దసరా రోజున ఈ ఒక్కటి కచ్చితంగా దానం చేయాలి.. ఎందుకో తెలుసా?
ఈ దసరా రోజున ఒక వస్తువు దానం చేస్తే మాత్రం.. జీవితంలో చాలా మేలు జరుగుతుందట. మరి.. ఏం దానం చేయాలి..? ఏం దానం చేస్తే.. అదృష్టం కలిసొస్తుందో తెలుసుకుందాం..
ఈ ఏడాది దసరా పండగ అక్టోబర్ 12వ తేదీన వస్తోంది. ఈ దసరా పండగను ప్రజలు దేశవ్యాప్తంగా సంబరంగా జరుపుకుంటారు. పండగ ముందు రోజు చాలా ప్రాంతాల్లో రావణ దహనం కూడా చేస్తారు. ఈ పండగకు సంబంధించి అనేక సంప్రదాయాలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే.. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ దసరా రోజున ఒక వస్తువు దానం చేస్తే మాత్రం.. జీవితంలో చాలా మేలు జరుగుతుందట. మరి.. ఏం దానం చేయాలి..? ఏం దానం చేస్తే.. అదృష్టం కలిసొస్తుందో తెలుసుకుందాం..
broomstick
దసరా రోజున ఎవరికైనా చీపురు దానం చేస్తే..చాలా మంచి జరుగుతుందట. చీపురే ఎందుకు అనే సందేహం మీకు రావచ్చు. దాని వెనక కూడా ఒక కారణం ఉందట. హిందూ మతంలో చీపురును లక్ష్మీదేవికి ప్రతిరూపంగా పరిగణిస్తారు. చీపురు ఇంట్లో ఉంది అంటే.. సంపదను ఆకర్షిస్తుందని అర్థమట. మరోవైపు దసరా రోజున లక్ష్మీదేవి తన పది గొప్ప శాస్త్రాలతో పాటు బంగారు కలశంతో భూమిపై తిరుగుతుందని నమ్ముతారు.
అందుకే.. దసరా రోజున చీపురు దానం చేయడం వల్ల.. సంపద పెరుగుతుందని నమ్ముతారు. అంతేకాదు.. ఊహించని ధనలాభం కూడా పొందే అవకాశం ఉంటుందట. లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది కూడా పూర్తిగా పోయి.. పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది.
vastu tips
అంతే కాకుండా దసరా రోజున చీపురు దానం చేయడం వల్ల ఇంటి ఐశ్వర్యంతోపాటు గ్రహాలు కూడా ప్రశాంతంగా ఉంటాయని నమ్ముతారు. జాతకంలో ఏదైనా గ్రహ దోషం ఉంటే, అది కూడా క్రమంగా దానంతటదే వెళ్లిపోతుంది. గ్రహాల నుండి శుభం రావడం ప్రారంభమవుతుంది.