Maha Shivaratri: మహా శివరాత్రి పర్వదినాన ఈ పనులను పొరపాటున కూడా చేయకండి..
Maha Shivaratri: హిందువులు జరుపుకునే పండుగల్లో మహా శివారాత్రి ఎంతో ప్రత్యేకమైంది. ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. అందుకే ఈ పండుగ రోజు కొన్ని పనులను అస్సలు చేయకూడదు. అలా చేస్తే మీకు పూజా ఫలితం కూడా దక్కదు.

Maha Shivaratri: మాఘ మాసంలో బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది. ఈ రోజు శివుడికి ఎంతో ప్రత్యేకమైంది. ఈ రోజునే ఆ పరమేశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటున్నాయి.
lord Shiva
ఈశ్వరుడి నుంచి లింగ రూపంలోకి మారే మహాశివరాత్రి రోజు ఆ భోళాశంకరుడికి భక్తులు ఎంతో నిష్టగా, భక్తి శ్రద్ధలతో పూజలు, అభిషేకాలు చేస్తారు. ఆ రోజు మహాశివుడిని పూజించి అభిషేకిస్తే.. ఆ దేవదేవుడి చల్లని దీవెనలో తమపై ఉండి కోరిన వరాలను నెరవేరుస్తాడని భక్తులు నమ్ముతుంటారు.
పురాణాల ప్రకారం.. శివ అనే అక్షరాలు ఎంతో పవిత్రమైనవి. ఇవెంతో గొప్పవి కూడా. శివ అంటే మంగళకరమైనదని, శివ స్వరూపమైనది పురాణాలు చెబుతున్నాయి.
మరి ఈ మహా శివరాత్రి రోజున ఎలాంటి పనులు చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదు? వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
చేయాల్సిన పనులు: మహా శివరాత్రి నాడు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉండే శివాలయాలకు వెళ్లి శివుడిని దర్శించుకోవాలి. శివుడిని పూజించేటప్పుడు ఖచ్చితంగా ‘ఓం నమ: శివాయా’ అనే మంత్రాని పఠించాలి. శివుడికి నైవేద్యంగా పులిహోర కూడా పెట్టాలట.
lord Shiva
ముఖ్యంగా ఆ పరమేశ్వరుడికి నైవేధ్యంగా పంచామృతాన్ని పెట్టాలని పురాణాల్లో పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తలస్నానం చేసి శివుడిని పూజించాలి.
ఉపవాసం ఉండేవాళ్లు పచ్చి మంచి నీళ్లు కూడా తాగకూడదని ఎంతో మంచి చెప్తూ ఉంటారు. కానీ అలా అని పురాణాల్లో ఎక్కడా ప్రస్తవించలేదు. కాబట్టి నీళ్లు పండ్లు, పాలు, సాత్విక ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే శరీరాన్ని కష్టపడుతూ శివుడిపై మనస్సును నిలపలేరు.
శివరాత్రి మహా పర్వదినాన దాన దర్మాలు చేయాలి. పేదలకు అన్న దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పుణాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా శివుడికి స్వచ్ఛమైన నీళ్లతో అభిషేకం చేయాలని పురాణాలు చెబతున్నాయి.
చేయకూడని పనులు: శివరాత్రి రోజు శివలింగాన్ని పూజించేటప్పుడు గానీ అభిషేకించేటప్పుడు గానీ పొరపాటున కూడా తులసి ఆకులను ఉపయోగించకూడదు.
శివరాత్రి పర్వదినాన శివలింగాన్ని అభిషేకించేటప్పుడు పొరపాటున కూడా ప్యాకెట్ పాలను ఉపయోగించడకూడదట. దేవుడి అభిషేకానికి ఆవు పాలు మంచివని గుర్తించుకోవాలి.
అభిషేకించే టప్పుడు లింగంపై మన వెంట్రుకలు కానీ చెమట గానీ పడకూడదట. ముఖ్యంగా ఆ రోజున ఆల్కహాల్, స్మోకింగ్ అస్సలు చేయకూడదు. మరొక ముఖ్యమైన విషయం భార్యా భర్తలు కలయికలో పాల్గొనకూడదు.