మహాలక్ష్మీ వ్రతం ప్రారంభం.. ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసా?
మహాలక్ష్మీ వ్రతం 2023: సనాతన ధర్మంలో లక్ష్మీదేవికి ప్రత్యేక స్థానముంది. శ్రీలక్ష్మీదేవిని సంపదకు అధిదేవతగా కొలుస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మన జీవితంలో శాంతి, సంపద, సుఖసంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం.అయితే మహాలక్ష్మీ వ్రతం భాద్రపద మాసంలో స్టార్ట్ అవుతుంది. మరి ఈ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
మహాలక్ష్మీ వ్రతం 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుక్లపక్షంలోని ఎనిమిదో రోజున మహాలక్ష్మి వ్రతం ప్రారంభమవుతుంది. ఈ ఉపవాసం కనీసం 16 రోజులు ఉండటం ఆనవాయితీగా వస్తోంది. హిందూ మతంలో.. ప్రతి శుక్రవారం శ్రీలక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున అమ్మవారిని పూజిస్తారు. కాగా ఈ ఏడాది మహాలక్ష్మీ వ్రతం శుక్రవారం నుంచి సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఈ రోజే ప్రారంభమైంది.
మహాలక్ష్మీ వ్రతం ప్రాముఖ్యత
మహాలక్ష్మీ వ్రతంలో శ్రీలక్ష్మీదేవి అమ్మవారిని నిష్టగా పూజిస్తారు. ఈ 16 రోజులు అమ్మవారిని నిష్టగా పూజిస్తే మన జీవితంలోని అన్ని దుఖాలు, కష్టాలన్నీ తొలగిపోయి.. సుఖసంతోషాలు కలుగుతాయని నమ్మకం. పురాణాల ప్రకారం.. ఈ రోజు ఉపవాసం ఉంటే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీ జీవితంలో బాధలు మటుమాయం అవుతాయి. అంతేకాదు మీ కుటుంబం ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుంది. శ్రేయస్సు కలుగుతాయి.
ఈ పని చేయొద్దు
16 రోజుల పాటు సాగే మహాలక్ష్మీ వ్రతంలో ప్రతి ఇంట్లో శ్రీలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందుకే మహాలక్ష్మి వ్రతం ప్రారంభానికి ముందు మీ ఇంటిని, ఇంటి ఆలయాన్ని పూర్తిగా శుభ్రం చేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవీ ఎప్పుడూ కూడా మురికి ప్రదేశంలో ఉండదు. అలాగే విరిగిన పాత్రలు, పగిలిన గాజులు మొదలైన వాటిని ఇంట్లో ఉంచకూడదు. ఇది లక్ష్మీమాతకు కోపం తెప్పిస్తుంది. దీనివల్ల మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేరు.
లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మహాలక్ష్మీ వ్రతం నాడు ఉదయం, సాయంత్రం వేళల్లో మీ ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర నెయ్యి దీపాలను వెలిగించండి. ఉపవాసానికి ముందు ఇంటి ప్రధాన గుమ్మ వద్ద పసుపు, కుంకుమలతో లక్ష్మీదేవి పాదముద్రలను వేయండి.. అలాగే లక్ష్మీ ఓం లక్ష్మీ నమః అనే మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించాలి.