కృష్ణాష్టమి కరెక్టు తేదీ ఇదే.. పూజ ముహూర్తం ఎప్పుడంటే?
Krishna Janmashtami 2023: హిందూ మతంలో జన్మాష్టమి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రీకృష్ణుని జన్మదినం రోజున ఈ దేవున్ని పూజించడం వల్ల భక్తుల బాధలన్నీ తొలగిపోతాయని మత విశ్వాసాలు చెబుతున్నాయి. అయితే జన్మాష్టమిని సెప్టెంబర్ 06న జరుపుకుంటారా లేక సెప్టెంబర్ 07న జరుపుకుంటారా అనే విషయంలో కొందరిలో అయోమయం నెలకొంది. కరెక్టు తేదీ ఏంటంటే?
Krishna Janmashtami 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం ఎనిమిదో రోజున శ్రీకృష్ణుడి జయంతిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. హిందూమతంలో శ్రీకృష్ణ జన్మాష్టమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడిని నిషితకాలంలో అంటే అర్ధరాత్రి పూజిస్తారు. అయితే ఈ ఏడాది జన్మాష్టమిని సెప్టెంబర్ 06న జరుపుకుంటారా? లేక సెప్టెంబర్ 07న జరుపుకుంటారా? అనే విషయంలో కొందరిలో అయోమయం నెలకొంది.
కృష్ణ జన్మాష్టమి కరెక్టు తేది ఎప్పుడంటే?
వైదిక క్యాలెండర్ ప్రకారం.. కృష్ణ జన్మాష్టమి కృష్ణ పక్ష అష్టమి తిథి సెప్టెంబర్ 06 మధ్యాహ్నం 03:27 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 07 సాయంత్రం 04:14 గంటలకు ముగుస్తుంది. రోహిణి నక్షత్రం సెప్టెంబర్ 06న ఉదయం 09:20 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 7 ఉదయం 10:25 గంటల వరకు కొనసాగుతుంది. అయితే నిషిత కాలంలో శ్రీకృష్ణుని ఆరాధన కారణంగా జన్మాష్టమి పండుగను సెప్టెంబర్ 6 న జరుపకుంటారు.
కానీ వైష్ణవ మతస్తులు అష్టమి తిథి, రోహిణి నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు. సప్తమి తిథి నాడు జన్మాష్టమిని జరుపుకోరు. ఈ కారణంగా జన్మాష్టమి పండుగను వైష్ణవ శాఖ 07 ఆగస్టు 2023 గురువారం జరుపుకుంటుంది.
కృష్ణ జన్మాష్టమి 2023 పూజా ముహూర్తం?
పంచాంగం ప్రకారం.. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడిని సెప్టెంబర్ 06 రాత్రి 11.17 నుంచి 12.03 వరకు పూజిస్తారు. అలాగే సెప్టెంబర్ 07వ తేదీ రాత్రి 11.16 గంటల నుంచి 12.03 గంటల మధ్య వైష్ణవ శాఖ వారు బాలగోపాలుడిని పూజిస్తారు.
janmashtami 2023 upay
కృష్ణ జన్మాష్టమి శుభయోగం
శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున చాలా పవిత్రమైన యోగాలు ఏర్పడనున్నాయని జ్యోతిష్య పంచాంగంలో చెప్పబడింది. ఈ పర్వదినం సందర్భంగా హర్షనయోగం రాత్రి 10.26 గంటల వరకు కొనసాగుతుంది. అలాగే రోజంతా సర్వార్థ సిద్ధి యోగం, రవియోగం ఉదయం 06.01 నుంచి 09.20 వరకు జరుగుతుంది. ఈ శుభ యోగాలన్నీ ఆరాధనకు ఉత్తమమైనవిగా భావిస్తారు.