MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Spiritual
  • Zodiac Signs: ఈ 4 రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. ఎందుకంటే కుంభ రాశిలోకి రాహువు ప్రవేశిస్తున్నాడు

Zodiac Signs: ఈ 4 రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. ఎందుకంటే కుంభ రాశిలోకి రాహువు ప్రవేశిస్తున్నాడు

Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనుషుల జీవితాలపై నవగ్రహాల ప్రభావం ఉంటుందట. అవి సంచరించే రాశిని బట్టి కష్టసుఖాలు, లాభనష్టాలు కలుగుతాయట. ఈ సంవత్సరం రాహువు త్వరలో తన రాశిని మార్చనున్నాడు. దీని వల్ల 4 రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. వారు తాకినదల్లా బంగారం అవుతుందట. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందామా?

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 06 2025, 07:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశులు, నక్షత్రాలను మారుస్తాయి. ఈ గ్రహాల మార్పు వల్ల కొన్ని రాశుల వారికి మంచి జరిగితే, కొన్ని రాశుల వారికి చెడు జరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన మరికొన్ని రోజుల్లో రాహువు తన రాశిని మార్చనున్నాడు. మే 18న రాహువు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు.

జ్యోతిష్యం ప్రకారం, కుంభ రాశిలో రాహువు సంచారం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. రాహువు రాశి మారడం వల్ల వారు కెరీర్‌లో లాభం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యక్తిగత జీవితంలో మంచి మార్పులు చూస్తారు. ఇన్ని లాభాలు పొందే రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మిథున రాశి వారికి అదృష్టమే

రాహువు రాశి మారడం వల్ల మిథున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. రాహువు అదృష్ట స్థానంలో సంచరించడం వల్ల జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి. కెరీర్‌లో వృద్ధి సాధిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆర్థికంగా రాహువు సంచారం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆస్తిలో పెరుగుదల ఉంటుంది. కోర్టుకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే విజయవంతంగా పూర్తవుతాయి. 

35

తుల రాశి జీవితంలో పెద్ద మార్పులు 

తుల రాశిలో జన్మించిన వారి జీవితంలో రాహువు సంచారం పెద్ద మార్పులను తీసుకువస్తుంది. ఈ సంచారం తుల రాశి వారికి చదువు, బంధాలు, పిల్లలకు సంబంధించిన విషయాలలో మంచి ఫలితాలను ఇస్తుంది. కళలు, సినిమా, రచన, మీడియా రంగాలకు చెందిన వారికి మంచి సమయం. పని చేసే చోట కొత్త విజయాలు వస్తాయి. మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. 
 

45

మకర రాశి వారికి పదోన్నతి

మకర రాశి వారు ఆర్థికంగా స్థిరపడాలంటే రాహువు సంచారం చాలా ముఖ్యం. ప్రస్తుతం సంపద ఇంట్లోకి రాహువు సంచరించడం మొదలు పెడుతుండటం వల్ల మకర రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. వ్యాపారంలో మంచి విజయం సాధిస్తారు. పెట్టుబడుల వల్ల మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి లేదా జీతం పెరగవచ్చు. జీవితంలో స్థిరత్వం ఉంటుంది. డబ్బుకు సంబంధించిన స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకుంటారు.  

55

మీన రాశి వారు మంచి సమయం

మీన రాశి వారికి రాహువు సంచారం చాలా శుభప్రదం. రాహువు సంచారం లాభం ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగం, వ్యాపారంలో మంచి విజయం సాధిస్తారు. రాజకీయాలు, మీడియా రంగాలకు చెందిన వారికి చాలా లాభం కలుగుతుంది. ఆర్థికంగా స్థిర పడటానికి ఇది మంచి సమయం. ఉన్నత స్థితిలో ఉన్న వారితో సత్సంబంధాలు ఏర్పడతాయి. అది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved