రక్షా బంధన్ 2023: రాఖీ పండుగ రోజు ఈ గిఫ్ట్ లను పొరపాటున కూడా ఇవ్వకండి.. ఎందుకంటే?
raksha bandhan 2023: రాఖీ పండుగ రోజున అక్కా చెల్లెల్లకు బహుమతులను ఇచ్చే సంప్రదాయం కూడా ఉంది. ఇది మంచి విషయమే కానీ పొరపాటున కూడా రాఖీ పండుగ రోజున మీ సోదరికి కొన్ని రకాల గిఫ్ట్ లను అస్సలు ఇవ్వకూడదు. ఇలా చేసత్ే మీ బంధం మరింత దిగజారిపోతుంది.
raksha bandhan 2023: రాఖీ పండుగ రోజున అక్కా చెల్లెల్లు అన్నదమ్ములకు రాఖీలు కడతారు. బదులుగా అన్నదమ్ములు వారిని కాపాడుతామని వాగ్దానం చేసి బహుమతులను ఇస్తుంటారు. సోదరికి బహుమతులు ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు. జ్యోతిష్యం ప్రకారం.. రాకీ పండుగ రోజును కొన్ని రకాల బహుమతులను ఇవ్వకూడదు. శాస్త్రాల ప్రకారం.. వీటిని సోదరికి బహుమతిగా ఇస్తే మీ బంధం మరింత దిగజారిపోతుంది. రాఖీ పండుగ రోజున మీ సోదరికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
Raksha Bandhan gifts
నలుపు రంగును నివారించండి
హిందూ మతంలో.. ఏదైనా శుభ సందర్భంలో నలుపు రంగును నివారించాలి. మీ సోదరి భవిష్యత్తు బాగుండాలంటే మీరు రక్షా బంధన్ రోజున ఆమెకు నల్ల రంగులో ఉండే బహుమతులు ఇవ్వడం మానుకోండి.
Raksha Bandhan gifts
పాదరక్షలు బహుమతిగా ఇవ్వకండి
కూతురిని మన ఇంటి లక్ష్మిగా చూస్తారు. అందుకే ఆమెకు చెప్పులు బహుమతిగా ఇస్తే అది హిందూమతంలో అవమానంగా భావిస్తారు. ముఖ్యంగా ఇలాంటి బహుమతులను ఇవ్వడం వల్ల రిలేషన్ షిప్స్ లో గ్యాప్ కూడా ఏర్పడుతుందని జ్యోతిష్యులు అంటున్నారు.
Raksha Bandhan gifts
అద్దం బహుమతిగా ఇవ్వొద్దు
రాఖీ పండుగ రోజున మీ సోదరులకు పొరపాటున కూడా కళ్లద్దాలను బహుమతిగా ఇవ్వకూడదు. అద్దం బహుమతిగా ఇస్తే దాంట్లో తనను తాను చూసుకుంటాడు. అది వాస్తు దోషం కోణంలో కనిపిస్తుంది. మీరు ఎవరికి అద్దం బహుమతిగా ఇస్తారో వారి మనస్సులో ప్రతికూల భావోద్వేగాలు వస్తాయి. లోటుపాట్లు కనిపించి జీవితంలో ముందుకు సాగడానికి భయపడతాడు.
చేతి రుమాలు బహుమతిగా ఇవ్వకండి
వాస్తు ప్రకారం.. మీరు ఎవరికైనా చేతి రుమాలు లేదా కండువాను బహుమతిగా ఇస్తే మీరు అతనికి ఇబ్బందులు కలిగించినట్టే అవుతుంది. మీరు అతని భారాన్ని పెంచుతున్నట్టే. అందుకే రాఖీ పండుగ రోజున చేతి రుమాలును బహుమతిగా అస్సలు ఇవ్వకూడదు.
గడియారాన్ని బహుమతిగా
గడియారం కాలంతో ముడిపడి ఉంటుంది. గడియారాన్ని గిఫ్ట్ గా ఇస్తే అన్నదమ్ముల బంధంపై కాలం ప్రభావం రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు అంటున్నారు. వాస్తు ప్రకారం.. కుండ బహుమతి ఇవ్వడం కూడా మంచిది కాదు.