Navratri: శరన్నవరాత్రులలో మొదటి రోజు... శైలపుత్రిగా దర్శనం ఇచ్చిన అమ్మవారు
Navratri: ఈరోజు నుంచి నవరాత్రి పూజలు ప్రారంభమయ్యాయి. ఈరోజు మొదటి రోజు కావడంతో పైగా అశ్వీయుజ శుక్ల పాడ్యమి కాబట్టి భక్తులందరూ శైలపుత్రి అమ్మ వారిని పూజిస్తారు.
Navratri: ఈరోజు నుంచి నవరాత్రి పూజలు ప్రారంభమయ్యాయి. ఈరోజు మొదటి రోజు కావడంతో పైగా అశ్వీయుజ శుక్ల పాడ్యమి కాబట్టి భక్తులందరూ శైలపుత్రి అమ్మ వారిని పూజిస్తారు. ఇక అమ్మవారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
శైలపుత్రిలో శైలం అంటే కొండ. ఈ అమ్మవారు పర్వతమైన హిమవంతునికి జన్మించింది. అందుకు శైలపుత్రి అని పేరు వచ్చింది.
ఈ అమ్మవారిని సతీ భవాని, పార్వతి, హేమావతి అనే పేర్లతో కూడా పిలుస్తారు. శివుని భార్యగా కూడా ఈమెను కొలుస్తారు.
ఈ అమ్మవారి శిరస్సుపై చంద్రవంక, కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలం ఉంటుంది. వృషభం ఈ అమ్మవారికి వాహనం.
ఈ అమ్మవారు మహిషాసురుని అంతం చేయడానికి మొదటిరోజు పరాశక్తి పార్వతి దేవి గా అవతారంలో దర్శనమిస్తుంది.ఈ అమ్మవారు ఎన్నో తపస్సులు చేసి పరమేశ్వరుని భర్తగా పొందింది. ఈ అమ్మవారికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర శక్తి కలిగి ఉంటుంది. పూర్వజన్మలో సతీదేవిగా జన్మించింది.
పూర్వజన్మలో దక్షుడు తన కన్నతండ్రి. తన తండ్రికి ఇష్టం లేకపోయినా శివుడిని వివాహం చేసుకుంది. దాంతో దక్షుడు కోపంతో యజ్ఞం చేసి శివుడిని, సతీదేవిని ఆహ్వానించడు.
కానీ తల్లి గారు పిలవకపోయినా సతీదేవి అక్కడికి వెళ్లడంతో తన తండ్రి దక్షుడు ఆమెను అవమానిస్తాడు. దీంతో సతీదేవి తనకు అవమానం జరగడంతో అగ్నిలో దూకుతుంది.
ఆ తర్వాత శివుడి కోసం మేనక, హిమవంతులకు పార్వతిగా జన్మిస్తుంది సతీదేవి. తర్వాత శివుడిని వివాహం చేసుకొని శివుడి లో సగభాగంగా నిలిచింది.
ఈ సృష్టిలో ప్రకృతి మొత్తం ఆమె శరీరంలోనే ఉంటుంది. ఈ అమ్మవారి ఆలయం ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో మర్హియా ఘాట్ వద్ద స్థాపించి ఉంది.
ఇక ఈ రోజు ఈ అమ్మవారిని పూజించడంతో సకల పాపాలు తొలగిపోతాయి. ఈ అమ్మవారికి కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీశైలంలో సాంబార్ అన్నం, మినప వడలు, రవ్వ కేసరి, పానకం సమర్పిస్తారు.