రాఖీ పండుగ 2023: కుడి లేదా ఎడమ.. ఏ చేతికి రాఖీ కట్టాలి? శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే?
raksha bandhan 2023: రాఖీ పండుగ హిందు ప్రధాన పండుగల్లో ఒకటి. ఈ పండుగను ప్రతీ ఏడాది శ్రావన మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ రాఖీ పండుగ పర్వదినాన రాఖీ లేదా రక్షా సూత్రాన్ని కట్టేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి.
Raksha Bandhan
సనాతన ధర్మంలో రాఖీ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు అక్కా చెల్లెల్లు తమ అన్నాదమ్ముల మణికట్టుకు రాఖీ కడతారు. వారి మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రార్థిస్తారు. సోదరులు తమ సోదరీమణులను కాపాడతామని వాగ్దానం చేస్తారు. అయితే రాఖీ పండుగకు అక్కా చెల్లెల్లకు బహుమతులు ఇచ్చే ట్రెండ్ కూడా ఉంది. భద్రకాలం ఏర్పడటం వల్ల రాఖీ పండుగను ఆగస్టు 30, 31 తేదీల్లో జరుపుకోబోతున్నాం..
రాఖీ పండుగ ప్రాముఖ్యత
సనాతన సంప్రదాయంలో ఈ పండుగను ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తారు. రక్షాబంధన్ పండుగ అన్నదమ్ముల విడదీయరాని బంధానికి ప్రతీక. ఈ రోజున అక్కా చెల్లెల్లు తమ సోదరుడికి హారతి ఇచ్చి ప్రేమకు చిహ్నంగా రాఖీ లేదా రక్షా సూత్రాన్ని కడతారు.
రాఖీని ఏ చేతికి కట్టాలి?
అన్నాదమ్ముల్ల కుడి చేతికి రాఖీ కట్టడం శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం.. కుడి చేయి ప్రస్తుత జన్మ కర్మల చేయిగా పరిగణించబడుతుంది.
ఈ చేతికే రాఖీని ఎందుకు కడుతారు?
విశ్వాసాల ప్రకారం.. కుడి చేతితో చేసే ధానాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు. అందుకే ధార్మిక కార్యక్రమాల అనంతరం కట్టే కంకణాన్ని కూడా కుడిచేతి మణికట్టుకే కడుతారు. అలాగే రాఖీ పండుగ రోజున కుడిచేతికి రాఖీ కట్టడం శుభప్రదంగా భావిస్తారు.
Raksha Bandhan
ఎన్నో ప్రయోజనాలు
కుడి చేతికి రాఖీ కట్టడం వల్ల మతపరమైన ప్రయోజనాలే కాదు.. సైన్స్ దృష్ట్యా శరీరానికి ఎన్నో రకాల రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే శరీరంలోని అనేక ప్రధాన అవయవాలకు చేరే నరాలు మణికట్టు గుండా వెళతాయని ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది. అందుకే మణికట్టుకు రాఖీని కట్టడం వల్ల రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.