maha shivratri: ఈ రోజు ఉపవాసం, జాగరణ చేస్తే అన్ని శుభాలే జరుగుతాయి..
maha shivratri: మాఘ మాసం బహుళ చతుర్దశి నాడు వచ్చే మహా శివరాత్రి శివయ్యకు ఎంతో పీతిపాత్రమైనది. ముఖ్యంగా ఈ మహాశివరాత్రి నాడు ఆ భోళాశంకరుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసం, తెల్లవార్లూ జాగరణ చేస్తుంటారు. మరి పరమ పవిత్రమైన ఈ శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ చేస్తే ఎలాంటి ఫలితాలొస్తాయో తెలుసా..
Sivarathiri
maha shivratri: హిందువులు జరుపుకునే పండుగల్లో మహా శివరాత్రి ఎంతో పవిత్రమైనది. ఈ రోజు ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తే.. సుఖ సంతోషాలు, సిరి సంపదలతో వర్ధిల్లుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ మహా శివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ.
ఈ రోజంతా శివనామస్మరణతో శివాలయాలన్నీ మారుమ్రోగుతుంటాయి. సూర్యోదయానికంటే ముందే భక్తులంతా నిద్రలేచి స్నానాలు చేసి శివుడికి పూజలు, అభిషేకాలు చేస్తారు. ముఖ్యంగా భక్తులంతా శివనామస్మరణ చేస్తూ శివుడికి ఉపవాసం, దీక్షలు, భజనలు చేస్తుంటారు.
ఈ రోజు శివుడు లింగరూపంలోకి ఉద్భవించిన రోజని కొందరంటే, మరికొందరు శివపార్వతుల కళ్యాణం ఈ రోజే జరిగిందని అంటుంటారు. శివపార్వతుల కలయిక సృష్టికి పరమార్ధాన్నిసూచిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజున శివుడిని పూజిస్తే జీవితంలో ఉన్న చీకటి, కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
ఉపవాసం-జాగారం దీక్ష: భోళాశంకరుడికి ఎంతో పీతిపాత్రమైన ఈ మహాశివరాత్రి రోజున శివలింగానికి స్వచ్చమైన నీరు, పాలు, బిల్వపత్రాలతో శివనామస్మరణతో అభిషేకం చేయాలి. ఈ మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండేవారు సాత్విక ఆహారం తీసుకుంటూ,దీక్షను చేస్తూ పండ్లు తీసుకుంటూ.. ఆ భోళాశంకరుడిని పూజిస్తారు. మహా శివరాత్రి పర్వదినం రోజున నిష్టగా ఉపవాసం, జాగరణ చేస్తే ఆ పరమేశ్వరుడి ఆశిస్సులు ఎల్లప్పుడూ భక్తులపై ఉంటాయని పండితులు చెబుతున్నారు.
పురాణాల ప్రకారం: పురాణాల ప్రకారం.. శివయ్యను పూజించడం, అభిషేకంచడం, ప్రార్థించడం వల్ల.. భక్తుల పాపాలన్నీ తొలగిపోతాయట. అంతేకాదు ధర్మమార్గంలో నడిచిన వారికీ అన్నీ శుభాలు కలిగి, సద్గతులు లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇక ఈ శివరాత్రి రోజున ఉపవాసం ఉండే వారికి అంతా శుభమే కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
భోళాశంకరుడు లింగరూపంలోకి ఉద్బవించిన ఈ మహా పర్వదినాన శివలింగానికి జలాభిషేకం చేయడం ఎంతో పవిత్రమైన రోజని పురాణాలు పేర్కొంటున్నాయి. హర హర మహాదేవ శంభో శకంర అంటూ శివున్ని మనస్సులో తలచుకుంటూ నిష్టగా పూజిస్తే వారు సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో వర్ధిల్లుతారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇక ఈ మహాశిరాత్రి పర్వదినం శివాలయాలన్నీ.. ఓం నమశివాయ అంటూ శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి.