ఇలాంటి సంకేతాలు కనపడుతున్నాయా? రాత్రికి రాత్రే మీరు కోటీశ్వరులు కావడం ఖాయం..!
లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సుకు మారుపేరు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంపద వస్తుంది. మనం చేసే పనుల కారణంగా లక్ష్మీదేవి సంతృప్తి చెందితే.. వెంటనే మనకు కొన్ని సంకేతాలు ఇస్తుంది. మరి, ఎలాంటి సంకేతాలు శుభ సూచికమో తెలుసా?

లక్ష్మీ కటాక్షం
లక్ష్మీదేవి సంతోషించినప్పుడు, మీ ఇల్లు సంపద, శ్రేయస్సుతో నిండి ఉంటుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ ఒకే చోట ఉండదు. కాబట్టి, ఆమె ఆశీర్వాదాలు పొందడానికి, ఆమెను సంతోషపెట్టడానికి ఎప్పటికప్పుడు కొన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుందో.. అక్కడ ఎప్పుడూ సంపద, శ్రేయస్సుకు కొరత ఉండదు. లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెట్టడానికి ముందే, మన సంపద పెరుగుతుంది అని తెలియజేస్తూ కొన్ని సంకేతాలు పంపుతుంది. ఆ సంకేతాల ద్వారా ఆ తల్లి కటాక్షం మనపై ఉందని, మనం చేసే పనుల వల్ల ఆమె సంతోషంగా ఉందని, మన ఇంట్లోకి అడుగుపెడుతుందని అర్థం. మరి, ఆ సంకేతాలు ఏంటో చూద్దాం...
ఇంటి నుండి బయలుదేరినప్పుడు వీటిని చూడటం....
మీరు ఇంటి నుంచి బయటకు బయలుదేరినప్పుడు నీరు లేదా పాలతో కూడిన పాత్రను చూస్తే.. అది సంపద, కీర్తిని పొందడానికి సంకేతం. అయితే, ఖాళీ కుండ లేదా పాత్రలను చూడటం అశుభం అని పరిగణిస్తారు.
శంఖం ధ్వని...
మనం ఉదయం నిద్రలేవగానే శంఖం శబ్దం వినపడటం చాలా శుభప్రదంగా, అదృష్టానికి సంకేతంగా పరిగణిస్తారు. శంఖం లక్ష్మీదేవికి చాలా ప్రియమైన వస్తువు. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అనడానికి ఇది సంకేతం.
ఆవు పేడ వేయడం...
మీ ఇంటి ముందు ఆవు పేడను పదే పదే వేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఇలా మీరు ఆవుపేడను చూడటం కూడా అదృష్టంగా భావిస్తారు. ఇలా మీకు కనపడింది అంటే... మీ సంపద, శ్రేయస్సు పెరుగుతుందని అర్థం.
పాజిటివ్ ఫీలింగ్...
మీరు మీ ఇంట్లో సానుకూల భావన కలిగి ఉంటే, మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా , సంతోషంగా ఉంటారు. కొంత ఆహారంతో సంతృప్తి చెందితే, ఇది లక్ష్మీదేవి ఆశీర్వాదాలకు స్పష్టమైన సంకేతం. ఇది లక్ష్మీదేవి మీ పట్ల దయ చూపుతుందని సూచిస్తుంది.
కలలో గుడ్లగూబను చూడటం
మీరు లక్ష్మీదేవి లేదా ఆమె వాహనం అయిన గుడ్లగూబను కలలో చూసినట్లయితే, అది శుభ సంకేతంగా పరిగణిస్తారు. ఇది మీ ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమవుతాయని, లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు అపారమైన సంపదను పొందుతారని సూచిస్తుంది. వాస్తవానికి, గుడ్లగూబను చూడటం రాత్రికి రాత్రే అదృష్టంలో మార్పుకు సంకేతం.