అంటే గురువారం 12: 16 నిమిషాల తర్వాత వస్తుంది. ఇక తర్వాత రోజు 19 తారీఖు వరకు ఇది ఉండి.. ఆ రోజు అర్థరాత్రి 1:04 వరకు కొనసాగుతుంది. అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి 19 శుక్రవారం అని క్లారిటీ వచ్చింది. ఇక గురువారం రోజు జన్మాష్టమని చాలా మంది అంటుంటారు. ఎందుకంటే అదేరోజు అర్థరాత్రి 12 గంటలకు కన్నయ్య జన్మించాడని.. అదే రోజు జరుపుకోవాలని అంటుంటారు.
ఇక పోతే హిందువుల సంప్రదాయం ప్రకారం.. పండుగలను సూర్యోదయం సమయంలో ఉన్న తిథినే తీసుకుని జరుపుకుంటారు. అందుకే గోకులాష్టమీ శుక్రవారం జరుపుకుంటారు. అంటే ఈ పండుగ 18 వ తేదీనాడు అర్థరాత్రి మొదలై..ఆ తర్వాతి రోజు అర్థరాత్రి వరకు ఉంటుంది. అందుకే పండుగను శుక్రవారం జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.
ఈ గోకులాష్టమి నాడు కన్నయ్యని నిష్టగా పూజిస్తే.. సకల పాపాలన్నీ పోయి.. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇక రోజున శ్రీకృష్ణుడి దేవాలయాలను ఖచ్చితంగా దర్శించుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల ఎంతో పుణ్య ఫలం దక్కుతుందట. అలాగే మోక్షప్రాప్తి పొందుతారట. సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలన్నీ తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అనుకున్నది జరగాలంటే శ్రీకృష్ణుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలని పండితులు చెబుతున్నారు.
శ్రీకృష్ణాష్టమి నాడు అంటే 18 వ తేది అర్థరాత్రిన లేచి శ్రీకృష్ణుణ్ణి పూజించాలట. అలాగే తర్వాతి రోజు ఉదయం భగవద్గీత, భాగవతాన్ని చదవాలని పండితులు చెబుతున్నారు. శ్రీకృష్ణాస్టమి రోజు ఉపవాసం ఉండి.. సాయంత్రం గుడికి వెళ్లి ఉపవాసాన్ని విడిచిపెడితే.. మీకు అన్నీ శుభాలే కలుగుతాయని పండితులు చెబుతున్నారు.