ఈ శివరాత్రి చాలా ప్రత్యేకం.. 300 ఏండ్ల తర్వాత అరుదైన యోగం.. ఆర్థిక లాభం, విజయాలు మీ సొంతం
Mahashivratri 2024: ఈ మహాశివరాత్రికి ఎంతో ప్రత్యేకత ఉంది. పండితుల ప్రకారం.. 300 ఏండ్ల తర్వాత ఈ రోజు అరుదైన యోగం ఏర్పడనుంది. ఈ రోజు శివయ్యను నిష్టగా పూజిస్తే.. ఆర్థిక లాభాలు, విజయాలు, సుఖసంతోషాలు మీ సొంతం అవుతాయి.
Mahashivratri
మహాశివరాత్రి శివుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజునే శివపార్వతుల వివాహం అయినట్టు పురాణాలు చెబుతున్నాయి. అయితే మునపటి శివరాత్రుల కంటే ఈ శివరాత్రి చాలా ప్రత్యేకమైందని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే సుమారుగా 300 ఏండ్ల తర్వాత ఈ సంవత్సరం అరుదైన యోగాలు ఏర్పడనున్నాయి. ఈ రోజు శివయోగం, సర్వార్థ సిద్ది యోగంతో కూడిన అరుదైన కలయిక ఏర్పడనుందని పండితులు చెబుతున్నారు. ఇంతేకాదు ఈ మహాశివరాత్రి పర్వదినాన శుక్రప్రదోష ఉపవాసం ఉండటం కూడా అరుదే. ఈ శుక్ర ప్రదోష ఉపవాసం ఉంటే ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. అంతేకాదు సుఖసంతోషాలు, సౌభాగ్యాలు, శ్రేయస్సు కలుగుతాయి.
mahashivratri 2024
300 ఏండ్ల తర్వాత ఈ మహాశివరాత్రి నాడు సర్వార్థ సిద్ధి యోగం, ధ్యానం, మంత్రోచ్ఛారణకు మంచి శివయోగం కలయిక ఏర్పడుతోందని పండితులు చెబుతున్నారు. శివయోగం ఈ రోజంతా ఉంటుంది. శివయోగం ఈ రోజు సూర్యోదయం నుంచి 12:46 గంటల వరకు ఉంటుంది. సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు ఉదయం 6:38 నుంచి 10:41 వరకు ఉంటుంది.
mahashivratri
హిందూ క్యాలెండర్ ప్రకారం.. మహాశివరాత్రి ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షం చతుర్దశి నాడు వచ్చిన ఈ మహాశివరాత్రి సర్వార్థ సిద్ధి యోగంలో వచ్చింది. అందుకే ఈ పండుగను ఎంతో పవిత్రంగా భావిస్తున్నారు. ఈ రోజు సర్వార్థ సిద్ది యోగంతో పాటుగా శివయోగం, శ్రావణ నక్షత్రం అద్భుతమైన కలయిక ఏర్పడింది. ఈ మహాశివరాత్రి ఉపవాసం రేపు అంటే మార్చి 9 న సిద్ది యోగంతో పూర్తవుతుంది. ఈ సమయాల్లో శివరాత్రి రావడం వల్ల శివభక్తులు మంచి పుణ్య ఫలాలను పొందుతారు.
శివయోగం
శివయోగం సమయంలో పరమేశ్వరుడికి పూజ చేయడం వల్ల ఆయన అనుగ్రహం పొందుతారు. అలాగే మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి.
సిద్ధి యోగం
ఈ యోగం విఘ్నేషుడికి సంబంధించింది. ఈ సిద్ధి యోగంలో వినాయకుడిని పూజిస్తే మీరు మొదలుపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అలాగే మీ ఇల్లు సుఖసంతోషాలతో వర్థిల్లుతుంది.
శ్రావణ నక్షత్రం
శనిదేవుడు శ్రావణ నక్షత్రానికి అధిపతి. ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి పనిలో మంచి ఫలితాలను పొందుతారు. ఈ శ్రావణ నక్షత్రం పౌర్ణమితో మొదలవుతుంది.ఈ రోజు కొత్త పనులను మొదలు పెట్టొచ్చు.అలాగే షాపింగ్ కూడా చేయొచ్చు.
mahashivratri 2024
శుక్ర ప్రదోషం, మహాశివరాత్రి
ఈ ఏడాది శుక్ర ప్రదోష ఉపవాసం, మహాశివరాత్రి సారి వచ్చాయని పండితులు చెబుతున్నారు. ఈ శుక్ర ప్రదోషంలో వచ్చే మహాశివరాత్రిని ఎంత పవిత్రంగా భావిస్తారు. ఈ రోజు శివయ్యను పూజించడం వల్ల మీ కష్టాలు, బాధలన్నీ తొలగిపోతాయి. అలాగే ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది.