MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • నవరాత్రి 8 వ రోజు.. మహాగౌరి గా అమ్మవారు.. ఈ కథను తెలుసుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయి

నవరాత్రి 8 వ రోజు.. మహాగౌరి గా అమ్మవారు.. ఈ కథను తెలుసుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయి

navratri 2023: హిందూమతంలో నవరాత్రులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నవరాత్రులు ప్రతి ఏడాది అశ్విని మాసం శుక్ల పక్షం ప్రతిపాద తిథి నాడు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 22వ న అంటే ఆదివారం మహాష్టమి ఉపవాస దీక్ష చేపట్టనున్నారు. 

1 Min read
Author : R Shivallela
Published : Oct 22 2023, 07:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు దుర్గమాత తొమ్మిది విభిన్న రూపాలను పూజిస్తాం. అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఉపవాసం కూడా ఉంటుంటారు. ఇప్పటికే నవరాత్రుల్లో ఏడు రోజులు గడిచిపోయాయి. నవరాత్రులలో ఎనిమిదో రోజున దుర్గామాత మరో రూపమైన మహాగౌరీ అమ్మవారిని పూజిస్తాం. నవరాత్రులలో ఈ అష్టమి తేదీని మహాష్టమి లేదా దుర్గ అష్టమి అని కూడా అంటారు. ఈ సందర్భంగా ఎనిమిదో అవతారమైన మహాగౌరీ దేవి ఉపవాస కథను ఇప్పుడు తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

మహాగౌరీ వ్రత కథ

పురాణాల ప్రకారం.. పార్వతీదేవి శివుడిని తన భర్తగా పొందడానికి ఎన్నో వేల సంవత్సరాలు కఠినమైన తపస్సు చేస్తుంది. ఈ సమయంలో పార్వతీదేవి ఆహారాన్నే కాదు పచ్చి మంచి నీళ్లను కూడా ముట్టుకోదు. దీని వల్ల ఆమె శరీరమంతా నల్లగా మారుతుంది.
 

34

శివుడు పార్వతీదేవి కఠోర తపస్సు చూసి సంతోషించి ఆమెను తన భార్యగా అంగీకరిస్తాడు. శరీరం నల్లబడటం వల్ల శివుడు అతన్ని గంగా నీటితో శుద్ధి చేస్తాడు. తర్వాత పార్వతీదేవి శరీరం తిరిగి ప్రకాశవంతంగా మారుతుంది. ఈ సమయంలో పార్వతీ మాత శరీర రంగు తెల్లగా మారుతుంది. అందుకే పార్వతీదేవిని మహాగౌరి అని పిలిచేవారు.
 

44

మహాగౌరీ దేవిని పూజించడం వల్ల భక్తుల పాపాలన్నీ నశించిపోతాయట. అలాగే అక్షయ పుణ్యాన్ని పొందుతాడని నమ్ముతారు. అందుకే నవరాత్రుల్లో మహాగౌరి ఆరాధన సమయంలో అమ్మవారి మంత్రాలను పఠించండి. దీంతో మీ జీవితంలో సంతోషం, శ్రేయస్సు నెలకొంటాయి.  వైవాహిక సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందుతారు. 
 

About the Author

RS
R Shivallela

Latest Videos
Recommended Stories
Recommended image1
Tirumala: తిరుమల గుడి తలుపులు తెరిచాక లోపలికి వెళ్లే ఆ మొదటి వ్యక్తి ఎవరు? శ్రీవారి రహస్యం ఇదే !
Recommended image2
IRCTC Jyotirlinga Tour 2026: ఒకే ఒక్క ట్రిప్.. 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాల దర్శనం! ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
Recommended image3
Significance of Temple Bells: గుడిలో గంట ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న క్రేజీ సైన్స్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved