MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • అయ్యప్ప స్వామి మండల పూజ ప్రాముఖ్యత

అయ్యప్ప స్వామి మండల పూజ ప్రాముఖ్యత

mandala puja 2023: మండల పూజ, మకర విళక్కు శబరిమల అయ్యప్ప ఆలయంలో జరిగే రెండు అత్యంత ప్రసిద్ధ కార్యక్రమాలు. ఈ సమయంలో దూరప్రాంతాల నుంచి వచ్చి మరీ అయ్యప్పస్వామిని దర్శనం చేసుకుంటారు. మండల పూజ నాడు ఈ ఆలయం రోజంతా తెరిచే ఉంటుంది. మండల పూజ ప్రాముఖ్యత గురించి ఎన్నో పురాణాల్లో కూడా చెప్పబడింది. 

1 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Dec 22 2023, 02:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మండల పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది ఒక ముఖ్యమైన ఆచారం కూడా. కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పూజ మండల కలాం అని పిలువబడే 41 రోజుల సుదీర్ఘ తపస్సు ముగింపును సూచిస్తుంది. ఈ పండుగను అయ్యప్ప భక్తులు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది డిసెంబర్ 27 న మండలపూజ ఉత్సవాలు జరగనున్నాయి.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

మండల పూజ ప్రాముఖ్యత

శబరిమల అయ్యప్ప ఆలయంలో జరిగే అత్యంత ప్రసిద్ధ ఘట్టాలలో మండల పూజ, మకర విళక్కు లు ఉన్నాయి. ఈ సమయంలో ప్రజలు దూరప్రాంతాల నుంచి వచ్చి మరీ అయ్యప్పస్వామిని దర్శించుకుంటారు. ఇక ఈ మండల పూజ నాడు ఆలయం భక్తుల కోసం రోజంతా తెరిచే ఉంటుంది. మండల పూజ మాత్రమే ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చగలదని నమ్ముతారు. ఈ పూజను లింగం,  వయస్సు వంటి భేదాలు  లేకుండా ఎవరైనా చేయొచ్చు. మండల పూజను భక్తి శ్రద్ధలతో చేస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయనే నమ్మకం ఉంది. 
 

34

మండల పూజా విధి

అయ్యప్పమాల వేసిన వారు మండల పూజ ఉపవాసం ఉండాలి.
మండల పూజ సమయంలో అయ్యప్పస్వాములు విత్రమైన, సరళమైన జీవితాన్నే గడపాలి. 
అయ్యప్పస్వాములు ఉపవాసం సమయంలో తమ శరీరంతో పాటుగా మనస్సును కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే ఎలాంటి చెడు ఆలోచనలు రానీయకూడదు
41 రోజుల పాటు అయ్యప్పస్వాములు ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉండాలి.

44

అలాగే ఆల్కహాల్, స్మోకింగ్ కు దూరంగా ఉండాలి. 
రోజుకు రెండుసార్లు పూజ చేయాలి.

అలాగే రోజుకు రెండు సార్లు స్నానం చేయాలి.
ఈ సమయంలో నల్ల ధోతీ ధరించి అయ్యప్ప స్వామికి ఇరుముడి సమర్పిస్తారు.
అయ్యప్పమాల వేసిన వారు మంచంపై పడుకోరు. అలాగే ఆలయానికి చెప్పులు లేకుండా వెళతారు. 
ఈ ఉపవాస సమయంలో దానధర్మాలకు కూడా ప్రాధాన్యమిస్తారు.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Spiritual Temples: ఇండియాలో మీరు తప్పక సందర్శించాల్సిన 10 టెంపుల్స్ ఇవే
Recommended image2
Vastu Plants: ఇంట్లో ఈ మొక్కలు పెంచితే.. చేతిలో పైసా నిలవదు.. అన్నీ అశుభాలే!
Recommended image3
Somnath Temple Mystery: మహాశివుని మొదటి జ్యోతిర్లింగం.. సోమనాథ్ ఆలయం వెనుక ఉన్న ఆ మిస్టరీ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved