MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • కృష్ణాష్టమి 2023: శ్రీకృష్ణుడిని నుంచి ఈ విషయాలను నేర్చుకుంటే మీ జీవితం సంతోషంగా ఉంటుంది.. ఎలాంటి బాధలు ఉండవు

కృష్ణాష్టమి 2023: శ్రీకృష్ణుడిని నుంచి ఈ విషయాలను నేర్చుకుంటే మీ జీవితం సంతోషంగా ఉంటుంది.. ఎలాంటి బాధలు ఉండవు

krishna janmashtami 2023 : కృష్ణాష్టమిని ఈ ఏడాది రెండు రోజుల పాటు అంటే సెప్టెంబర్ 6, సెప్టెంబర్ 7 న జరుపుకోబోతున్నాం. అయితే శ్రీకృష్ణుడిని మనం నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇవి మనల్ని జీవితాంతం ఆనందంగా ఉంచుతాయి. అవేంటంటే.. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 02 2023, 12:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Janmashtami

Janmashtami

krishna janmashtami 2023 : కృష్ణ జన్మాష్టమి పండుగ సమీపిస్తోంది. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో కృష్ణ పక్షం ఎనిమిదో రోజు  శ్రీకృష్ణుని జయంతిని జరుపుకుంటాం. ఈ సంవత్సరం కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 6, సెప్టెంబర్ 7 న జరుపుకోబోతున్నాం. ఈ రోజు శ్రీకృష్ణుడిని నిష్టగా పూజిస్తారు. కంసుడి దురాగతాలకు అంతం పలకడానికి జన్మాష్టమి రోజున విష్ణువు కృష్ణుడి రూపంలో ఎనిమిదో  అవతారం ఎత్తాడని నమ్ముతారు. శ్రీ కృష్ణుడు తన జీవితంలోని అన్ని సంబంధాలను చాలా నిజాయితీగా నిర్వర్తించాడు. శ్రీకృష్ణుడి జీవితంలోని ఇలాంటి విశేషాలు ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. అవి మనల్ని జీవితాంతం సంతోషంగా ఉంచుతాయి.
 

25
Janmashtami 2023

Janmashtami 2023

పోరాటమే జీవితం

మొదటి నుంచి శ్రీకృష్ణుడి జీవితం పోరాటాలతోనే నిండిపోయింది. మేనమామ అయిన కంసుడు శ్రీకృష్ణుడిని చంపడానికి ఎన్నో కుట్రలు పన్నుతారు. కానీ కృష్ణుడు ఈ అడ్డంకుల నుంచి ఎప్పుడూ తప్పుకోలేదు. ఈ పోరాటాలను ఎంతో సహనంతో ఎదుర్కొన్నారు. అలాగే ప్రతి వ్యక్తి ధైర్యాన్ని కోల్పోకుండా జీవితంలో కష్టాలను ఎదుర్కొంటూనే ఉండాలి. చేసే పనుల గురించి చింతించకుండా తన కర్తవ్యాన్ని కొనసాగించాలి. చివరికి గెలుపు నీదే అవుతుంది.

35

నిజమైన స్నేహం

కృష్ణుడు, సుధామ స్నేహం గురించి అందరికీ తెలిసిందే. శ్రీకృష్ణ భగవానుడు స్నేహానికి అవధులు పెట్టేవాడు కాదు. ఉన్నత, దిగువ, ధనిక, పేద, చిన్న, పెద్ద పరిమితులకు కన్నయ్య దూరంగా ఉంటాడు. వారి స్నేహాన్ని చూసి.. ప్రతి వ్యక్తి వారి సంబంధానికి విలువ ఇవ్వడం నేర్చుకోవాలి.

45

నిజమైన ప్రేమ

బృందావనంలో రాధతో పాటు శ్రీకృష్ణుడిని అమితంగా ప్రేమించే గోపికలు చాలా మందే ఉన్నారు. కానీ కృష్ణుడు మాత్రం ఆ గోపికలందరినీ ఎంతో గౌరవించేవాడు. కాని రాధపై అతని ప్రేమ అతని జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం. శ్రీకృష్ణుని ప్రేమ, స్నేహితురాళ్ల పట్ల ఉన్న గౌరవం నుంచి నేటి ప్రేమికులు ఎంతో నేర్చుకోవాలి. 
 

55

తల్లిదండ్రులు

శ్రీకృష్ణుడు దేవకి, వసుదేవుని కుమారుడు. కాని ఈయనను పెంచింది మాత్రం యశోద, నందుడు. అయినప్పటికీ శ్రీకృష్ణుడు తన జీవితంలో తన తల్లి దేవకి, యశోద ఇద్దరికీ సమాన స్థానం ఇచ్చాడు. వారిద్దరి పట్ల తన కర్తవ్యాన్ని ఎంతో చక్కగా నిర్వర్తించాడు. తల్లిదండ్రుల స్థానం మన జీవితంలో అత్యున్నతంగా ఉండాలని కృష్ణుడు ఈ ప్రకృతి ద్వారా ప్రపంచానికి బోధించాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Brahma Muhurtam: బ్రహ్మ ముహూర్తంలో ఈ 2 పనులు చేస్తే ఎంతో శుభం, ఇంతకీ బ్రహ్మ ముహూర్తం అంటే?
Recommended image2
Shivratri: మహా శివరాత్రి రోజున శివయ్య పూజలో వీటిని మాత్రం వాడకూడదు, ఎందుకో తెలుసా?
Recommended image3
కోటి రూపాయ‌లు ఇచ్చినా స‌రే.. ఈ 7 ప్ర‌దేశాల‌కు అస్స‌లు వెళ్ల‌కండి. చాణ‌క్య ఇలా ఎందుకు చెప్పారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved