రక్షా బంధన్ 2023: రాఖీ కట్టేటప్పుడు ఈ దిశను గుర్తుంచుకోండి.. లేదంటే ఫలితం ఉండదు
Raksha Bandhan 2023: భద్రకాలం ఆగస్టు 30 రాత్రి 9:02 గంటల వరకు ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో రాఖీ కట్టకూడదు. అయితే రాఖీ కట్టేటప్పుడు కొన్ని దిక్కుల్లో సోదరుల ముఖం ఉండాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇలా లేకపోతే ఫలితం కూడా ఉండదట.
rakhi 2023
రాఖీ పండుగను ఆగస్టు 30, 31 తేదీల్లో జరుపుకోనున్నారు. అయితే భద్రకాలం ఆగస్టు 20 న రాత్రి 09:02 గంటల వరకు ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో రాఖీ కట్టకూడదు. ఈ సమయం దటినప్పటి నుంచి రాఖీని కట్టొచ్చు. ఆగస్టు 31న ఉదయం 07.05 గంటల వరకు రాఖీ కట్టడానికి మంచి సమయం. ఈ సమయంలో అక్కా చెల్లెల్లు తమ సోదరుడికి రాఖీ కట్టొచ్చు. అయితే రాఖీ కట్టే సమయంలో అక్కాచెల్లెళ్లు దిశను జాగ్రత్తగా చూసుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. పగటిపూట మాత్రమే కాదు రాత్రివేళల్లో కూడా దిశా నిర్దేశం చేయాలట. డైరెక్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సోదరుడికి సుఖసంతోషాలు, అదృష్టం వరిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దిశతో సహా రాఖీ కట్టే ఇతర నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Rakhi
దిశ
జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. రాఖీ కట్టేటప్పుడు అక్కా చెల్లెల ముఖం పడమర దిశలో ఉండాలి. అలాగే సోదరుల ముఖం తూర్పు దిక్కున ఉండాలి. కొన్ని కారణాల వల్ల తూర్పు దిక్కు అందుబాటులో లేకపోతే అన్నదమ్ములు ఉత్తర దిక్కుకు అభిముఖంగా కూర్చోవాలి. ఎందుకంటే ఈ రెండు దిక్కులు శుభప్రదం. ఈ దిక్కుల్లో దేవతలు, దేవుళ్లు నివసిస్తారట.
rakshabandhan 2023
సాయంత్రం పూట రాఖీ కట్టుకుంటే సోదరుడి ముఖం పడమర వైపు ఉండాలి. అదే సమయంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు తూర్పు, ఉత్తర దిశల్లో రాఖీ కట్టాలి. ఇలా చేయడం వల్ల సోదరుడి అదృష్టం పెరుగుతుంది. కష్టాలు తొలగిపోతాయి.
ఏ చేతికి రాఖీ కట్టాలి?
దేవతలు మనుషులకు కుడివైపున నివసిస్తారని ఒక మత విశ్వాసం ఉంది. కుడిచేయి శక్తి వనరు అని కూడా అంటారు. అందుకే అన్ని శుభకార్యాలను కుడిచేతితోనే చేస్తారు. ఒక వ్యక్తి కుడి చేతితో దానం చేస్తే దేవుడు కూడా ఆ విరాళాన్ని స్వీకరిస్తాడని చెబుతారు. కాబట్టి రాఖీని ఎప్పుడూ కూడా కుడిచేతికే కట్టుకోవాలి.