తెలంగాణలో తప్పకుండ చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు ఇవే!
తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. తెలంగాణలో అనేక చారిత్రక కట్టడాలు, కోటలు, రాజభవనాలు, అడవులు (Forests), జలపాతాలు ఇలా ఎన్నో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఈ ఆర్టికల్ (Article) ముఖ్య ఉద్దేశం తెలంగాణలోని కొన్ని పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకోవడం..
తెలంగాణలోని అన్ని పర్యాటక ప్రదేశాలు పర్యాటకులను కనివిందు చేస్తాయి. తెలంగాణ సంస్కృతి (Culture) తెలియపరిచే అనేక సాంస్కృతిక చారిత్రక కట్టడాలు (Historic) ఇక్కడ ఉన్నాయి. తెలంగాణలో పర్యటించవలసిన కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చార్మినార్: చార్మినార్ (Charminar) ను క్రీ. శ 1591లో కులీ కుతుబ్ షా నిర్మించారు. నగరంలోని ప్లేగు (Plagu) వ్యాధి నివారించిన దైవశక్తికి కృతజ్ఞతతో భావించి దీనిని నిర్మించినట్లు పురాణాలు చెబుతుంటాయి.
గోల్కొండ కోట: గోల్కొండ కోట (Golconda fort) హైదరాబాద్ నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ చప్పట్లు కొడితే ఆ శబ్దం 91 మీటర్లు ఎత్తున ఉన్న రాణి మహల్ (Rani mahal) వద్దకు వినిపిస్తుంది. గోల్కొండ కోటను శత్రువుల బారి నుంచి రక్షించుకోవడానికి ఎంతో సురక్షితంగా నిర్మించబడింది.
హుసేన్ సాగర్: హుస్సేన్ సాగర్ (Hussain sagar) లో బుద్ధుని విగ్రహం వద్దకు పడవల ద్వారా చేరుకోవాలి. ఈ చెరువు చుట్టూ లుంబిని పార్కు, (Lumbini park) నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ గార్డెన్ లు చూడవచ్చు.
బిర్లా మందిర్: ఈ మందిరాన్ని తెల్లని చలువరాతి రాళ్లతో నిర్మించబడింది. ఇక్కడి ప్రధాన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. బిర్లా మందిర్ (Birla mandir) కి సమీపంలో అసెంబ్లీ హాల్, పబ్లిక్ గార్డెన్ (Public garden) లు ఉన్నాయి.
కాకతీయ కళా తోరణం: కాకతీయ కళా తోరణాన్ని వరంగల్ ప్రవేశద్వారం అని కూడా ప్రసిద్ధి. కాకతీయుల రాజ్యానికి చారిత్రక (Historic) స్థూపం కాకతీయ కళాతోరణం. దీనికి సమీపంలో శిల్పకళ (Sculptural) ఉట్టిపడే వరంగల్ కోటను మనము చూడవచ్చును.
వేయి స్తంభాల గుడి: వరంగల్ (Varangal) కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమకొండలో వేయి స్తంభాల గుడి ఉంది. ఇది భారతదేశంలోని పురాతన ఆలయాలలో ఒకటి. ఇక్కడ శివుడు, విష్ణువు, సూర్యుడు ఇతర దేవతలు కొలువై ఉన్నారు. ఆలయం వేయి స్తంభాలతో శిల్పకళతో (Sculptural) పర్యాటకులను ఆకర్షిస్తుంది.
భువనగిరి కోట: భువనగిరి (Bhuvanagiri) కోట నల్గొండ (Nalgonda) పట్టణంలో ఉంది. ఈ కోట సముద్రమట్టానికి 500 మీటర్ల ఎత్తున కొండమీద ఉంది. ఈ కోటను చాళుక్యరాజు త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు నిర్మించారు. కోడిగుడ్డు ఆకారంలో ఉన్న ఈ కోటలో అనేక రహస్య గదులు మార్గాలు ఉన్నాయి.
భద్రాచలం: భద్రాచలం (Bhadrachalam) గోదావరి (Godavari) నది ఒడ్డున ఉంది. ఇది ఖమ్మం నగరానికి 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి శ్రీరాముని ఆలయం ప్రధాన సందర్శక ఆలయం. ఈ ఆలయం సమీపంలో గుణదల, పర్ణశాల, దుమ్మగూడెం, జటాయు పాక, పోలవరం చూడవలసిన ప్రదేశాలు.
వేములవాడ: వేములవాడ (Vemulawada) కరీంనగర్ (Karimnagar) పట్టణం నుండి 32 కిలోమీటర్ల దూరంలో కామారెడ్డి వెళ్లే మార్గంలో ఉంది. వేములవాడ సమీపంలో భీమన్న ఆలయం, పోచమ్మ ఆలయం ఉన్నాయి.