navratri 2023: ఈ రోజు కాత్యాయని అమ్మవారిని ఇలా పూజిస్తే మీ కోర్కెలన్నీ నెరవేరుతాయి
navratri 2023: కాత్యాయని తల్లి ఎంతో దయగలదని సనాతన గ్రంధాల్లో ఉంది. ఈ తల్లి అనుగ్రహం, దార్శనికత భక్తులపై కురిపిస్తూనే ఉంటుంది. ఈ తల్లి అనుగ్రహంతో భక్తుల జీవితంలో ఉన్న బాధలు, కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అమ్మవారి అనుగ్రహం పొందాలంటే నవరాత్రుల్లో ఆరో రోజున కాత్యాయని అమ్మవారిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
navratri 2023: సనాతన ధర్మంలో నవరాత్రులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నవరాత్రులలో ఆరో రోజున కాత్యాయని దేవిని పూజిస్తారు. కాత్యాయన తల్లి దయగలది అని సనాతన గ్రంధాలలో ఉంది. ఆమె అనుగ్రహం, దార్శనికత భక్తులపై కురిపిస్తూనే ఉంటుంది. ఆమె అనుగ్రహం ఉంటే జీవితంలోని బాధలు, కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అయితే మీరు కూడా అమ్మవారి అనుగ్రహం పొందాలనుకుంటే కాత్యాయని అమ్మవారిని ఇలా పూజించండి.
navratri 2023 katyayani puja
శుభ సమయం
పంచాంగం ప్రకారం.. నవరాత్రుల పంచమి తిథి అక్టోబర్ 20 న మధ్యాహ్నం 12.31 గంటలకు ప్రారంభమై ఈ రోజు రాత్రి 11.24 గంటలకు ముగుస్తుంది. అనంతరం సప్తమి తిథి ప్రారంభమవుతుంది. అందుకే భక్తులు రోజంతా అమ్మవారిని పూజించొచ్చు.
పూజా విధానం
నవరాత్రుల్లో ఆరో రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి. రోజువారి పనులను కంప్లీట్ చేసుకున్న తర్వాత గంగా వాటర్ కలిపిన నీటితో స్నానం చేయండి. సింపుల్ గా చెప్పాలంటే స్నానపు నీటిలో గంగాజలాన్ని కలపండి. స్నానం చేసిన తర్వాత ధ్యానం చేయండి. అలాగే ఉపవాసం ఉండి కొత్త ఎరుపు రంగు దుస్తులను వేసుకోండి. ఈ సమయంలో సూర్యభగవానుడికి నీటిని సమర్పించండి. ఆ తర్వాత పూజ సమయంలో మీ ఇంట్లో దేవుడి గుడిలో ఎర్రని గుడ్డను ఉంచి అమ్మవారి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించండి. ఆ తర్వాత తల్లి మంత్రాలను పఠించండి.
అనంతరం కాత్యాయని అమ్మవారికి పంచాచారాలు చేసి పూజించండి. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. అందుకే తల్లికి ఎరుపు రంగు పూలు, పండ్లను సమర్పించండి. అలాగే పండ్లు, పూలు, తమలపాకు, దుర్వ, నువ్వులు, బార్లీ, అక్షింతలు మొదలైన వాటితో పూజించండి. వివాహిత స్త్రీలు సుఖసంతోషాలతో, అవివాహితులు వివాహం కోసం అమ్మవారికి ఇష్టమైన గాజులను, చీర మొదలైన వాటిని సమర్పించండి. ఈ సమయంలో దుర్గా చాలీసా, కవచం, స్తోత్ర పారాయణం చేయండి. చివర్లో హారతి ఇచ్చి సుఖసంతోషాలు, సౌభాగ్యాలు కలగాలని కోరుకోండి. కోరిన కోర్కెలు తీర్చుకోవడానికి రోజంతా ఉపవాసం ఉండండి. సాయంత్రం హారతి ఇచ్చి పండ్లు తినాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.