MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • వెంటనే దిష్టి పోవాలంటే.. ఈ 4 శక్తివంతమైన వస్తువులు చాలు!

వెంటనే దిష్టి పోవాలంటే.. ఈ 4 శక్తివంతమైన వస్తువులు చాలు!

హిందూ సంప్రదాయంలో దిష్టిని తీవ్రంగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి అసూయతో చూసిన చూపు ఎదుటి వ్యక్తి జీవితంలో తీవ్ర నష్టం కలిగిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. మరి దిష్టిని తరిమికొట్టాలంటే ఏం చేయాలో? పండితులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Nov 18 2025, 02:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దిష్టి తగిలితే ఏమవుతుంది?
Image Credit : Getty

దిష్టి తగిలితే ఏమవుతుంది?

దిష్టి అంటే అసూయతో కూడిన చూపు వల్ల కలిగే నెగటివ్ ఎనర్జీ. అంటే ఒకరు మన అందం, ఆరోగ్యం లేదా సౌకర్యాన్ని చూసినప్పుడు వారి మనసులో కలిగే అసూయ మనపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. కను దిష్టి తగలడం వల్ల ఆరోగ్యం క్షీణించడం, మనశ్శాంతి లోపించడం లేదా ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు కలగడం వంటివి జరగవచ్చు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
దిష్టి తొలగించే వస్తువులు
Image Credit : Asianet News

దిష్టి తొలగించే వస్తువులు

జ్యోతిష్య పండితుల ప్రకారం దిష్టిని తొలగించడానికి కొన్ని సులభమైన, ప్రభావవంతమైన పద్ధతులు ఉన్నాయి. వాటిలో కర్పూరం, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయ ముఖ్యమైనవి. వీటికి ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయి. అవి నెగటివ్ ఎనర్జీని గ్రహించి దిష్టిని తొలగిస్తాయి.

Related Articles

Related image1
ఈ 5 నెలల్లో పుట్టినవారు సూపర్ ఫాస్ట్.. అన్నింట్లో ముందుంటారు!
Related image2
ఈ 4 రాశులవారితో జాగ్రత్త.. వీరు ఇతరుల తప్పులను ఎత్తిచూపడంలో ముందుంటారు!
35
నెగిటివ్ ఎనర్జీ..
Image Credit : Asianet News

నెగిటివ్ ఎనర్జీ..

కర్పూరంలో స్వచ్ఛమైన అగ్ని శక్తి ఉంటుంది. దాన్ని వెలిగిస్తే చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ నశిస్తుందని నమ్మకం. గుమ్మడికాయ పవిత్రతకు, ఆపద నివారణకు చిహ్నం. కొబ్బరికాయ కొట్టడం దేవుడికి మనల్ని మనం సమర్పించుకోవడానికి గుర్తు. నిమ్మకాయ దిష్టిని గ్రహించి మన శక్తి క్షేత్రాన్ని శుభ్రపరుస్తుంది. 

45
దిష్టి తీసే పద్ధతి
Image Credit : Asianet News

దిష్టి తీసే పద్ధతి

దిష్టి తొలగించే వస్తువులతో పాటు తీసే పద్ధతి కూడా ముఖ్యమే. సాధారణంగా చాలామంది ఏం చేస్తారంటే.. చేతిలో కొద్దిగా ఉప్పు తీసుకొని, తమ చుట్టూ మూడుసార్లు తిప్పుకొని, ఆ ఉప్పును నీటిలో కరిగిస్తుంటారు. మరికొందరు కర్పూరం, నిమ్మకాయ, కొబ్బరికాయ, గుమ్మడికాయలను తమ చుట్టూ 5 సార్లు తిప్పుకొని రోడ్డు పక్కన పగలగొట్టే పద్ధతిని పాటిస్తారు. ఇలా చేస్తే తగిలిన నెగటివ్ ఎనర్జీ పోతుందని నమ్మకం. అంతేకాదు ఈ వస్తువులను ఇంట్లో సరైన ప్రదేశంలో ఉంచడం, శుభ్రంగా, శ్రద్ధగా పరిరక్షించడం ద్వారా ప్రతికూల శక్తులను నివారించవచ్చని నమ్మకం. ఇవి మానసికంగా కూడా ఒక రకమైన ఆత్మీయ భద్రతను కల్పిస్తాయి.

55
దిష్టి తీయడానికి అనువైన రోజు
Image Credit : meta ai

దిష్టి తీయడానికి అనువైన రోజు

జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. దిష్టి తీయడానికి ఆదివారం, అమావాస్య అనువైన రోజులు. ఆ రోజుల్లో శారీరక, మానసిక శక్తి సమతుల్యంగా ఉంటుంది కాబట్టి, ఆ రోజు దిష్టి తీస్తే ఫలితం త్వరగా వస్తుందని నమ్మకం. ఇలా ఇల్లు, కుటుంబం, పని, పిల్లలను కాపాడుకునే ఈ దిష్టి నివారణ పద్ధతులు ఆధ్యాత్మిక నమ్మకాన్ని, మనశ్శాంతిని అందిస్తాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Spiritual Temples: ఇండియాలో మీరు తప్పక సందర్శించాల్సిన 10 టెంపుల్స్ ఇవే
Recommended image2
Vastu Plants: ఇంట్లో ఈ మొక్కలు పెంచితే.. చేతిలో పైసా నిలవదు.. అన్నీ అశుభాలే!
Recommended image3
Somnath Temple Mystery: మహాశివుని మొదటి జ్యోతిర్లింగం.. సోమనాథ్ ఆలయం వెనుక ఉన్న ఆ మిస్టరీ ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
ఈ 5 నెలల్లో పుట్టినవారు సూపర్ ఫాస్ట్.. అన్నింట్లో ముందుంటారు!
Recommended image2
ఈ 4 రాశులవారితో జాగ్రత్త.. వీరు ఇతరుల తప్పులను ఎత్తిచూపడంలో ముందుంటారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved