navratri 2023: చంద్రఘంటా దేవిని ఎలా పూజించాలో తెలుసా?
navratri 2023: నవరాత్రులలో మూడో రోజు దుర్గా దేవి మూడో రూపమైన చంద్రఘంటా దేవిని పూజిస్తారు. చంద్రఘంటా దేవి నుదుటిపై అర్ధ చంద్రుని ఆకారంలో గంటను కలిగి ఉండటానికి ప్రసిద్ధి చెందింది. అమ్మవారు తన భక్తులను ప్రసన్నం చేసుకుని వారికి శాంతి, సౌభాగ్యాలను ప్రసాదిస్తారని విశ్వసిస్తారు.
navratri 2023: దేవీ భక్తులకు శారదీయ నవరాత్రులు చాలా ప్రత్యేకమైనవి. దుర్గా దేవి, ఆమె తొమ్మిది రూపాలకు అంకితం చేయబడిన ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. నవరాత్రులలో మూడో రోజు చంద్రఘంటా దేవిని పూజిస్తారు. చంద్రఘంటా దేవి నుదుటిపై అర్ధ చంద్రుని ఆకారంలో గంటను కలిగి ఉంటుంది.
నవరాత్రుల్లో మూడో రోజు చంద్రఘంటా దేవిని పూజిస్తారు. మత విశ్వాసాల ప్రకారం.. చంద్రఘంటాదేవి ఈ ప్రపంచంలో న్యాయం, క్రమశిక్షణను నెలకొల్పుతుంది. చంద్రఘంటా దేవి పార్వతీ దేవి రూపం. శివుడిని వివాహం చేసుకున్న తర్వాత దేవత తన నుదుటిని నెలవంకతో అలంకరించడం మొదలుపెట్టింది.
అందుకే పార్వతీ దేవిని చంద్రఘంటా దేవి అంటారు. సింహంపై అమ్మవారు స్వారీ చేస్తుంది. అలాగే ఆమె శరీర రంగు ప్రకాశవంతమైన బంగారు రంగులో ఉంటుంది. అమ్మవారు తన భక్తుల కోర్కెలన్నిటినీ నెరవేరుస్తుంది.
చంద్రఘంటా దేవిని ఎలా పూజించాలి?
ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.
స్వచ్ఛమైన దేశీ నెయ్యితో దీపం వెలిగించి అమ్మవారికి పూలదండ సమర్పించాలి.
కుంకుమను సమర్పించాలి.
అలాగే స్వీట్లు సమర్పించాలి.
దుర్గా సప్తశతి పఠించండి లేదా దుర్గా చాలీసా పఠించాలి.
సాయంత్రం పూట అమ్మవారికి హారతినివ్వాలి.
సాత్విక ఆహారంతో ఉపవాసాన్ని ప్రారంభించండి.