Mahashivratri: శివరాత్రి రోజున శివుడికి నైవేద్యంగా వీటిని అస్సలు పెట్టకూడదు..
Mahashivratri: మహా శివరాత్రి ఎంతో పవిత్రమైంది. ఈ రోజున ఆ భోళా శంకరుడి అనుగ్రహం కోసం భక్తులంతా తెల్లవార్లూ జాగారం, ఉపవాసం చేస్తూ భక్తి శ్రద్దలతో నిష్టగా పూజ చేస్తారు. అయితే మహా శివరాత్రి రోజు శివుడికి నైవేద్యంగా కొన్ని పదార్థాలను అస్సలే పెట్టకూడదు. అవేంటంటే..
Sivarathiri
Mahashivratri: ‘హర హర మహాదేవ శంభో శంకర’ అంటూ శివనామ స్మరణతో మహాశివరాత్రికి శివాలయాలన్నీ మారుమ్రోగుతుంటాయి. ఎంతో పవిత్రమైన శివరాత్రి శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. మహా శివరాత్రినాడే శివుడు లింగ రూపంలోకి ఉద్బవిస్తాడు. లింగాకారంలో మారిన రోజునే శివరాత్రిగా జరుపుకుంటున్నాం.
మహాశివరాత్రి నాడే శివ పార్వతుల కళ్యాణం కూడా జరిగిందని కొన్ని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ మహా శివరాత్రి నాడు శివ భక్తులంతా ఉపవాసాలు ఉండి, నిష్టగా పూజిస్తూ , అభిషేకాలు చేస్తూ తెల్లవార్లూ జాగారం చేస్తూ ఉంటారు.
అయితే శివరాత్రి నాడు ఈశ్వరున్ని పూజించేటప్పుడు కొన్ని తప్పులు తెలియక చేస్తుంటారు. అలా చేస్తే శివుడి అనుగ్రహం వారిపై ఉండదు. అంతేకాదు శివుడి కోపానికి గురవుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా భోళా శంకరుడికి కొన్నింటిని నైవేద్యంగా పెట్టకూడదు. అవేంటంటే..
తులసి ఆకులు: శివుడికి ఎట్టి పరిస్థితుల్లో తులసి ఆకులను సమర్పించకూడదు. ఎందుకంటే తులసి ఆకులను లక్ష్మీ దేవిగా భావిస్తారు. అలా చూస్తే లక్ష్మీ దేవి విష్ణుమూర్తి అర్థాంగి అవుతుంది. కాబట్టి శివలింగానికి తులసి ఆకులను సమర్పించకూడదు. కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం.. తులసి ఆకులను ఏ దేవుడికీ కూడా సమర్పించకూడదట.
తెల్లని పువ్వులు: పురాణాల ప్రకారం.. శివుడికి తెల్లని పువ్వులు ఇష్టం ఉండదట. ఒక వేళ మీరు పెట్టాలంటే మల్లెపువ్వులను దేవుడి దగ్గర పెట్టొచ్చు. కానీ చంపా, కెవ్డా పువ్వులను ఎట్టి పరిస్థితుల్లో సమర్పించకూడదట. ఈ పువ్వులను పెడితే శివుడికి కోపం వచ్చి శపిస్తాడట. కాబట్టి పూజా సమయంలో ఈ పువ్వులను పెట్టకండని పండితులు చెబుతున్నారు.
కొబ్బరి నీళ్లు: ఏ గుడికి వెళ్లినా.. ఖచ్చితంగా కొబ్బరి కాయలను తీసుకెళ్తాం. కానీ శివుడికి కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో సమర్పించకూడదని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇతర దేవుళ్లకు కొబ్బరి నీళ్లు అర్పించినా ఏమీ కాదు కానీ.. శివుడికి మాత్రం సమర్పించకూడదట. ఎందుకంటే శివుడికి కొబ్బరి నీళ్లు ఇష్టముండదని పురాణాలు చెబుతున్నాయి.
కుంకుమ: శివరాత్రి పర్వదినాన శివుడికి ఎట్టి పరిస్థితుల్లో కుంకుమను సమర్పించకండి. ఆ ఒక్క రోజే కాదు.. ఎప్పుడూ కూడా శివుడికి కుంకుమను సమర్పించకూడదట. పరమేశ్వరునికి విభూది అంటే మహా ఇష్టమట. కాబట్టి మీరు విబూదిని సమర్పించవచ్చు.
లింగం చుట్టు: పురాణాల ప్రకారం.. శివ లింగం చుట్టూ ప్రదక్షిణలు అస్సలు చేయకూడదట. సగం వరకే తిరిగి మళ్లీ వెనక్కి వెళ్లిపోవాలని పురాణాలు చెబుతున్నాయి. ఒకవేళ మీకు తెలియక తిరిగే.. పూజా ఫలితం దక్కదట. ఇది ఒక నింద వంటిదని శాస్త్రాలు చెబుతున్నాయి.