రాఖీ పండుగ రోజు ఈ ఒక్క వస్తువును మీ ఇంటికి తెస్తే.. మీరు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు
raksha bandhan 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం.. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టి అతని ఆరోగ్యం, మంచి భవిష్యత్తు ఉండాలని ప్రార్థిస్తారు. అయితే ఈ రాఖీ పండుగ రోజున ఇంటికి కొన్ని ప్రత్యేక వస్తువులను తీసుకొస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని జ్యోతిష్యులు అంటున్నారు.
ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 30, 31 తేదీల్లో రాఖీ పండుగను జరుపుకోనున్నాం. అయితే పౌర్ణమి రోజు స్నానమాచరించి జపం చేయడం ద్వారా అక్షయ పుణ్యం లభిస్తుందని కొంతమంది నమ్ముతారు. అలాగే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు కూడా తొలగిపోతాయి.
Raksha Bandhan 2023
జ్యోతిషశాస్త్రంలో రక్షాబంధన్, పూర్ణిమ తిథి గురించి కూడా కొన్ని పరిహారాలు పేర్కొనబడ్డాయి. వాటిని అనుసరించడం ద్వారా ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారుట. ముఖ్యంగా రాఖీ పండుగ రోజున ఇంటికి కొన్ని వస్తువులను తీసుకొస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రక్షా బంధన్ శుభ ముహూర్తం
శ్రావణ పూర్ణిమ తిథి ప్రారంభం: ఆగస్టు 30 మధ్యాహ్నం 12:28 గంటలకు
శ్రావణ పూర్ణిమ తిథి ఎప్పుడు ముగుస్తుంది: ఆగస్టు 31 ఉదయం 08:35 గంటలకు
ధనిష్ఠ నక్షత్రం: రాత్రి 10:17
భద్రాకాలం: ఉదయం 10:42 నుంచి రాత్రి 09:02 వరకు
రక్షా బంధన్ శుభ ముహూర్తం: ఆగస్టు 30 రాత్రి 09:02 నుంచి 10:15 వరకు
శంఖం
రాఖీ పండుగ రోజున శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన దక్షిణ శంఖాన్ని ఇంటికి తీసుకురావాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున ఒకటి లేదా రెండు దక్షిణ శంఖాలను ఇంటికి తీసుకువస్తే అంతా మంచే జరుగుతుందట.
వీటిని ఇంటికి తెచ్చి ఒక శంఖాన్ని పూజించాలి. మరో శంఖాన్ని ఊదాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సంతోషం, శ్రేయస్సు, సానుకూల వాతావరణం నెలకొంటుంది. అయితే ఈ రెండు శంఖాలను నేలపై అస్సలు ఉంచకూడదని గుర్తుంచుకోండి.
క్రమం తప్పకుండా శంఖాలను పూజించడం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుందట. అలాగే మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుందని ప్రజలు నమ్ముతారు.
అలాగే శంఖాలను ఇంట్లో పెట్టేటప్పుడు దిశను జాగ్రత్తగా చూసుకోవాలి. విష్ణువు, లక్ష్మిదేవి కుడి వైపున మాత్రమే శంఖాన్ని పెట్టాలి. అలాగే శివుని దగ్గర శంఖం ఉంచకూడదని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ధనలాభం కలుగుతుంది. ఆర్థిక సమస్యలన్నీ పోతాయి.