కార్తీక మాసం మొదటి రోజు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఇవే..!
దీపావళి (Diwali) మర్నాడు రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. కార్తీకమాసం చాలా పవిత్రమైనది. కార్తీకమాస సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు చేస్తుంటారు. అయితే ఈ ఆర్టికల్ (Article) ద్వారా కార్తీక మాసం మొదటి రోజు పాటించవలసిన నియమాలు గురించి తెలుసుకుందాం.
కార్తీక మాసం అంటే చంద్రుడు పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రంతో కలిసి ఉండేటటువంటి మాసమే కార్తీకమాసము. కార్తీకము మనేది కృతిక (Kruthika) అనే పదం నుంచి వచ్చింది. కార్తీకమాసమంతా కూడా నక్షత్రాలకు అధిపతిగా ఉన్నటువంటి కార్తికేయుడు (Karthikeyudu) ఉన్నాడు. ఆయన కూడ కార్తీక మాసం ప్రీతికరమైనది. కార్తీక మాసం అంతా ప్రతి రోజు ఒక ప్రత్యేకత ఉంటుంది. కార్తీక శుద్ధ పాడ్యమి అంటే దీపావళి వెళ్ళిన మర్నాడు బలి పాడ్యమి, గోవర్ధన పూజ అని అనేక పేర్లతో పిలుస్తారు.
కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధమైన నక్షత్రం (Star). కార్తీక మాసం మొదటి రోజు పూజించాల్సిన దైవము స్వాద అగ్ని. స్వాద అగ్ని అంటే అగ్నిదేవుని రూపము. మనం ఏదైనా హోమం కాని, ఏదైనా హోమం క్రియ చేసేటప్పుడు ఓం స్వాహా అనే మంత్రాన్ని చెప్పుకుంటూ స్వాద అగ్నిని ఉపయోగిస్తాము. స్వాహ దేవి, స్వాదఅగ్ని ఈ రెండు రూపాలు అగ్నిదేవుని భార్యలు. అందుకే స్వాహ దేవి, స్వాదఅగ్నిని అగ్ని పూజ చేసేటప్పుడు ఉపయోగిస్తాము. కార్తీక మాసంలో (Karthika masam) అగ్నికి సంబంధించిన పూజలు చేస్తే విశేష పుణ్య ఫలం లభిస్తుంది.
అగ్ని సంబంధమైనటువంటి దీపారాధన చేయడం ద్వారా ఆ ఇంట్లోకి శివానుగ్రహం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కార్తీకమాసమంతా ఇంట్లో దీపాలు పెట్టడం మంచిది. ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన జరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి (Lakshmidevi) అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీ అనుగ్రహం మనకు ప్రాప్తిస్తుంది. కార్తీక మాసం మొదటి రోజును బలి పాడ్యమి (Bali padyami) అంటారు. కార్తీక మాసం మొదటి రోజు ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా మామిడి తోరణాలు, పుష్పాలతో అలంకరించాలి.
ఇలా చేస్తే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అవుతుంది. ఇంట్లో ఆవు నెయ్యితో (Ghee) కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. అలాగే తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టాలి. దేవుని మందిరంలోనూ, తులసి కోట ముందు కుబేర ముగ్గు వేయాలి. శివారాధన,లక్ష్మీ ఆరాధన, గణపతి ఆరాధన చేయడం మంచిది. కార్తీక మాసం మొదటి రోజు దేవునికి పాయసం (Payasam) నైవేద్యంగా పెట్టాలి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది.
కార్తీక మాసం మొదటి రోజు పఠించాల్సిన మంత్రం ఓం జాతవేదసే స్వధా పతే స్వాహా. ఈ మంత్రాన్ని జపించడంతో మనసుకు మంచి జరుగు కార్యములు ఫలించును. కార్తీక మాసం నందు పులుపు పదార్థాలు (Sour ingredients) తీసుకోరాదు. ఉసిరికాయలు కార్తీక మాసం 30 రోజులు తీసుకోరాదు. ఎవరైనా భోజనం చేస్తుంటే వారి ఆహార పదార్థాన్ని మనం తీసుకునే ఎంగిలి చేయరాదు. కార్తీక మాసం మొదటి రోజు నందు ఆవునెయ్యిని దానంగా ఇస్తే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు (Myths) చెబుతున్నాయి.